ఒకరికేమో ప్రభుత్వంలోని పెద్దల అండ. ఇంకొకరికి అదే శాఖలో బడా బాబుల ఆశీస్సులు. ఇలా పెద్దోళ్లే వెనకుండటంతో ఒకే కుర్చీకోసం కుస్తీ పడుతున్నారు ఆ ఇద్దరు అధికారులు. బదిలీ అయినా వెళ్లకుండా ఒకరు.. ఛార్జ్ తీసుకోవాలని ఇంకొకరు వేయని ఎత్తులు లేవు. అదే ఆ జిల్లా వైద్యవర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. సంగారెడ్డి డీఎంహెచ్‌వో పోస్టు కోసం 4 నెలలుగా కుర్చీలాట! జిల్లాస్థాయి పోస్టులంటే రాజకీయ ప్రమేయం లేకుండా జరగవు. మనవాళ్లు అనేవాళ్లను తీసుకొచ్చి కూర్చీలో కూర్చోబెట్టుకోవడం కామన్.…