Off The Record: తెలంగాణ మంత్రులు జాగ్రత్త పడుతున్నారా? అమ్మో వాళ్ళా.. అంటూ ఉలిక్కి పడుతున్నారా? లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకు? దూరంగా ఉంచితే పోలా అంటూ.. ఎక్స్‌ట్రా కేర్ తీసుకుంటున్నారా? ఇంతకీ ఎవరికి భయపడుతున్నారు మంత్రులు? ఎందుకలా జరుగుతోంది?
Read Also: Andhra King Taluka Trailer: ఫ్యాన్స్‌ను ఎగతాళి చేశాడు రా.. ఆడికి మనమేంటో చూపెట్టాలి!
తెలంగాణ మంత్రుల పేషీల్లో జరుగుతున్న వ్యవహారాలపై ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వివిధ అవసరాల కోసం వచ్చే ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులతో పేషీల సిబ్బంది చులకనగా మాట్లాడ్డం, పనులు చేయాలంటే డైరెక్ట్‌గానే డబ్బులు అడగడం లాంటి వ్యవహారాలు నడుస్తున్నాయట. దీంతో అన్ని పేషీలపై ప్రభుత్వ పెద్దలు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. కాగా కొద్ది రోజుల క్రితం మంత్రి సురేఖ ఓఎస్డీ ఓ కేసులో బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించింది ప్రభుత్వం. ఆ తర్వాత ఆయన్ను అరెస్టు చేసేందుకు చేసిన ప్రయత్నాలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఒక రకంగా ఆ ఎపిసోడ్‌లో ప్రభుత్వం ఇరుకున పడటంతతోపాటు ప్రతిపక్షానికి అస్త్రం అయింది. దాంతో అలర్ట్ అయిన ముఖ్యమంత్రి కార్యాలయం మంత్రుల పేషీల వ్యవహారాలపై ఓ కన్నేసి ఉంచాలని నిఘా విభాగాన్ని ఆదేశించినట్టు తెలిసింది.
Read Also: Off The Record: అనర్హత పిటిషన్స్ పై త్వరలోనే నిర్ణయం..ఆ ఇద్దరి మీద చర్యలు ఉంటాయా ?
రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా వ్యవహారాల్లో మంత్రుల నిర్ణయాలు కీలకం. వాళ్ళ దగ్గర జరిగే అన్ని సమావేశాల్లో ఓఎస్డీలు, పిఎస్ లు, పీఏలు ఉంటున్నారు. మినిస్టర్స్ ఉన్నతాధికారులతో జరిపే సమీక్ష సమావేశాలకు సైతం పేషీ సిబ్బంది హాజరవుతుంటారు. ఈ క్రమంలోనే కొన్ని కీలక విషయాలకు సంబంధించిన సమాచారం బయటకు వెళ్తోందని, దానితోనే.. కొందరు ఇతరులను బెదిరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో… కొండా సురేఖ విషయంలో జరిగిన తప్పు తమ దగ్గర జరగొద్దన్న ఉద్దేశ్యమో.. లేక వేరే ఆలోచన ఉందో తెలియదు గానీ.. కొందరు మంత్రులు అప్రమత్తం అయ్యారు. కొద్ది మంది ఇప్పటికే తమ పేషీల్లోని ఓఎస్డీలను తొలగించారు. మరికొందరు సిబ్బందిని మార్చినట్టు తెలుస్తోంది. ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దగ్గర పనిచేస్తున్న ఓఎస్డీని ఇటీవల మరో పోస్టుకు పంపారు.
Read Also: Maanya Anand: కమిట్‌మెంట్ ఇవ్వమని వెంటపడ్డాడు.. హీరో ధనుష్ మేనేజర్‌పై నటి షాకింగ్ కామెంట్స్!
ఇక, సీనియర్ ఐఏఎస్ రిజ్వి విఆర్ఎస్ తర్వాత జూపల్లి ఓఎస్డీ ఇతర పోస్టుకు వెళ్లిపోవడంతో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర పని చేసే ఓఎస్డీ సైతం కొంతకాలంగా పేషీ విధులకు దూరంగా ఉంటున్నారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేషీలోని ఓఎస్డీ కూడా కొంతకాలంగా సెక్రటేరియట్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే, చాలామంది పాత వాళ్ళను మార్చేస్తున్నట్టు తెలుస్తోంది. వాళ్ళు చేసే పనులతో మనం బద్నాం కావద్దని అనుకుంటూ…కాస్త నమ్మకంగా ఉండే వాళ్ళనే పెట్టుకుంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి సెక్రటేరియట్‌లో..