Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Tandur Trs Politics

తాండూరు టీఆర్ఎస్‌లో ఆగని తన్నులాటలు..!

Published Date :December 15, 2021 , 2:40 pm
By Manohar
తాండూరు టీఆర్ఎస్‌లో ఆగని తన్నులాటలు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

తాండూరు టీఆర్‌ఎస్‌లో తన్నులాటలకు ఫుల్‌స్టాప్‌ పడదా..? తెగేవరకు లాగడమే అక్కడి నేతల లక్ష్యమా..? గతంలో జరిగిందేంటి..? ఇప్పుడూ అలాగే జరగాలేమోనని కేడర్‌ ఎందుకు అనుకుంటోంది? నేతలను నియంత్రించడం సాధ్యం కావడం లేదా?

తాండూరు టీఆర్‌ఎస్‌లో తగ్గేదే లే..!

Also Read

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్
  • Off The Record : తెలంగాణ బీజేపీ నేతల తీరును ఎండగడుతున్న సొంత కేడర్
  • Off The Record : టీడీపీ అధిష్టానం మీద వత్తిడి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారా?

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ టీఆర్ఎస్‌ వర్గపోరు..రోజుకో రకంగా రచ్చ లేపుతోంది. సద్దుమణిగింది అనుకుంటున్న సమస్య.. మళ్లీ మొదటికి వస్తున్న పరిస్థితి. ఆధిప్యతపోరులో ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి తగ్గేదే లే అంటున్నారు.

ఓ రేంజ్‌లో గొడవలు..!

పట్నం మహేందర్‌రెడ్డి గతంలో ఇక్కడ ఎమ్మెల్యే. టీఆర్‌ఎస్‌ తొలి ప్రభుత్వంలో మంత్రి. 2018 ఎన్నికల్లో పట్నం ఓడిపోయారు. ఆయనపై కాంగ్రెస్‌ నుంచి గెలిచిన పైలెట్‌ రోహిత్‌రెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్‌లోకి వచ్చేశారు. అప్పటి నుంచి తాండూరు టీఆర్ఎస్‌లో గొడవలు ఓ రేంజ్‌లో నడుస్తున్నాయి. పట్నం మహేందర్‌రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగాఉన్నారు. తాజా ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా గెలిచారు కూడా.

అప్పట్లో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వర్సెస్‌ పట్నం..!

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్‌లో వర్గపోరు అలజడి కొత్త కాదు. అప్పట్లో చేవెళ్ల ఎంపీగా ఉన్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి.. మంత్రిగా ఉన్న పట్నం మహేందర్‌రెడ్డికి అస్సలు పడేది కాదు. తీవ్రస్థాయిలో కోల్డ్‌వార్‌ నడిచేది. సందర్భాన్ని బట్టి టీఆర్‌ఎస్‌ సర్దుబాటు చేసినా గొడవలు ముదురు పాకాన పడ్డాయే తప్ప తగ్గలేదు. చివరకు ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ను వీడి వెళ్లిపోవడంతో ఆ ఎపిసోడ్‌కు తెరపడింది. ఇప్పుడు పైలెట్‌ రోహిత్‌రెడ్డి వర్సెస్‌ పట్నం మహేందర్‌రెడ్డి మొదలైంది.

తీరు మార్చుకోవాలని చెప్పినా మార్పు లేదా..?

పట్నం.. పైలెట్‌లకు ఎప్పటికప్పుడు సర్ది చెబుతున్నా.. ఇద్దరూ కొద్దిరోజులే సైలెంట్‌గా ఉంటున్నారు. అవకాశం చిక్కితే కుస్తీ పడుతున్నారు. తాజా గొడవ ఆ కోవలోకే వస్తుంది. రచ్చ రచ్చ అవుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు పట్నం. కానీ.. ఆయన్ని రెండోసారి ఎమ్మెల్సీని చేసింది పార్టీ. తీరు మార్చుకోవాలని ఇద్దరికీ పార్టీ నచ్చజెబుతున్నా.. వారి వైఖరిలో మార్పు లేదు. టీఆర్ఎస్‌ పెద్దలు ఇద్దరికీ సయోధ్య చేస్తారా? లేక గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎవరో ఒకరు బయటకి పోతేనే పరిస్థితిలో మార్పు వస్తుందా? అని గులాబీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయట. మరి.. తాండూరు టీఆర్ఎస్‌లో రాజకీయ సెగలు ఎప్పుడు చల్లారతాయో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Politics
  • Tandur
  • Tandur trs politics
  • telangana
  • TRS

తాజావార్తలు

  • UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..

  • PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం.!

  • Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్

  • The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?

  • S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions