Off The Record: ఆ నియోజకవర్గంలో తండ్రి వైసీపీ ఇన్ఛార్జ్‌గా ఉండగానే… ఆయన కుమార్తెకు టీడీపీ ఇన్ఛార్జ్ పోస్ట్ ఎలా ఇచ్చారు? కనీసం పార్టీ ప్రాధమిక సభ్యత్వం కూడా లేని నాయకురాలిని ఇన్ఛార్జ్‌గా ఎలా నియమించారు? సడన్‌గా తెరపైకి వచ్చిన కూతురు పొలిటికల్ ఏంట్రీకి తెర వెనుక ఏం జరిగింది…? తండ్రి పార్టీ మారడానికి ముందస్తు స్కెచ్ వేస్తున్నారా? ఎవరా తండ్రీ కూతుళ్ళు? ఏంటా పొలిటికల్ మ్యాచ్ ఫిక్సింగ్?
Read Also: Chiranjeevi Fans : చిరంజీవి పిలుపుతో ప్రస్తుతానికి ఆగాం కానీ మా పోరాటం ఆగదు!
రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణలు ఆసక్తి రేపుతున్నాయి. ఇవి ఒకరకంగా….లోకల్ టిడిపిలో వర్గ విభేదాలకు దారి తీస్తున్నాయట . ఇక్కడ సీనియర్స్‌ని కాదని, అసలు పార్టీ సభ్యత్వం కూడా లేని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కుమార్తె అమూల్యకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడం చూసి అంతా షాకవుతున్నారట. గొల్లపల్లి సూర్యారావు ప్రస్తుతం రాజోలు వైసీపీగా ఉన్నారు. అలాంటిది ఆయన కూతురికే టీడీపీ ఇన్ఛార్జ్ ఇవ్వడం ఏంటో అర్ధంగాక లోకల్ తమ్ముళ్లు తలలు బాదుకుంటున్నారు. గత ఎన్నికలకు ముందు టిడిపి ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు గొల్లపల్లి సూర్యారావు. రాజోలు టిక్కెట్‌ను జనసేనకు ఇవ్వడంతో… ఇక తనకు ఛాన్స్ రాదనుకుని సైకిల్ దిగేశారు సూర్యారావు. గత ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేసి ఓడిపోయారాయన. ఆయన వెళ్లిపోయినప్పటి నుంచి టిడిపికి ఇన్ఛార్జ్ లేరు. దీని కోసం చాలా మంది సీనియర్లు ప్రయత్నం చేసినా ఎవరికీ దక్కలేదు. లోకేష్ పాదయాత్రలో ఆంతా తామై నడిపిన నాయకులు, ఇతర ముఖ్య నేతలు గట్టి ప్రయత్నం చేసినా వర్కౌట్ కాలేదు. వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే…రాపాక వరప్రసాదరావు కూడా ఇన్ఛార్జ్ పదవి కోసం టిడిపిలో చేరడానికి ముమ్మరంగా ప్రయత్నించారట. కానీ 16 నెలలుగా ఎవ్వరికీ ఛాన్స్ ఇవ్వకుండా అలాగే ఉంచేశారు.
Read Also: Vijay TVK Karur stampede: విజయ్ కావాలనే ఆలస్యంగా రావడంతో తొక్కిసలాట..ఎఫ్ఐఆర్లో సంచలన అంశాలు
అలా.. అందర్నీ పక్కన పెట్టేసి ఆకస్మికంగా టీడీపీలో కనీసం ప్రాధమిక సభ్యత్వం కూడా లేని, రాజోలు రాజకీయాల్లో ఎప్పుడూ కనిపించని గొల్లపల్లి అమూల్యను తెర మీదికి తీసుకురావడం ఏంటో అర్ధం కావడం లేదట. ఈ ఆకస్మిక రాజకీయ పరిణామాలపై టిడిపి శ్రేణుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గొల్లపల్లి సూర్యారావు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరే ప్రయత్నంలో ఉన్నారా అన్నది వాళ్ళ అనుమానం. పథకం ప్రకారం ముందు కుమార్తెను పంపి పావులు కదుపుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయట. పార్టీలో చేరటానికి ముందే కమిట్మెంట్ తీసుకుని, తర్వాత కొద్ది నెలలకు లైన్ క్లియర్ చేసుకొని వెళ్ళడం సూర్యారావుకు కొత్తేమీకాదు. గత ఏడాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటానికి జనవరి నెలలోనే కమిట్మెంట్ తీసుకుని ఎన్నికలకు ముందు మే నెలలో పార్టీలో చేరారు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం జరుగుతుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. రానున్న కొద్ది రోజుల్లోనే గొల్లపల్లి సూర్యారావు టిడిపిలో చేరుతారని స్థానికంగా విస్తృత ప్రచారం జరుగుతోంది.
Read Also: Rashmika Mandanna : జిమ్ లో కత్తిలాంటి అందాలకు చెమటలు పట్టిస్తున్న రష్మిక..
ఇదే విషయాన్ని వైసీపీ శ్రేణులు సూర్యారావు దగ్గర ప్రస్తావించినప్పుడు ఆయన కౌంటర్ మరోలై ఉందట. అమూల్య నా కూతురే కాదంటూ ఆయన సీరియస్ అవుతున్నట్టు సమాచారం. అటు అమూల్యకు ఇన్చార్జి పదవి ఇవ్వడం పట్ల టీడీపీ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అసలు పార్టీ సభ్యత్వంలేని అమూల్యకు నియోజకవర్గ ఇన్చార్జి పదవి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారట. దీని వెనక స్థానిక మంత్రి పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కొందరు టిడిపి సీనియర్ నాయకులు పార్టీ అధిష్టానంపై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఎస్సీ రిజర్వుడ్‌గా ఉన్న రాజోలు… పునర్విభజనలో జనరల్ అవుతుందన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే…డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీన్ని సొంత నియోజకవర్గంగా మార్చుకుంటాన్నది ఇంకో వెర్షన్. దీంతో రాజోలులో కూటమి పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి.