తెలంగాణముఖ్యమంత్రి టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రకటన కన్నా బాగా ముందే సర్వతోముఖ వ్యూహాలకు పదును పెడుతున్న తీరు ప్రత్యర్థులను తికమకపెట్టే స్థాయిలో నడుస్తోంది.ఒకటి రెండు ఎదురుడెబ్బలు, కరోనా కారణంగా ఒకింత విరామం తీసుకున్న ఆయన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నాటినుంచే జోరు పెంచారు. ఈటెల రాజేందర్ ఉద్వాసన ఆ వెంటనే ఎదురు దాడితో దాన్ని ఉధృతంచేశారు. బిజెపి రాష్ట్ర అద్యక్షుడు బండిసంజయ్, ఆయనతో చేరిన ఈటెల రాజేందర్‌లకు తోడు పిసిసి అద్యక్షుడుగా వచ్చిన రేవంత్‌రెడ్డి కూడా…
మాజీ మంత్రిఈటెల రాజేందర్ బిజెపిలో చేరిక తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. రాజేందర్‌పై సానుభూతి టిఆర్‌ఎస్ అధికార బలం మధ్యనే పోటీ అనుకున్నది కాస్తా రకరకాల మలుపులు తిరుగుతున్నది. ఆరుమాసాల్లో ఉప ఎన్నిక జరపాలనే నిబంధన వున్నా కోవిడ్ నేపథ్యంలోఅదే సందేహంలో పడిరది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిని మార్చడం, బెంగాల్ ముఖ్యమంత్రి మమత మరోచోట పోటీ చేసి గెలిచే అవకాశంపైనా అనుమానాలు హుజూరాబాద్‌నూ సందేహంలో నెట్టాయి. ఈటెల రాజేందర్‌పై సానుభూతి ప్రధానంగా పోటీ జరుగుతుందన్న…
వలసపాలన అవశేషమైన 124(ఎ) సెక్షన్ రాజద్రోహం కేసులు ఇంకా కొనసాగడం ఏమిటని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనవార్తగా ప్రచారమవుతున్నది. గాంధీ తిలక్ వంటి జాతీయ నాయకులను శిక్షించేందుకు బ్రిటిష్ వారు తెచ్చిన ఈ సెక్షన్లు 75ఏళ్ల స్వాతంత్రం తర్వాతా దేనికని సిజె రమణ మాజీ మేజర్ జనరల్ వోంబట్కరే దాని రద్దుకోసం దాఖలు చేసిన కేసు సందర్భంగా ప్రశ్నించారు. 1890నాటి రాజద్రోహచట్టం, 1910లో బ్రిటిష్‌పత్రికా చట్టం 1917లో రౌలట్ చట్టం,1928 ప్రజాభద్రతా చట్టం…
వైఎస్ షర్మిల తెలంగాణలో ప్రారంభించిన వైఎస్‌ఆర్‌సిపి ఇంకా ప్రభావశీలంగా మారవలసే వుంది.విస్త్రత కార్యాచరణ చేపట్టవలసే వుంది.అయితే ఆమె వైఎస్‌రాజశేఖర రెడ్డి కుమార్తె కావడం, అంతకు మించి ఆమె అన్న జగన్మోహనరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వుండటం వల్ల కావలసినంత ప్రచారం లబించడం సహజమే.అందుకు తోడు మీడియాలో ఒక భాగం ఆమె పార్టీ స్థాపనకు ముందునుంచే అమితంగా కథనాలు వదలడం, జగన్‌పై కోపంతోనే ఈ పార్టీ స్థాపిస్తున్నారని జోస్యాలు చెప్పడం ఆసక్తి పెంచింది.తెలంగాణలో పార్టీ పెట్టి ఎపి ముఖ్యమంత్రిపై…
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అమరావతి భూముల ఇన్‌సైడ్‌ట్రేడిరగ్ జరిగిందనే ఆరోపణలను కోర్టులు కొట్టివేశాయనే ప్రచారం జరుగుతున్నా వాస్తవంలో అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటిపై దాఖలైన ఎఫ్‌ఐఆర్ వాజ్యం సాక్షాత్తూ అత్యున్నత న్యాయస్థానంలోనే తేలవలసి వుంది. జులై 13న సుప్రీం కోర్టులో జస్టిస్ వినీత్ శరణ్, దినేశ్ మహేశ్వరితో కూడిన ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు ఆసక్తికరమైన చర్చ జరిగింది. కేసు మంచి చెడ్డలతోపాటు ఎక్కడ విచారణ జరగాలనేదానిపైనా…