SIR New Schedule: తెలంగాణ, ఏపీ సహా 6 రాష్ట్రాల్లో SIR గడువు పొడిగింపు.. కొత్త షెడ్యూల్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana SIR Deadline Extended: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision – SIR) ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణతో పాటు మరో ఐదు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ గడువును పొడిగిస్తూ కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. మహారాష్ట్ర, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, హర్యానా, తెలంగాణ, నాగాలాండ్ రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారుల విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు గురువారం (అక్టోబర్ 29) ఆయా రాష్ట్రాలకు, ఢిల్లీకి ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, నాగాలాండ్ రాష్ట్రాల్లో తుది ఓటర్ల జాబితాలను నవంబర్ 30న ప్రచురించనున్నారు. ఢిల్లీలో మాత్రం తుది ఓటర్ల జాబితా డిసెంబర్ 22న విడుదల కానుంది.
తెలంగాణలో ఎస్ఐఆర్కు కొత్త గడువు
తెలంగాణలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం గడువును సవరించింది. క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారానికి నవంబర్ 26 వరకు గడువు ఇచ్చింది. అనంతరం తుది ఓటర్ల జాబితాను నవంబర్ 30న ప్రచురించనున్నారు. ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు, వివరాల్లో తప్పులు ఉన్నవారు, ఇతర అభ్యంతరాలు ఉన్నవారు నిర్ణీత గడువులోగా సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read
- Virat Kohli: ఢిల్లీ కాలుష్యంపై అవగాహనకు విరాట్ కోహ్లీ సాయం తీసుకోండి.. ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచన
- UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
- Neha Bora: నాలుగోసారి కూడా.. శాంతి ఒప్పందంపై సంతకానికి నేహా బోరా నిరాకరణ
- Bangladesh: షేక్ హసీనా వీడియో వివాదం.. బంగ్లాదేశ్ మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి మృతి..
ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త షెడ్యూల్
హర్యానా: నవంబర్ 20
ఆంధ్రప్రదేశ్: నవంబర్ 20
మహారాష్ట్ర: నవంబర్ 25
నాగాలాండ్: నవంబర్ 25
తెలంగాణ: నవంబర్ 26
ఢిల్లీ: డిసెంబర్ 15
మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, నాగాలాండ్ రాష్ట్రాల్లో తుది ఓటర్ల జాబితాలను నవంబర్ 30న విడుదల చేయనున్నారు. ఢిల్లీలో మాత్రం డిసెంబర్ 22న తుది జాబితా ప్రచురించనున్నారు.
ఢిల్లీ, మహారాష్ట్రలో మారిన ఎస్ఐఆర్ గడువులు
మహారాష్ట్రలో క్లెయిమ్‌లు, అభ్యంతరాలు దాఖలు చేసేందుకు గతంలో అక్టోబర్ 26 వరకు గడువు ఉండగా, తాజాగా దానిని నవంబర్ 13 వరకు పొడిగించారు. నోటీసుల జారీ, క్లెయిమ్‌ల పరిష్కార ప్రక్రియను నవంబర్ 25 వరకు కొనసాగించనున్నారు. తుది ఓటర్ల జాబితాను నవంబర్ 30న విడుదల చేయనున్నారు. ఇక ఢిల్లీలో క్లెయిమ్‌లు, అభ్యంతరాలు సమర్పించే గడువును అక్టోబర్ 30 నుంచి నవంబర్ 25 వరకు పొడిగించారు. వాటి పరిష్కారానికి నవంబర్ 30 వరకు ఉన్న గడువును డిసెంబర్ 15కు మార్చారు. తుది ఓటర్ల జాబితా ప్రచురణ తేదీని కూడా నవంబర్ 30 నుంచి డిసెంబర్ 22కు మార్చారు.
దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ
ఓటర్ల జాబితాల్లో పారదర్శకతను పెంచడం, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం, అనర్హమైన లేదా తప్పుగా నమోదైన వివరాలను గుర్తించడం లక్ష్యంగా ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను చేపట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయిలో ఓటర్ల వివరాలను పరిశీలించి, అవసరమైన మార్పులు, చేర్పులు, తొలగింపులు చేపడతారు. ఇందుకోసం ఎన్నికల అధికారులు ఇంటింటికీ వెళ్లి వివరాలను ధ్రువీకరిస్తారు. ఎస్ఐఆర్ మూడో దశను మే 14న ప్రారంభించారు. ఇందులో ఢిల్లీ, మహారాష్ట్ర కూడా ఉన్నాయి. ఈ మూడో దశ పూర్తయితే హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లడఖ్ మినహా దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తవుతుంది.
తాజావార్తలు
-
SIR New Schedule: తెలంగాణ, ఏపీ సహా 6 రాష్ట్రాల్లో SIR గడువు పొడిగింపు.. కొత్త షెడ్యూల్ ఇదే!
-
Friday Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని డబ్బు!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!
-
Virat Kohli: ఢిల్లీ కాలుష్యంపై అవగాహనకు విరాట్ కోహ్లీ సాయం తీసుకోండి.. ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచన
-
World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?