OTR: పటాన్చెరు కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనే ఉన్నామా?
- 2023 ఎన్నికల్లో పటాన్చెరులో స్వల్ప తేడాతో ఓడిన కాంగ్రెస్
- పదేళ్లపాటు పార్టీని నమ్ముకుని కష్టనష్టాలు భరించిన కేడర్
- అభివృద్ధి పనుల్లో ఎక్కడా కనిపించని కాంగ్రెస్ పేరు
- నియోజకవర్గంలో కొనసాగుతున్న బీఆర్ఎస్ నేతల హవా
- అధికారులు తమను లెక్క చేయడంలేదని కాంగ్రెస్ కేడర్ ఆవేదన
- తామేం చేయలేమని చేతులెత్తేస్తున్న పార్టీ పెద్దలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Patancheru Congress Leaders Unhappy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ నియోజకవర్గంలో మాత్రం ఇంకా తాము ప్రతిపక్షంలోనే ఉన్నామని ఫీల్ అయిపోతున్నారట కాంగ్రెస్ నేతలు. నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకుల మాట ఎవరూ వినడంలేదట. అధికారులు అయితే లెక్క చేయడంలేదట. అంతా ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యే మాటే వింటున్నారట. ఈ విషయంలో పార్టీ పెద్దల వద్ద ఎంత మొత్తుకున్నా… పట్టించుకోవడంలేదట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది..? అక్కడి కాంగ్రెస్ నేతల బాధ ఏంటి..?
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ నేతలు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టు ఫీల్ అవుతున్నారట. నియోజకవర్గంలో తమ మాట ఎవరూ వినడం లేదని నెత్తి నోరు కొట్టుకున్నా పార్టీ పెద్దలు పట్టించుకోవడం లేదట. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గంలో స్వల్ప తేడాతో ఓడిపోయింది కాంగ్రెస్. అయితే.. రాష్ట్రంలో పార్టీ అధికారంలో రావడం కేడర్‌కి ఊరటనిచ్చింది. ఆ సంతోషం పట్టుమని పదినెలలు కూడా లేకుండా పోయిందట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దగ్గర పడుతున్నా… ప్రతిపక్షంలో ఉన్నట్టే ఫీల్ అవుతున్నారట. రాష్ట్రంలో తమ ప్రభుత్వమే ఉన్నా పటాన్చెరులో నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు మాత్రం ఫీలింగ్ కలగడం లేదట.
Also Read
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
- OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
- OTR : నువ్వు అక్కడ.. నేను ఇక్కడ.. ఎమ్మెల్సీ బరిలో బీఆర్ఎస్, బీజేపీ సరికొత్త వ్యూహం
పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని నమ్ముకుని జెండాలు మోసి, ఎన్నో కష్టనష్టాలు భరించారు కేడర్. అధికారంలో వచ్చాకైనా తమ కష్టాలు తీరుతాయనుకుంటే అవి మరింత పెరిగాయట. పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయిందట అక్కడి నాయకులు, కార్యకర్తల పరిస్థితి. నియోజకవర్గంలో వందలకోట్ల రూపాయలు విలువైన అభివృద్ది పనులు జరుగుతున్నా ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పేరే కనిపించడంలేదట. ఈ అంశాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపిస్తున్నారు లోకల్ నాయకులు. పోనీ తామైనా వెళ్లి అడుగుదామనుకుంటే ప్రోటోకాల్ సమస్య అడ్డంకిగా మారుతోందట. దానికి తోడు నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతల హవానే కొనసాగుతుందని వాపోతున్నారట కాంగ్రెస్ నాయకులు. అధికారులు అధికార పార్టీ నాయకులని కాదని ప్రతిపక్షపార్టీల నాయకులు చెప్పిందే వింటున్నారట. తమ పరిధిలోని అభివృద్ది పనులకోసం అధికారుల దగ్గరికి వెళ్తే వారు తమను లెక్కచేయడంలేదన ఆవేదన కాంగ్రెస్ నేతల్లో ఉందట.
మీకేం అధికారముందని అభివృద్ది పనుల కోసం వస్తున్నారని అంటూనే… ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులకు మాత్రం ప్రోటోకాల్ లేకున్నా కుర్చీలు వేసి మరీ పనులు చేసి పెడుతున్నారట. దీంతో స్థానికంగా కాలనీల్లో ఓటర్ల వద్ద తాము చులకన అయిపోతున్నామని కుమిలిపోతున్నారట. అధికారంలో ఉండి కూడా ఈ అవమానాలు భరించలేకపోతున్నామని పార్టీ పెద్దల వద్దకు వెళ్తే వారు కూడా… సారీ… ఈ విషయంలో తామేం చేయలేమని చేతులెత్తేస్తున్నారట. దీంతో కాంగ్రెస్ కేడర్ దిక్కుతోచని స్థితిలో పడిందట. ఇటు అధికారులు అటు… పార్టీ పెద్దలెవరు తమ మాట వినకపోవడంతో తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోలోపల రగిలిపోతున్నారట. ప్రోటోకాల్ సమస్య కారణంగా ప్రభుత్వ కార్యక్రమాలకు లోకల్ కేడర్ దూరంగా ఉంటోంది. అందుకే ఉన్న ఇద్దరు నేతల్లో ఎవరికైనా నామినేటెడ్ పోస్టు ఇస్తే పార్టీ తిరిగి పుంజుకునే అవకాశముంటుందనేది కేడర్ వాదన.
పటాన్చెరు నియోజకవర్గంపై జిల్లా మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి, కాంగ్రెస్ అధిష్టానం ఫుల్లుగా ఫోకస్ పెట్టి కేడర్‌కు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం కేడర్‌లో కనిపిస్తోంది. మంత్రులు పట్టించుకోరు. ఇక్కడున్న వారేమో కలవరు. మరి తమ పరిస్థితి ఏంటని కేడర్ ఆగ్రహంతో ఉందట. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క మున్సిపాలిటీ గెలచుకోలేకపోయింది. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశముంది. పార్టీ పరిస్థితి ఇలానే ఉంటే నియోజకవర్గంలోని 9 డివిజన్లకు 9 సీట్లు ప్రతిపక్ష పార్టీ క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని కాంగ్రెస్ నేతలే బహిరంగంగా చెబుతున్నారట. చేతులు కాలాక ఆకులు పట్టుకునే బదులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే పార్టీకి నష్టం జరగకుండా ఉంటుందని సలహలు ఇస్తున్నారట. పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోతే రాబోయే రోజుల్లో అధిష్టానంతో ఇక తాడోపేడో తేల్చుకుంటామని అధిష్టానానికి హెచ్చరికలు పంపుతున్నారట పటాన్చెరు కాంగ్రెస్ నాయకులు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!