చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అమరావతి భూముల ఇన్సైడ్ట్రేడిరగ్ జరిగిందనే ఆరోపణలను కోర్టులు కొట్టివేశాయనే ప్రచారం జరుగుతున్నా వాస్తవంలో అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటిపై దాఖలైన ఎఫ్ఐఆర్ వాజ్యం సాక్షాత్తూ అత్యున్నత న్యాయస్థానంలోనే తేలవలసి వుంది. జులై 13న సుప్రీం కోర్టులో జస్టిస్ వినీత్ శరణ్, దినేశ్ మహేశ్వరితో కూడిన ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు ఆసక్తికరమైన చర్చ జరిగింది. కేసు మంచి చెడ్డలతోపాటు ఎక్కడ విచారణ జరగాలనేదానిపైనా వాదనలు వినిపించాయి.
అడ్వకేట్ జనరల్‌గా తనకున్నముందస్తు సమాచారం ఉపయోగించి బినామి పేర్లతో భూములు కొని తర్వాత కొన్ని ఇతరులకు బదలాయించారనేది మాజీ ఎజిపై ఆరోపణ.ఈ బదలాయింపు జరిగిన వారిలో ఒక న్యాయమూర్తి కుటుంబ సభ్యుల పేర్లు కూడా వుండటం సంచలనం కలిగించింది.ఐపిసి సెక్షన్ల కింద ఎప్ఐఆర్ నమోదు చేశారు. దానిపై ఎపి హైకోర్టులో దమ్మాలపాటి పిటిషన్ వేయడం,కోర్టు దాన్ని స్వీకరించడమే గాక స్టే ఉత్తర్వు ఇస్తూ ఈ ఎఫ్ఐఆర్లో వివరాలు మీడియాలో రాకుండా ఉత్తర్వులు ఇవ్వడం మరో వివాదమైంది. సుప్రీం కోర్టు లో ఎపి ప్రభుత్వం దీనిపై అప్పీలు చేయగా మీడియా ప్రచురణ చేయరాదనే నిషేదాన్ని ఎత్తివేసింది. అదే సమయంలో హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయకుండా కేసును వాయిదా వేసింది. ఇప్పుడు కేసు విచారణ సమయంలో ప్రభుత్వ తరపు న్యాయవాది సీనియర్అడ్వకేట్ రాజీవ్ ధావన్ వాదిస్తూ ఇది ఎలాటి కక్షసాధింపుతో చేసిన పని కాదని తప్పు జరిగింది గనకనే చర్య తీసుకోవలసి వచ్చిందని పేర్కొన్నారు. మరోవైపున దమ్మాలపాటి తరపు న్యాయవాది హరీశ్ సాల్వే ఇది ముమ్మాటికి కక్షసాధింపేనన్నారు. ఈ కేసును ఇలాగే సాగదీయకుండా సుప్రీం కోర్టులోనే విచారించాలని ఆయన కోరారు.ఇక్కడ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలి లేదా విచారించాలి, కాదంటే హైకోర్టులోనైనా విచారణ కొనసాగాలి అని సాల్వే వాదించారు.ఒకే కేసులో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులోనూ ఇక్కడా కూడా ఏకకాలంలో వాదించడం సరికాదని అన్నారు.
దీనికి ప్రభుత్వం తరపున రాజీవ్‌ధావన్ ఇచ్చిన సమాధానం కూడా ఆసక్తికరంగానే వుంది.ఈ కేసులో ఏవైనా ఉత్తర్వులు వచ్చేవరకూ ఎలాటి బలప్రయోగచర్యలకు పాల్పడబోమని గతంలోనే అంగీకరించాము,విచారణ ఇక్కడే జరగాలని చెప్పగల స్తితిలో నేను లేను. నాకు అందిన సూచనల ప్రకారం ఈ కేసును హైకోర్టులో వివరంగావిచారించవచ్చునని కోరారు. ఒక మాజీహైకోర్టు జడ్జి కేసు పురోగతిని పర్యవేక్షించవచ్చు,సిబిఐ విచారించినా మాకు అభ్యంతరం లేదు అని తెలిపారు.లోగడే ఎపిహైకోర్టుపై అనేక ఫిర్యాదుల చేసిన వైసీపీ ప్రభుత్వం అక్కడే విచారణ జరిగితే మంచిదని చెప్పడం ఇందులో విశేషం. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కేసును జులై22కువాయిదావేసింది.
ఇది ఇలా వుంటే అసలు ఎపి రాజధాని ఏదన్న విషయంలో కేంద్రం దాగుడుమూతలు సాగిస్తూనే వుంది.కొద్ది రోజుల కిందట ఆర్టిఐ కింద దాఖలైన ప్రశ్నకు సమాధానమిస్తూ ఎపి శాసనసభమూడు రాజధానులకై వికేంద్రీకరణ బిల్లు ఆమోదించిందని ఇందులో ఏదిరాజధాని అన్నది తెలియదని చెప్పింది. తర్వాత కొన్నాళ్లుగా ఎపికి ఢల్లీి వర్తమానాలు హైదరాబాద్ చిరునామాకు రావడం,వాటిని అమరావతికి మళ్లించడం పరిపాటి అయింది. ఏదిరాజధాని అన్నదితెలియదని కేంద్ర హొంశాఖ సమాధానమివ్వడంపై ఫిర్యాదురాగా సవరించుకుని ఇప్పుడు మళ్లీ కొత్త జవాబు చెప్పింది, రాజదాని వికేంద్రీకరణ బిల్లు ప్రస్తుతం కోర్టు పరిధిలో వుందని హోంశాఖ సిఇవో రేణు శరీన్ వివరణ ఇచ్చారు. ఇంతకూ కేంద్రం ఇన్నివిధాల మల్లగుల్లాలు ఎందుకు పడుతుందో మాత్రం అర్థం కాదు.