నన్నపనేని నరేందర్.. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే. ఇంకొకరు బస్వరాజు సారయ్య, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ. మూడో వ్యక్తి గుండు సుధారాణి, వరంగల్ మేయర్. ఈ ముగ్గురి మధ్య వరంగల్ తూర్ప టీఆర్ఎస్ రాజకీయం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. కోల్డ్‌వార్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకరంటే ఒకరికి పడదు. ముగ్గురి మధ్య అనేక సందర్భాలలో అభిప్రాయభేదాలు బయటపడ్డాయి కూడా. గత ఏడాది దసరా సమయంలోనే రచ్చ రచ్చ అయింది. తాజాగా పట్టణ ప్రగతి కార్యక్రమం ఆ వర్గపోరును పీక్స్‌కు తీసుకెళ్లడంతో…
మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కారు గుర్తు, గులాబీ జెండా గుర్తుతో గెలిచిన విషయాన్ని మంత్రి ఈటెల రాజేందర్ గుర్తుంచుకోవాలని… తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది పని చేశారని… వారంత కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమించారని పేర్కొన్నారు. అందులో ఈటెల ఒక్క కార్యకర్త మాత్రమే…టీఆర్ఎస్ పెట్టిన తర్వాత 2003 లో ఈటెల జాయిన్ అయ్యారని చురకలు అంటించారు. కేసీఆర్ తమ నాయకుడు అని.. ఆయన నాయకత్వంలో పని చేసేందుకు నియోజక వర్గ ప్రజాప్రతినిధులు,…