Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aadhaar Biometric Update: ఈ రోజుల్లో మన దేశంలో ప్రతీ చిన్నదానికీ, పెద్దదానికీ ఆధారే అత్యంత కీలకమైన గుర్తింపు కార్డుగా మారిపోయింది. పిల్లల నుంచి పండు ముసలి వరకు అందరికీ ఇది తప్పనిసరి. అయితే ఐదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకి ‘బాల్ ఆధార్’ ఇచ్చేటప్పుడు వారి చేతి వేలిముద్రలు, కంటిపాప (ఐరిస్) స్కాన్ తీసుకోరనే విషయం మనకు తెలిసిందే. పిల్లలకు ఐదేళ్లు నిండిన తర్వాత తొలిసారిగా ఫొటోతో పాటు వేలిముద్రలు, కంటిపాప సమాచారాన్ని ఆధార్‌లో తప్పనిసరిగా అప్డేట్ చేయించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ పదిహేనేళ్ల వయసొచ్చాక రెండోసారి ఈ బయోమెట్రిక్ వివరాలను నవీకరించడం తప్పనిసరి. సాధారణంగా ఏడేళ్ల నుంచి పదిహేనేళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న పిల్లలకు అయ్యే ఈ అప్డేట్ రుసుమును ఒక ఏడాది పాటు మినహాయిస్తూ భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) నిర్ణయం తీసుకుంది. అందువల్ల ప్రస్తుతం 5 నుంచి 17 ఏళ్ల లోపు పిల్లలకు ఈ బయోమెట్రిక్ అప్డేట్ను పూర్తి ఉచితంగా చేసే వెసులుబాటు అందుబాటులో ఉంది.
అయితే ఈ ఉచిత బయోమెట్రిక్ అప్డేట్ సేవలు వచ్చే 2026 సెప్టెంబర్ 30వ తేదీ వరకే అందుబాటులో ఉంటాయని UIDAI స్పష్టం చేసింది. ఈ గడువు దాటిపోతే మాత్రం ఆ తర్వాత మనం జేబులోంచి డబ్బులు చెల్లించి ఫీజు కట్టాల్సి వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తమ పిల్లలను దగ్గరలోని ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్‌కు గానీ, లేదా కామన్ సర్వీస్ సెంటర్ (CSC)కు గానీ తీసుకెళ్లి ఈ పని పూర్తి చేయించవచ్చు. దీనికోసం ఇప్పటికే 1.56 లక్షలకు పైగా బడుల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి, దాదాపు 2 కోట్లకు పైగా పిల్లల బయోమెట్రిక్స్ అప్డేట్ పూర్తి చేశారు.
ఒకవేళ మీరు ఈ గడువులోగా అప్డేట్ చేయించకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పిల్లల స్కూళ్లు, కాలేజీల అడ్మిషన్లు, ప్రభుత్వ స్కాలర్షిప్లు, సంక్షేమ పథకాలు మాత్రమే కాకుండా నీట్ (NEET), జేఈఈ (JEE), సీయూఈటీ (CUET) వంటి కీలకమైన పోటీ పరీక్షలు రాసేటప్పుడు ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ప్రక్రియలో తీవ్ర సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ గడువు ముగిసేలోపే మీ పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ను త్వరపడి పూర్తి చేయడం శ్రేయస్కరం.
Also Read
- Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
- Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
- KTR: గత పది, పదిహేను రోజులుగా ఒకాయనకు నిద్ర పట్టట్లేదు..
- Ragi Health Benefits: రాగి తింటున్నా పోషకాలు అందడం లేదా? మీరు చేసే ఈ చిన్న పొరపాట్లే కారణం!
తాజావార్తలు
-
Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
-
CM Vijay: కరూర్ తొక్కిసలాటకు ఏడాది.. ‘ఎప్పటికీ మానని గాయం’ అంటూ సీఎం విజయ్ భావోద్వేగం
-
SS Rajamouli 25 Years: కథలు మారాయి, హీరోలు మారారు.. కానీ జక్కన్న ఆలోచన మాత్రం మారలేదు!
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
-
Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?