Off The Record: తెలుగు రాష్ట్రాల సీఎంల ఢిల్లీ మీటింగ్లో ఏం జరిగింది..?
- బనకచర్ల కేంద్రంగా హాట్ హాట్ పొలిటికల్ పంచ్‌లు..
- ఎవరిది పైచేయి అవుతుందని మీటింగ్‌కు ముందు చర్చలు..
- బనకచర్లతో పాటు అన్ని విషయాలు మాట్లాడామన్న నిమ్మల..
- బనకచర్లపై చర్చ జరగలేదన్న తెలంగాణ సీఎం రేవంత్..
- కేంద్ర జలశక్తి శాఖ నోట్‌లో కూడా కనిపించని బనకచర్ల..
- ఏపీ మంత్రి నిమ్మల అలా ఎందుకు చెప్పారన్న చర్చ..
- ఏపీ మంత్రి ఒకలా, తెలంగాణ సీఎం, సెంట్రల్ నోట్ మరోలా..
- స్పెషల్ అజెండాల ప్రస్తావన లేకుండానే ముగిసిన మీటింగ్..
- రకరకాల అభ్యంతరాలున్నందున బనకచర్ల చర్చ వద్దన్న ఉత్తం..
- బనకచర్ల ప్రస్తావన వచ్చినా దాని మీద ఎలాంటి చర్చల్లేవ్..
- మిగతా అంశాల మీదే చర్చ, కీలక నిర్ణయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఢిల్లీ మీటింగ్‌లో బనకచర్ల ప్రస్తావన వచ్చిందా? ఆ ప్రాజెక్ట్ గురించిన చర్చ జరిగిందా? అలాంటిదేం లేదని తెలంగాణ సీఎం చెబుతుంటే… ప్రస్తావించామని ఏపీ మినిస్టర్ ఎందుకు అన్నారు? రెండిటిలో ఏది నిజం? అసలా మీటింగ్‌లో ఏం జరిగింది? ఇన్‌సైడ్ మేటర్స్ ఏంటి?
Read Also: Husband Suicide: ప్రియుడి మోజులో భార్య.. సెల్ఫీ వీడియో రికార్డు చేసి భర్త ఆత్మహత్య..
Also Read
ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం. ఇద్దరు సీఎంలతో… కేంద్ర జల శక్తి శాఖ మంత్రి అధ్యక్షతన మీటింగ్ అనగానే… రెండు రాష్ట్రాల్లో ఒకటే ఉత్కంఠ. అందునా…. బనకచర్ల సెంట్రిక్‌గా…పొలిటికల్ పంచ్‌లు హాట్ హాట్‌గా పేలుతున్న వేళ ఆ ప్రాజెక్ట్ విషయంలో కీలక నిర్ణయాలు ఉంటాయా? వద్దంటున్న తెలంగాణ పట్టు బిగిస్తుందా? లేక వదలనంటున్న ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుందా? అన్న చర్చోపచర్చలు. డైరెక్ట్‌గా కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో ఇద్దరు సీఎంల మీటింగ్ అంటే… మామూలుగా ఉండబోదంటూ విపరీతమైన హైప్ వచ్చేసింది. ఇక మీటింగ్ అయ్యాక… ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. బనకచర్ల తో పాటు అన్ని విషయాలు చర్చకు వచ్చాయని చెప్పారు. ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తంకుమార్ రెడ్డి ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించి జలశక్తి శాఖ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వివరించారు.
Read Also: Off The Record: కాస్త ఆగండి, వేచి చూద్దామని ఈటల చెప్పారా..?
అయితే, బనకచర్లపై చర్చ జరగలేదని చెప్పారు. అంతేకాదు…. సమావేశానికి సంబంధించిన అధికారిక వివరాలను కేంద్ర జలశక్తి శాఖ కూడా విడుదల చేసింది. ఆ నోట్‌లో సైతం ఎక్కడా… బనకచర్ల ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు జరిగినట్టు లేదు. ఇక్కడే తేడా కొడుతోందట పరిశీలకులకు. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి ఆ చర్చ రాలేదన్నారు. అటు కేంద్ర జలశక్తి శాఖ నోట్ సైతం ఆయన మాటల్ని సమర్ధిస్తున్నట్టుగానే ఉంది. మరి ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మాత్రమే చర్చ జరిగినట్టు ఎందుకు చెప్పారన్నది బిగ్ క్వశ్చన్. తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై దాదాపు రెండు నెలల నుంచి చర్చలు నడుస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ మీదుగా ఢిల్లీకి చేరింది వ్యవహారం. మేటర్ హై లెవెల్ చర్చలదాకా వెళ్లడంతో అందరి అటెన్షన్ అటువైపు మళ్ళింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్‌ని కలిసి… ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలను వ్యక్తం చేశారు. దాంతో ఏపీ సర్కార్ సైతం బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇవ్వడంతోపాటు.. తామ తెలంగాణకు వ్యతిరేకం కాదని, ఆ రాష్ట్ర నీటి అవసరాలకు అడ్డుపడబోమని చెబుతూ.. కేవలం దిగువ రాష్ట్రంగా… సముద్రంలో కలిసే నీళ్ళను మాత్రమే వాడుకోవాలనుకుంటున్నట్టు క్లారిటీ ఇచ్చేసింది.
Read Also: Vaishnavi Murder: యువతి వైష్ణవి మర్డర్ మిస్టరీ.. ఇంతకీ హత్యా..? పరువు హత్యా..?
అదంతా డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడసలు సబ్జెక్ట్ అంతా… తాజాగా జరిగిన ఢిల్లీ మీటింగ్‌లో బనకచర్ల గురించి మాట్లాడారా లేదా అన్న అంశం చుట్టూనే తిరుగుతోంది. అది కూడా… ఏపీ మంత్రి, ఒకలాగా, తెలంగాణ సీఎం, సెంట్రల్ నోట్ మరోలాగా ఉండటంతోనే ఈ అనుమానాలు వచ్చాయి. దాంతో… లోపల అసలేం జరిగిందన్న ఆరాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే… ఇద్దరి మాటలు నిజమేనన్నది ఇన్‌సైడ్ టాక్. అదెలా సాధ్యం అంటే… అసలు ట్విస్ట్ అక్కడే ఉందని అంటున్నాయి కేంద్ర వర్గాలు. బనకచర్ల అన్న మాట అయితే వచ్చిందిగానీ… దాని మీద ఎలాంటి చర్చ జరగలేదట. ఢిల్లీలో సమాశానికి ముందు తెలుగు రాష్ట్రాల నుంచి వేర్వేరు అజెండాలతో వెళ్ళారు నాయకులు. తీరా చర్చల సమయానికి మాత్రం.. మొత్తం సీన్ మారిపోయిందట. స్పెషల్ అజెండాల ప్రస్తావన లేకుండానే జరిగిపోయినట్టు తెలుస్తోంది. పోలవరం-బనకచర్ల అనుసంధానంపై కేంద్ర జలసంఘం, గోదావరి బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన క్రమంలో… దాని మీద అసలు చర్చ అవసరంలేదని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నట్టు తెలిసింది.
Read Also: Off The Record: కురుపాం టీడీపీలో పీక్స్కు చేరిన విభేదాలు..
అందుకు తగ్గట్టే దాని మీదేమీ విస్తృత చర్చ జరగలేదు. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే… బనకచర్ల ప్రస్తావన అయితే వచ్చిందిగానీ… దాని మీద మీటింగ్‌లో ఎలాంటి చర్చ జరగలేదు. జరిగింది ఇదే కాబట్టి… ఈ విషయంలో ఇక చర్చోపచర్చలకు తావు లేదన్నది కేంద్ర జలశక్తి శాఖ వర్గాల మాట. మీటింగ్‌కు ముందు అయితే… బనకచర్ల విషయంలో ఏదో జరిగిపోతుందని, కేంద్రం ఏ రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని తెగ మాట్లాడేసుకున్నారు అంతా. తీరా… మీటింగ్ జరిగాక మాత్రం…. అంత సీన్ లేదని తేలిపోయింది. హై లెవల్ మీటింగ్‌లో కొత్త ప్రాజెక్ట్ ప్రస్తావన లేకుండానే.. మిగతా అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి అంగీకరించారు ఇద్దరు ముఖ్యమంత్రులు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాల పరిష్కారానికి ఓ ప్రత్యేక కమిటీ నియామకం కీలకమన్న నిర్ణయానికి వచ్చారు. దాంతోపాటు టెలిమెట్రిక్ పరికరాల ఏర్పాటు, శ్రీశైలం డ్యాం మరమ్మతులు, కృష్ణ, గోదావరి బోర్డులు ఎక్కడ ఉండాలన్న అంశాలపై నిర్ణయాలు జరిగాయి. ఇలా… మొత్తంగా చూసుకుంటే… మీటింగ్‌లో బనకచర్ల మీద ఎలాంటి చర్చ జరగలేదన్నది క్లియర్ అంటున్నాయి కేంద్ర జలశక్తి శాఖ వర్గాలు.
తాజావార్తలు
-
PM Svanidhi: 55 లక్షల మందికి గుడ్ న్యూస్.. పీఎం స్వనిధి పథకంలో మరిన్ని ప్రయోజనాలు..పూర్తి వివరాలు ఇవే!
-
Trump Tariff Cut: ట్రంప్ కీలక నిర్ణయం.. టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు.. ఈ రంగాలకు ప్రయోజనం
-
Horror Thriller OTT : మగాళ్లను వశం చేసుకునే మోహినీ పిశాచి… ఓటీటీలోకి వచ్చిన హారర్ థ్రిల్లర్
-
Operation Checkmate: ‘ఆపరేషన్ చెక్‌మేట్’లో 30 మంది భారతీయ ట్రక్ డ్రైవర్లు అరెస్ట్.. అమెరికా నుంచి బహిష్కరణకు సిద్ధం
-
Peddi Inside Talk : ‘పెద్ది’ ఇన్ సైడ్ రిపోర్ట్.. ఫస్టాఫ్ అదిరింది..సెకండాఫ్ కొంచం?
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!