రఘువీరా వస్తారా? కుమార్తెను బరిలో దింపుతారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయాలు చేశారు. సీఎం రేస్ వరకు వెళ్లారు కూడా. సడెన్‌గా పాలిటిక్స్‌కు దూరం. ఆథ్యాత్మిక.. సేవా కార్యక్రమాలకే పరిమితమై.. వాటిని కంప్లీట్ చేసేశారు. ఇప్పుడు పొలిటికల్‌గా యాక్టివ్ అవుతారా? పార్టీ మారబోతున్నారా? ఎవరా నాయకుడు?
2019 తర్వాత రాజకీయాలకు దూరం..!
Also Read
రఘువీరారెడ్డి. రాజకీయాల గురించి కాస్త అవగాహన ఉన్న వారికి ఈ పేరు.. సుపరిచితమే. అనంతపురం జిల్లా మడకశిర ప్రాంతానికి చెందిన ఆయన.. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా.. రెండుసార్లు మంత్రిగా.. పీసీసీ అధ్యక్షుడిగా తనదైన ముద్ర వేశారు. ఒకానొక సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలో సీఎం రేసులో నిలబడ్డ నాయకుడు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంతో రాజకీయాలకు దూరంగా వెళ్లారు. 2019 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. పీసీసీ పదవికి రాజీనామా చేసి.. స్వగ్రామం నీలకంఠాపురంకు వెళ్లిపోయారు రఘువీరారెడ్డి. పార్టీకి పార్టీ కార్యక్రమాలకు, సమావేశాలకు దూరంగా ఉండిపోయారు.
టీడీపీ, వైసీపీ నుంచి ఆహ్వానాలు ఉన్నాయా?
సొంతూరులో నీలకంఠేశ్వరస్వామి ఆలయ పునర్మాణ పనుల్లో పడిపోయారు రఘువీరారెడ్డి. ఒకప్పుడు క్షణం తిరిక లేకుండా విమానాల్లో తిరిగిన ఆయన.. సాధారణ జీవితానికి పరిమితం అయ్యారు. రైతుగా మారి గడ్డి మోపులు మోశారు. పిల్లలతో ఆటలు, పెద్దలతో రచ్చబండపై ముచ్చట్లు.. టీవీఎస్ మోపెడ్‌పై చక్కర్లు.. ఇదే రఘువీరారెడ్డి జీవితం. ఆలయ పునర్‌నిర్మాణం పూర్తయింది. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఆలయాన్ని నిర్మించారు. ఆరు నెలల తర్వాత రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని.. కొన్ని పార్టీలు ఆయనవైపు చూస్తున్నాయని.. ఇప్పటికే మంతనాలు జరిగాయని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఇందులో ప్రధానంగా టీడీపీ ఉంది. అధికార వైసీపీ నుంచి కూడా ఆహ్వానాలు ఉన్నాయని అంటున్నారు. దానిపై రఘువీరా ఎక్కడా నోరు విప్పలేదు. కనీసం సన్నిహితులతో సూచాయగా కూడా తన అభిప్రాయం చెప్పలేదు.
రఘువీరాను లాగేందుకు టీడీపీ గట్టి ప్రయత్నాలే చేస్తోందా?
రఘువీరా బహిరంగంగా మాట్లాడి దాదాపు మూడేళ్లు కావస్తోంది. ఇటీవల జరిగిన మాజీ సీఎం రోశయ్య సంస్మరణ సభకు వచ్చి రఘువీరా మాట్లాడారు. రోశయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత రాజకీయాలను ప్రస్తావించలేదు. అయితే రఘువీరా ఇప్పుడే రాజకీయాల్లోకి రారని.. నీలకంఠాపురంలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆస్పత్రి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది. దీనికి సుమారు ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తరువాతే రాజకీయాలవైపు చూసే అవకాశం ఉందని సన్నిహితులు చెబుతున్నారు. కానీ రఘువీరాను లాగేందుకు టీడీపీ నుంచి గట్టి ప్రయత్నాలే జరుగుతున్నట్టు సమాచారం.
వారసురాలిగా కుమార్తెను ఎన్నికల బరిలో దించుతారా?
ఆయన చుట్టూ ఇంత జరుగుతున్నా.. రఘువీరా నోరు విప్పడం లేదు. మనసులో మాట చెప్పడం లేదు. రాజకీయాల్లో పునః ప్రవేశం చేస్తారా? లేక ఇప్పటిలాగే దూరంగా ఉంటారన్నది స్పష్టం కావట్లేదు. మరోవైపు రఘువీరా వారసురాలిగా ఆయన కుమార్తె వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతారనే ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే రఘువీరా రాజకీయాల్లోకి వస్తారా లేక కుమార్తెకు సహకరిస్తూ ఉంటారో చూడాలి.
తాజావార్తలు
-
Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
-
Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
-
MYSAA : రష్మిక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘మైసా’ రిలీజ్ డేట్ లాక్
ట్రెండింగ్
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!