Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్‌
  • Web Stories
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • CJI UU Lalit
  • Gorantla Madhav
  • Vice President Of India
  • Heavy Rains
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Off The Record Warangal Trs Politics

Warangal TRS Politics : అధికార పార్టీ లీడర్లు… ఎమ్మెల్యే సీట్లు

Published Date :August 3, 2022
By Sista Madhuri
Warangal TRS Politics :  అధికార పార్టీ లీడర్లు… ఎమ్మెల్యే సీట్లు

Warangal TRS Politicsఆ జిల్లాలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు.. ఎంపీ, ఎమ్మెల్సీల భయం పట్టుకుందట. ఎన్నికల్లో ఎక్కడ తమ సీటుకు ఎసరు పెడతారో అని ప్రతిక్షణం ఆందోళన చెందుతున్నారట. వారి టెన్షన్‌కు తగ్గట్టుగానే సొంత పార్టీ నేతల కదలికలు ఉన్నాయనేది కేడర్‌ చెప్పేమాట. ఇంకేముందీ శాసనసభ్యుల్లో పరేషాన్‌ పీక్స్‌కు చేరుకుంటోందట. అది ఏ జిల్లానో ఈ స్టోరీలో చూద్దాం.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో టీఆర్ఎస్‌ రాజకీయాల రంగు రోజు రోజుకీ మారుతోంది. కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. అభ్యర్థులను మార్చేస్తారన్న ప్రచారం అందులో పీక్స్‌లో ఉందట. దీనికితోడు ఇద్దరు ఎంపీలు.. ఐదుగురు ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారని చెవులు కొరుక్కుంటున్నారు. సిట్టింగ్‌లపై జనాల్లో వ్యతిరేకత ఉందని పరోక్షంగా సొంత పార్టీ వర్గాలు చేపడుతున్న ప్రచారం కూడా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది.

జిల్లాలో కాంగ్రెస్‌ కార్యక్రమాలు పెరగడం.. బీజేపీ కాలుదువ్వుతుండటంతో.. ఈ దఫా పోటీ ఆషామాషీ కాదనే చర్చ జరుగుతోంది. జిల్లాలో ఐదారు స్థానాల్లో అధికారపార్టీకి ఎదురీత తప్పదని సర్వే రిపోర్టులు చెబుతున్నాయట. మొన్నటి వరకు టికెట్‌పై ఎవరూ పెద్దగా మాట్లాడకపోయినా.. ఇప్పుడిప్పుడే స్వరాలు పెరుగుతున్నాయి. సర్వే ఆధారంగా అభ్యర్థులను మార్చాలని చూస్తే.. పోటీకి సిద్ధమనే సంకేతాలు పంపుతున్నారట. అయితే ఈ జాబితాలో ఎంపీలు.. కొందరు ఎమ్మెల్సీలు ఉండటంతో వారికి ఛాన్స్‌ ఇస్తే.. తమ పరిస్థితి ఏంటని ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారట.

మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత.. లోకల్‌ అసెంబ్లీ సీటుకు గురిపెట్టారు. వరంగల్‌ ఎంపీ దయాకర్‌ వర్ధన్నపేట సీటు ఆశిస్తున్నారట. వర్థన్నపేట వీలు కాకపోతే స్టేషన్‌ ఘన్‌పూర్‌ అయినా ఓకే అంటున్నారట. ఎమ్మెల్సీ పదవుల్లో ఉన్నా.. బస్వరాజు సారయ్య, కడియం శ్రీహరి.. మధుసూదనా చారిలు ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో దిగాలని ఫిక్స్‌ అయినట్టు తెలుస్తోంది.

బస్వరాజు సారయ్య వరంగల్‌ తూర్పుపై ఫోకస్‌ పెట్టి.. అక్కడ కార్యక్రమాల జోరు పెంచారు. కడియం శ్రీహరి సైతం.. నియోజకవర్గంలో అదే పనిగా పర్యటన చేస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు శ్రీహరికి పడదు. గతంలో స్పీకర్‌గా ఉండటం వల్లే 2018 ఎన్నికల్లో ఓడినట్టు మధుసూదనాచారి భావిస్తున్నారట. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ.. భూపాలపల్లిపై మమకారం చంపుకోవడానికి సిద్ధంగా లేననే సంకేతాలు ఇస్తున్నారట. మంత్రి సత్యవతి రాథోడ్‌ డోర్నకల్‌పై ఆశలు పెంచుకున్నారట. ఎంపీ కవిత ఎమ్మెల్యేగా పోటీ చేస్తే.. రెడ్యనాయక్‌ లోక్‌సభ బరిలో ఉంటారని.. అప్పుడు తనకు లైన్‌ క్లియర్‌ అవుతుందని భావిస్తున్నారట.

ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వల్ల ఎవరి సీటుకు ఎర్త్‌ పడుతుందో కేడర్‌కు అంతుచిక్కడం లేదట. ఇలా ఎంపీలు.. ఎమ్మెల్సీలు తమ మనసులోని మాటను అధిష్ఠానం దృష్టిలో పడేలా జాగ్రత్త పడుతున్నారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఎమ్మెల్యేలలో బీపీ పెరిగిపోతోందట. మరి సిట్టింగ్‌ల పరేషాన్‌ ఎప్పుడు తొలుగుతుందో ఏమో చూడలి.

  • Tags
  • Basavaraju Saraiah
  • kadiyam srihari
  • Kavitha Maloth
  • MP Dayakar
  • S. Madhusudhana Chary

WEB STORIES

జుట్టు రాలుతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి!

"జుట్టు రాలుతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి!"

బ్రోకలీ రెగ్యులర్‌గా తింటే.. ఎన్నో లాభాలు

"బ్రోకలీ రెగ్యులర్‌గా తింటే.. ఎన్నో లాభాలు"

Just For Fun: ఇది మీకోసం కాదు.. అయినా ఇంత తేడానా..?

"Just For Fun: ఇది మీకోసం కాదు.. అయినా ఇంత తేడానా..?"

Chikoti Praveen:  చికోటి ప్రవీణ్‌..? ఆసక్తికరమైన విషయాలు..!

"Chikoti Praveen: చికోటి ప్రవీణ్‌..? ఆసక్తికరమైన విషయాలు..!"

ప్రపంచంలోని 10 ఎత్తైన విగ్రహాలు

"ప్రపంచంలోని 10 ఎత్తైన విగ్రహాలు"

Badam Tea: బాదం టీతో ఎన్నో లాభాలు

"Badam Tea: బాదం టీతో ఎన్నో లాభాలు"

Dulquer Salmaan: హీరో కాకపోయుంటే డ్రైవర్ని అయి ఉండేవాడిని

"Dulquer Salmaan: హీరో కాకపోయుంటే డ్రైవర్ని అయి ఉండేవాడిని"

Naga Chaitanya: నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు?  చిరాకేస్తుంది

"Naga Chaitanya: నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు? చిరాకేస్తుంది"

ఏయే పండ్లలో ఎంత షుగర్ ఉంటుందంటే..?

"ఏయే పండ్లలో ఎంత షుగర్ ఉంటుందంటే..?"

యాలకులు రోజూ తీసుకుంటే.. ఎన్నో లాభాలు

"యాలకులు రోజూ తీసుకుంటే.. ఎన్నో లాభాలు"

RELATED ARTICLES

Kadiyam Srihari: ‘మీరొస్తేనే ఓటు.. వేరే వాళ్లకి వేయమని చెప్పొద్దు’

MLA Post : వాళ్ళందరికీ చేతిలో పదవి ఉన్నా..ఎమ్మెల్యే కావాలన్న కోరిక బలంగా నాటుకపోయిందా..?

TRS : తెలంగాణ రాజకీయంలో కొత్తపుంతలు తొక్కుతున్న తూర్పు వర్గపోరు

ఎమ్మెల్సీ కడియంను కలిసిన ఎమ్మెల్యే అరూరి రమేష్

బీజేపీ నేతలకు కౌంటర్‌ ఇచ్చిన టీఆర్ఎస్‌ నాయకులు..

తాజావార్తలు

  • Jagananna Vidya Deevena: శుభవార్త.. నేడు బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో నిధులు జమ చేయనున్న సీఎం జగన్..

  • Kim Jong Un: కోవిడ్ పై విజయం సాధించామంటున్న కిమ్..

  • Thursday Special Sri Dattatreya Swamy Stotra Parayanam: రెండవ శ్రావణ గురువారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే సకల శుభాలు

  • Nagarjuna Sagar: భారీగా వరద.. 10 గేట్లు ఎత్తివేత

  • Thursday 2022 Special Sri Shirdi Sai Chalisa Live: ఈ రోజు రీ సాయి చాలీసా వింటే సిరిసంపదలు మీ వెంటే

ట్రెండింగ్‌

  • Raksha Bandhan 2022: ఇంతకీ రాఖీ పండగ ఎప్పుడు? 11వ తేదీనా లేదా 12వ తేదీనా?

  • Common Wealth Games @india: కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు భారీగా బంగారం

  • Friendship Day 2022: కులమతాలకు అతీతం.. పేద, ధనిక తేడా తెలియని బంధం..!!

  • Vice President Salary: ఉప రాష్ట్రపతి ఎంత వేతనం అందుకుంటారు? ఎలాంటి సదుపాయాలు లభిస్తాయి?

  • KCR Press Meet: రేపటి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా: సీఎం కేసీఆర్

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions