Telangana Assembly War : అసెంబ్లీ వేదికగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Assembly War : అసెంబ్లీ వేదికగా అధికార పక్షానికి, బీజేపీకి మధ్య వార్ మొదలైందా? మాటలు.. విమర్శలు.. సవాళ్లు మరో అంకానికి చేరుకుంటున్నాయా? BAC బ్యాక్ డ్రాప్‌లో నేతలు కత్తులు నూరుతున్నారా? తాజా ఎపిసోడ్ ఎలాంటి టర్న్ తీసుకుంటుంది? రెండు పార్టీల శిబిరాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్..!
తెలంగాణ అసెంబ్లీ తొలిరోజు సమావేశాలు పది నిమిషాల్లోనే ముగిసినా.. తర్వాత జరిగిన BAC సమావేశం మాత్రం బీజేపీకి, అధికార పక్షానికి మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. శాసనసభా వ్యవహారాల సలహ కమిటీ.. BAC మీటింగ్‌కు పిలవకపోవడంపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై గతంలోనూ పలుమార్లు బీజేపీ ఎమ్మెల్యేలు సభాపతిని కలిసి మాట్లాడిన ఉదంతాలు ఉన్నాయి. తాజా సమావేశాలతో ఆ అంశం మరోసారి చర్చకు కారణమైంది.
Also Read
బీఏసీ సమావేశానికి పిలవకపోవడంపై బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావులు విమర్శలు చేశారు. సంప్రదాయాలను గౌరవించాలని చెబుతూనే.. సభాపతిపై ఈటల చేసిన వ్యాఖ్యలపై అధికారపక్షం భగ్గుమంది. శాసనసభా వ్యవహారాల మంత్రి ప్రశాంతరెడ్డి తీవ్రంగానే స్పందించారు. స్పీకర్‌కు ఈటల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి. గతంలో ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్న సమయంలో బీఏసీలో బీజేపీకి అవకాశం లేదన్నది గుర్తు తెచ్చుకోవాలన్నారు ప్రశాంత్‌రెడ్డి. అంతేకాదు.. ఈటల వ్యాఖ్యలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. సభాపతిపై చేసిన కామెంట్స్‌పై నోటీసులు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. నోటీసు ఇస్తే చట్టబద్ధంగా ఎదుర్కొంటామని చెబుతోంది బీజేపీ.
బీజేపీని BAC మీటింగ్‌కు పిలవకూడదని ఏ రూల్ ప్రకారం నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే రఘునందన్‌రావు. గతంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ఎందుకు పిలిచారు అని ప్రశ్నిస్తోంది బీజేపీ. సభలో ఒకరు, ఇద్దరు సభ్యులు ఉన్న పార్టీలను కూడా బీఏసీకి పిలిచిన ఉదంతాలు ఉన్నాయని.. ఆ సంప్రదాయాలను గౌరవించాలని బీజేపీ నేతలు కోరుతున్నారు. అసలు ఒక పార్టీకి ఎంతమంది సభ్యులు ఉంటే ఆహ్వానిస్తారో కూడా చెప్పాలని ప్రశ్నలు సంధించారు రఘునందన్‌రావు.
మొత్తానికి రాష్ట్రంలో తాజా రాజకీయ వాతావరణ పరిస్థితులు తొలిరోజు అసెంబ్లీ సమావేశాల తర్వాత కూడా కనిపించాయి. ఈ నెల 12, 13న అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో.. ఆ లోపుగా ఇంకేమైనా పరిణామాలకు ఆస్కారం ఉందా? లేక ఇదే విధంగా అధికారపక్షం.. బీజేపీ ఎమ్మెల్యేలు మాటలతో కత్తులు దూసుకుంటారా? ఈటల వ్యాఖ్యలపై నోటీసు ఇవ్వాలన్నదానిపై స్పీకర్‌దే తుది నిర్ణయం కావడంతో.. ఆయన ఏం చేస్తారు? అనేది ప్రస్తుతం పొలిటికల్ సర్కిళ్లలో ఆసక్తి కలిగిస్తోంది. మరి.. ఈ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
-
El Nino: ఎల్‌నినోతో భూమికి భారీ ముప్పు.. బద్దలుకానున్న రికార్డులు!
-
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!