స్టోరీస్ ఎండ్… లవ్ స్టోరీస్ డోన్ట్..!!

అరుణ్ ఆదిత్, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్యూటీ ఫుల్ లవ్ స్టోరీ “డియర్ మేఘ”. అర్జున్ సోమయాజులు మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఎ సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని నిర్మాత అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసుకుంది. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై రూపొందిన రొమాంటిక్ ఎంటర్టైనర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ హచిత్రం “దియా” అనే కన్నడ చిత్రానికి అధికారిక రీమేక్.

Read Also : పుష్ప : అల్లు అర్జున్, ఫహద్ మధ్య హై వోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్…!!

తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. టీజర్ లో మేఘను కాలేజీ విద్యార్థిగా చూపించారు. కాలేజీలో స్నేహితుడితో ప్రేమలో పడిన హీరోహీరోయిన్ సంబంధం సజావుగా సాగదు. మరోవైపు అరుణ్ హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. కానీ ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీగా అన్పిస్తోంది. టీజర్ లో లవ్, ఎమోషనల్ టచ్ కన్పిస్తున్నాయి. టీజర్ “స్టోరీస్ ఎండ్… లవ్ స్టోరీస్ డోన్ట్” అనే డైలాగ్ తో ముగుస్తుంది. మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-