OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
- తెలంగాణ సంఘటన ప్రధాన కార్యదర్శి మారే ఛాన్స్
- కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు కీలక బాధ్యతలు ఇస్తారా?
- రాష్ట్ర అధ్యక్షుడిని చేస్తారంటూ గతంలో విస్తృత ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: తెలంగాణ కమలంలో కొత్త ఈక్వేషన్స్ తెరపైకి రాబోతున్నాయా? వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పార్టీ అధిష్టానం పావులు కదుపుతోందా? అందులో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు కీలకమైన బాధ్యత అప్పగించే అవకాశం ఉందా? ఆయన్ని రాష్ట్ర వ్యాప్తంగా తిప్పే ఆలోచన ఉందా? ఇంతకీ బండికి ఏ బాధ్యత ఇచ్చే అవకాశం ఉంది? దాని గురించి పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చలేంటి?. తెలంగాణ బీజేపీలో భారీగా సంస్థాగత మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా సంచలన నిర్ణయాలకు ఛాన్స్ ఉందని కూడా అంచనా వేస్తున్నాయి రాజకీయవర్గాలు. రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మారవచ్చని అంటున్నారు. అలాగే… మరికొన్ని మార్పులు కూడా జరుగుతాయనే టాక్ నడుస్తోంది కాషాయ వర్గాల్లో. మార్పుల్లో భాగంగా…. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి కీలక బాధ్యతలు అప్పగిస్తారని కూడా చెప్పుకుంటున్నారు. ఆయన్ని రాష్ర్ట అధ్యక్షుడుగా నియమిస్తారన్న ప్రచారం ఒక దశలో పెద్ద ఎత్తున జరిగింది.
అయితే ప్రస్తుతం రామచందర్‌రావు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నందున అయన పదవీకాలం ముగిసే వరకు మార్చే అవకాశం లేదు. రామచందర్‌రావు కూడా వివిధ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారని, ఆయన పనితీరు విషయంలో పార్టీ హై కమాండ్ సంతృప్తిగానే ఉందని అంటున్నారు. అయితే… రాష్ట్ర పార్టీలో మాస్ ఊపు తీసుకురావాలంటే… కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని రంగంలోకి దించాలన్న ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన్ని కేంద్ర మంత్రిగా కొనసాగిస్తూనే.. రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. సంజయ్ సన్నిహితులు కూడా ఈ సంగతి చెబుతున్నా… మార్పు ఎప్పడు ఉంటుంది? వెంటనేనా? లేక వెయిట్ చేస్తారా అన్న విషయంలో ఇంకా క్లారిటీ లేదు. బండి సంజయ్ రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తేనే… పార్టీకి ఊపు వస్తుందని నమ్ముతున్నారట పెద్దలు. ఆయన అలా తిరగాలంటే… ఏదో ఒక కీలకమైన బాధ్యత ఇవ్వడం అవసరం.
Also Read
అందుకే… రాష్ట్ర ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి బీజేపీ వర్గాలు. రాష్ట్ర పార్టీ ఎంపీలను ఇటీవల ఢిల్లీలోని తన నివాసానికి ఆహ్వానించారు సంజయ్. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా రకరకాల మీటింగ్స్ జరిగాయి. బండికి కీలక బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం అప్పట్నుంచే ఉంది. ఈ క్రమంలో తాజాగా ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం ఆసక్తి రేపుతోంది. 2023 ఎన్నికలకి ముందు రాష్ట్ర అధ్యక్షుడిని మార్చిన బీజేపీ… కిషన్‌రెడ్డికి బాధ్యతలు ఇచ్చింది. అప్పుడు ఈటల రాజేందర్‌కి ప్రచార కమిటీ సారధ్య బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు ఆ పదవిని బండికి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. తమ తదుపరి టార్గెట్ తెలంగాణేనని పార్టీ ఢిల్లీ పెద్దలు ఇప్పటికే చెప్పారు. ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటేగనుక… ముందుగానే పని ప్రారంభిస్తారన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో మార్పులు చేర్పులకు పెద్దగా టైం పట్టక పోవచ్చన్నది పార్టీ టాక్.
తాజావార్తలు
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్‌లో ఈడీ మెరుపు దాడులు.!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!