Undavalli: ఉండవల్లి-కేసీఆర్ కలిసి నడుస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం కేసీఆర్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏం మాట్లాడుకున్నారు? ఇద్దరి భేటీపై ఎందుకు ఆసక్తి రేగుతోంది? ఉండవల్లి తదుపరి రాజకీయం ప్రయాణం ఏంటి? కేసీఆర్, ఉండవల్లి రాజకీయంగా కలిసి నడుస్తారా? లెట్స్ వాచ్..!
కేసీఆర్‌తో ఉండవల్లి భేటీపై ఆసక్తికర చర్చ
ఉండవల్లి అరుణ్ కుమార్. మాజీ ఎంపీ. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సడెన్‌గా హాట్ హాట్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత సైలెంట్‌గా ఉంటూ.. కీలక అంశాలపై అప్పుడప్పుడూ మీడియా ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో రాజకీయ వేడి కాక మీద ఉంది. జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ అజెండాతో ముందుకెళ్లాలని చూస్తున్న సీఎం కేసీఆర్ BRS పేరుతో కొత్త నేషనల్ పార్టీ పెట్టే యోచనలో ఉన్నారు…spot.. అలాంటి కేసీఆర్‌తో ఉండవల్లి భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇద్దరూ కలిసి పనిచేస్తారా?
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉండవల్లి కరుడుగట్టిన సమైక్య వాదిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం గట్టిగా వాదించి సక్సెస్ అయ్యారు కేసీఆర్. అలాంటి ఇద్దరూ సమావేశం కావడం రాజకీయ మేధావుల బుర్రకు పెద్ద పనే పెట్టింది. ఇద్దరూ ఎందుకు భేటీ అయ్యారు? ఈ సమావేశం వెనక బలమైన కారణం ఉందా? రానున్న రోజుల్లో ఇద్దరూ కలిసి పనిచేస్తారా? ఇలా అనేక ప్రశ్నలు పొలిటికల్ సర్కిళ్లలో షికారు చేస్తున్నాయి.
Also Read
- OTR : పాలమూరు కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
- OTR : అమరావతిపై మంత్రి నారాయణ స్పీడ్ తగ్గిందా? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది?
- Off The Record : ఆకునూరి మురళి రాజీనామా వెనుక అసలు కథ ఏంటి? విద్యా కమిషన్‌లో ఏం జరిగింది?
- OTR : Congress లిస్ట్‌లో ఆ రెండు జిల్లాలదే సస్పెన్స్.. రంగారెడ్డి, సంగారెడ్డి డీసీసీ రేసు..!
కొత్తపార్టీకి ఉన్న అవకాశాలపై లోతైన విశ్లేషణ
ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు ఉండవల్లి. ఉమ్మడి ఏపీ విభజన తర్వాత ఉండవల్లి ఆపార్టీలో చేరతారు.. ఈ పార్టీలో చేరతారు అని చర్చ జరిగినా అవి చర్చగానే మిగిలిపోయాయి. కానీ.. జాతీయ పార్టీ కోసం కేసీఆర్ కసరత్తు చేస్తున్న తరుణంలో జరిగిన భేటీ కావడంతో గులాబీ బాస్‌తో ఉండవల్లి కలిసి రాజకీయ ప్రయాణం చేస్తారా అనే ప్రశ్న బలంగా చర్చల్లో ఉంది. ఇద్దరి మధ్య దేశ, రాష్ట్ర తాజా రాజకీయాలపై విస్తృతంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుత వాతావరణంలో కొత్త పార్టీకి ఉన్న అవకాశాలపై లోతైన విశ్లేషణ చేసినట్టు చెబుతున్నారు.
రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేమా?
జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయ అజెండా కోసం సీఎం కేసీఆర్ చాలా కసరత్తు చేసినట్టుగా.. ఆయనతో భేటీ తర్వాత అర్థమైనట్టు తన సన్నిహితులతో ఉండవల్లి అన్నారట. అలాగే కొత్త రాజకీయ పార్టీపై తనకున్న ఆలోచనలను కేసీఆర్‌తో ఉండవల్లి పంచుకున్నట్టు సమాచారం. ఇప్పటికే వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులతో తెలంగాణ సీఎం భేటీ అవుతున్నారు. ఆ క్రమంలోనే ఉండవల్లితో సమావేశమైనట్టు మరో ప్రచారం ఉంది. అయితే రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేం. కేసీఆర్ పెట్టే జాతీయ పార్టీకి ఎవరెవరు కలిసి వస్తారో.. ప్రయాణం సాగిస్తారో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. అప్పుడే ఉండవల్లి పొలిటికల్ భవిష్యత్ కూడా క్లారిటీ వస్తుందని అనుకుంటున్నారట.
తాజావార్తలు
-
Satya Kumar Yadav: ‘ఎబోలా’పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం.. అధికారులకు ఆదేశాలు జారీ.!
-
Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఆ ప్రాంతాలకు వీక్లీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్..
-
Anaparthi: చోరీ ముఠా గుట్టురట్టు.. 13 కేసుల్లో నిందితుల అరెస్ట్.. రూ.75 లక్షల బంగారం స్వాధీనం
-
West Bengal: బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు బ్యాడ్ న్యూస్.. బెంగాల్ ప్రభుత్వం బిగ్ యాక్షన్! ఆ సెంటర్లు రెడీ..
-
RR VS MI: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీ వైపే..
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?