మాజీ మంత్రి పెద్దిరెడ్డికి విద్యాసాగర్‌రావు ఆఫర్ ఇచ్చారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక మాజీ మంత్రి చేరిక.. ఇంకో మాజీ మంత్రి అలకకు కారణమైంది. అసంతృప్తితో ఉన్న ఆ నాయకుడిని ఎలా బుజ్జగించాలో పార్టీ నేతలకు అంతుచిక్కడం లేదు. అందుబాటులో ఉన్న పెద్దలందరినీ పంపి సముదాయిస్తున్నారట. ఈ సందర్భంగా ఒక ఆఫర్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. దానికి ఆయన ఒప్పుకొంటారా? ఇంతకీ ఎవరా నాయకుడు? ఏంటా ఆఫర్?
బీజేపీ పెద్దలు ఆఫర్ ఇచ్చారట
Also Read
మాజీ మంత్రి ఇ. పెద్దిరెడ్డి బీజేపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఆయన్ని కాషాయ శిబిరంలోనే ఉంచాలని కమలనాథులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బండి సంజయ్ మొదలుకొని.. సీనియర్లుగా గుర్తింపు పొందిన బీజేపీ నాయకులు.. మోస్ట్ సీనియర్లు పెద్దిరెడ్డితో మాట్లాడుతున్నారు. వాస్తవానికి మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిక ఆయనకు రుచించడం లేదు. అందుకే పెద్దిరెడ్డి చెంతకు ఒక ఆఫర్ తీసుకెళ్లారట బీజేపీ నాయకులు. దానిపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది.
బీజేపీలో ఉండబోరని.. టీఆర్‌ఎస్‌లో చేరతారని ప్రచారం!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీలో ఓ వెలుగు వెలిగిన పెద్దిరెడ్డి.. మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీజేపీలో రాజకీయ భవిష్యత్‌ను వెతికే పనిలో పడ్డారు. హుజురాబాద్‌లో పాగా వేయాలని అనుకున్నారు. కానీ.. ఈటల రాకతో పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పుడు ప్రత్యర్థులుగా తలపడిన ఈటల, పెద్దిరెడ్డిలు ఒకే పార్టీలో ఉన్నారు. అసంతృప్తితో ఉన్న పెద్దిరెడ్డితో చాలామంది బీజేపీ నాయకులు మాట్లాడారు. ఇదే సమయంలో ఆయన్ని ఆకర్షించేందుకు టీఆర్‌ఎస్ నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. టీఆర్‌ఎస్ కండువా కప్పుకొనేందుకు పెద్దిరెడ్డి ఒప్పేసుకున్నారని.. మంచి ముహూర్తం చూసుకుని బీజేపీని వీడి కారెక్కేస్తారని ప్రచారం జరుగుతోంది.
పెద్దిరెడ్డితో మాట్లాడిన మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు?
హుజురాబాద్ వదిలేసి హుస్నాబాద్ చూసుకోవాలని చెప్పారా?
హుజురాబాద్ ఎన్నికల వేళ పెద్దిరెడ్డి పార్టీని వీడటం మంచిది కాదని అనుకున్నారో ఏమో.. బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు లైన్‌లోకి వచ్చారు. పెద్దిరెడ్డితో విద్యాసాగర్‌రావు మాట్లాడినట్టు తెలుస్తోంది. బీజేపీని వీడొద్దని విద్యాసాగర్‌రావు సూచించారట. పైగా.. బీజేపీలో నీకేం కావాలో అడుగు.. అందులో అర్థం ఉంది. ఇప్పుడు హుజురాబాద్‌లో పట్టు లేదు కదా.. అక్కడ ఎందుకు పట్టుబట్టడం.. నీకు బలం ఉన్న ప్రాంతాలు హుస్నాబాద్‌లో ఉన్నాయి. ఆ నియోజకవర్గం చూసుకోవాలని పెద్దిరెడ్డికి సలహా ఇచ్చారట విద్యాసాగర్‌రావు.
Read Also : స్టోరీస్ ఎండ్… లవ్ స్టోరీస్ డోన్ట్..!!
బీజేపీ ఆఫర్ పెద్దిరెడ్డికి నచ్చిందా?
మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఈ ఆఫర్ నచ్చిందో లేదో కానీ.. ఆయన మాత్రం ఎక్కడా బయట పడటం లేదు. ఎవరెంతగా బుజ్జగించినా.. పెద్దిరెడ్డి టీఆర్‌ఎస్ గూటికి వెళ్లడం ఖాయయని అనుకుంటున్నారట. అయితే ఈ విషయంలో బీజేపీ నేతల లెక్కలు వేరే ఉన్నాయట. పెద్దిరెడ్డి కాషాయ శిబిరం వీడి వెళ్లరని చాలా విశ్వాసంతో చెబుతున్నారు. కానీ.. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. ఉదయం మంచిగా మాట్లాడినవారే.. సాయంత్రం వేరే శిబిరంలో చేరి గొంతు సవరించుకున్న ఉదంతాలు చాలా ఉన్నాయి. మరి.. పెద్దిరెడ్డి ఆ కోవలోకే చేరతారో లేక హుజురాబాద్‌ను వదులుకొని హుస్నాబాద్‌ను ఎంచుకుంటారో చూడాలి.
తాజావార్తలు
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!