Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు టాలీవుడ్లో బాక్సాఫీస్ వద్ద భారీ సినిమాల పోటీ నెలకొంటుంది. సంక్రాంతి బరిలో దిగేందుకు పలువురు స్టార్ హీరోలు ఇప్పటికే తమ చిత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే సంక్రాంతి రేసులో టాలీవుడ్ నుంచి పలు ఆసక్తికర ప్రాజెక్టులు బరిలో నిలిచాయి. వాటిలో విక్టరీ వెంకటేష్ , నందమూరి కళ్యాణ్ రామ్ కాంబోలో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘జనవరి 12న విడుదల’ జెట్ స్పీడ్ లో రెడీ అవుతోంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ ‘కాకా’ కూడా జనవరి 13న రిలీజ్ కానుంది. అలాగే శర్వానంద్, దర్శకుడు శ్రీనువైట్ల కాంబినేషన్లో వస్తున్న ‘జార్జ్ క్రిష్’ జనవరి 14న డేట్ ఫిక్స్ చేసుకుంది. ‘సంబరాల ఏటిగట్టు’ కూడా సంక్రాంతి బరిలోనే నిలిచేందుకు సిద్ధమైంది.
ఇప్పటికే తెలుగులో స్టార్ హీరోలు మరియు క్రేజీ కాంబినేషన్లు పోటీపడుతుండగా, ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ సంక్రాంతి బరిలోకి అడుగుపెడుతుండటంతో బాక్సాఫీస్ వద్ద పోటీ మరింత రసవత్తరంగా మారింది. డ్యూడ్ దర్శకుడు అశ్విత్ మరిముత్తు డైరెక్షన్ లో రజనీకాంత్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ధర్మన్. కమల్ హాసన్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. రజనీ సినిమాలకు తెలుగులో ఎంత భారీ మార్కెట్ ఉందొ చెప్పక్కర్లేదు.రజనీ పోటీలో దిగితే తెలుగు సినిమాలకు కాస్త ఇబ్బందనే చెప్పాలి. ఓ వైపు వెంకీ – కళ్యాణ్ రామ్, మరోవైపు చిరు మధ్యలో సూపర్ స్టార్. ఈ సంక్రాంతికి థియేటర్ల వద్ద అసలైన పండుగ వాతావరణం కలగడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Sundeep Kishan: ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్.. సందీప్ కిషన్ బిగ్గెస్ట్ ప్లాన్!
-
Supreme Court: CJI సూర్యకాంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. సంజయ్ రౌత్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..
-
ORR Arbitration : సుప్రీంకోర్టులో HMDAకి షాక్.. ORR కేసులో కీలక మలుపు
-
Indian Cinema: ఇండియన్ సినిమాకు పట్టిన ఈ ‘బడ్జెట్ పిచ్చి’ ఎవరిని ముంచుతుంది?
-
Ranabaali Box Office: ‘రణబాలి’ సేఫ్ కావాలంటే అన్ని కోట్లు కొల్లగొట్టాల్సిందేనా?
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!