OTR : చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు చుట్టూ కుల వివాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీకృష్ణదేవరాయలుది ఏ కులం? ఏ సామాజికవర్గంలో పుట్టారాయన? ఏంటీ…. తేడాగా మాట్లాడుతున్నారు, మతిగాని పోయిందా…? అంతటి మహా చక్రవర్తికి కులం ఏంటి? ఎవరో రాజకీయ నాయకుడి గురించి అనుకుంటున్నారా? నో… ఇది సాక్షాత్తు విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణ దేవరాయలు గురించే. ఇప్పుడెందుకా టాపిక్ వచ్చింది? కృష్ణదేవరాయలును క్యాస్ట్ దేవరాయలుగా ఎందుకు మారుస్తున్నారు? క్రీస్తుశకం 1509 నుంచి 1529 మధ్య 20 ఏళ్ల పాటు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు శ్రీకృష్ణ దేవరాయలు. ఆ సామ్రాజ్యం అంతరించినా….నాడు చేసిన ప్రజారంజక పరిపాలన, తీసుకున్న నిర్ణయాలతో ఆయన పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. అంతటి ఘనకీర్తి ఉన్న చక్రవర్తి ఇప్పుడు కుల వివాదంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. ఆయనది మా కులమంటే… మా కులం అంటూ… ఆంధ్రప్రదేశ్‌లోని రెండు సామాజికవర్గాలు పోటీలు పడటం ప్రస్తుతం పొలిటికల్ హాట్ అయింది. తాజాగా నంద్యాలలో కృష్ణదేవరాయలు విగ్రహావిష్కరణ సమయంలో రెండు కులాల ప్రతినిధులు రోడ్డెక్కడం చర్చనీయాంశమైంది. శ్రీనివాస నగర్ సెంటర్లోని ఎన్టీఆర్ కాంప్లెక్స్‌లో శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రేపు విగ్రహ ఆవిష్కరణ అనగా… ఇవాళ కృష్ణదేవరాయలు తమ కులానికి చెందినవాడేనని, అందుకు ఆధారాలు ఉన్నాయంటూ అఖిల భారత యాదవ మహాసభ నేతలు రోడ్డెక్కారు. ఆయన విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరం లేదని, అలా కాకుండా… మా కులం వాడని క్లెయిమ్ చేసుకుంటూ… బలిజ కులస్తులు ప్రారంభిస్తే అడ్డుకుంటామంటూ రివర్స్ అయ్యారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలకు యాదవ సంఘం నేతలు వినతిపత్రాలు కూడా ఇచ్చారు. అదే సమయంలో శ్రీకృష్ణదేవరాయలు తమ కులస్తుడేనంటూ మేమే విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని బలిజ సామాజికవర్గం పట్టుబట్టింది. అయితే… అప్పటికి అధికారులు సర్ది చెప్పి విగ్రహావిష్కరణకు అడ్డంకులు లేకుండా చేశారు. మంత్రి ఫరూక్ విగ్రహావిష్కరణ చేశారు.
అంత వరకు ఓకేగానీ… ఇప్పుడసలు ఆ చక్రవర్తిది ఏ కులం అంటూ కొత్త చర్చ మొదలైంది. ఆయన మావాడేనంటూ ఒకవైపు బలిజ, మరోవైపు యాదవ సామాజికవర్గాలు చెప్పడమేగాక… చారిత్రక ఆధారాలు ఇవిగోనంటూ చూపిస్తున్నారు. ఆయన బలిజ కులస్తుడేనని పోర్చుగీసు చరిత్రకారులు రాశారంటూ…. ‘ది బుక్ ఆఫ్ డ్యూఆర్ట్ బర్బొస'( The Book Of Duarte Barbosa) పుస్తకాన్ని రిఫరెన్స్‌గా చూపిస్తున్నారు. ఆ వంశంలోని చివరి రాజు పెదకోనేటి రాయుడు కూడా బలిజ కులం అనే రాసుకున్నారని వాదిస్తున్నారు. అలాగే… పట్టాభిషేక సమయంలో వర్ణన అంటూ మరికొన్ని ఆధారాలు కూడా చూపిస్తున్నారు బలిజ కుల సంఘాల నాయకులు. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా రాసినన ఆముక్తమాల్యదలో తాను చంద్రవంశ క్షత్రియుడినని చెప్పుకున్నారని, బలిజలు చంద్రవంశ క్షత్రియులేనని చరిత్ర చెబుతుందంటూ వాదన వినిపిస్తున్నారు. అదే సమయంలో ఆయన మావాడేననేందుకు మా దగ్గర కూడా ఆధారాలున్నాయంటున్నారు యాదవ సంఘాల ప్రతినిధులు. మైసూర్ ఆర్కియాలజీ విభాగం నుంచి ఆర్టీఐ కింద తీసుకున్న సమాచారం ప్రకారం కృష్ణదేవరాయలుది యాదవ సామాజికవర్గమేనన్నది వాళ్ళ వాదన. చరిత్ర పరిశోధకుడు ఎద్దినపూడి వెంకటరత్నం మైసూర్ ఆర్కియాలజీ విభాగంలోని శాసనాల ఆధారంగా సేకరించిన సమాచారం కూడా ఇదే చెబుతోందని వాదిస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయలు తండ్రి తులువ నరసరాయలు చనిపోతే… అచ్యుతరాయలు గయలో పిండ ప్రదానం చేసి… శాసనాలు రాయించారని, అందులో యదుకుల తిలకుడు అని సంబోధించారని, యదుకులమంటే… యాదవ కులమనే అర్ధం అంటూ తమ వాదన వినిపిస్తున్నారు. ఇది చారిత్రక ఆధారం కాదా అని అడుగుతున్నారు యాదవులు. ప్రొద్దుటూరు దగ్గర రామేశ్వరాలయం ఉందని, వివాహ పన్ను రద్దు చేస్తున్నట్టు శ్రీకృష్ణదేవరాయలు అక్కడే ప్రకటించారని, ఆ సందర్బంగా ‘గోపకులోద్భవుడు’ అంటూ బిరుదు ఇచ్చారని చెబుతున్నారు. ఆ బిరుదు కూడా ఆయన యాదవ సామాజికవర్గానికి చెందినవారు అనడానికి చారిత్రక ఆధారం అని అంటున్నారు. శ్రీకృష్ణదేవరాయలుది తమ కులమంటే తమ కులం అనే వివాదం 2010 నుంచి తీవ్రమైంది. ఆయన విగ్రహాలను ఎక్కువగా ప్రతిష్టించడం మొదలయ్యాకనే ఈ వివాదం ముదిరిందని అంటున్నారు పరిశీలకులు. రాయలసీమలో ఎక్కడ చూసినా బలిజ సామాజికవర్గీయులే కృష్ణదేవరాయలు విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారు. ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా క్యాస్ట్ వార్ గట్టిగానే జరుగుతోంది. ఇది రాజకీయ రంగుకుడా పులుముకుంటోంది. కొందరు ఇదే అవకాశంగా హద్దులు మీరు ప్రవర్తిస్తూ నాయకులుగా ఎదిగేందుకు వేదికగా ఎంచుకుంటున్నారట. కులం కూడు పెడుతుందా అన్న మాట వేరే రంగాల్లో ఎలా ఉన్నా… పాలిటిక్స్‌లో మాత్రం అదే కూడు. అసలు తుళు వంశానికి చెందిన రాజుది ఏ కులం అంటూ…. ఇప్పుడు కొట్టుకోవడం అవసరమా అని వాదించే వాళ్ళు సైతం ఉన్నారు. కానీ… మీకు అవసరం లేకుంటే పోవచ్చుగానీ… మాకు మాత్రం కావాల్సిందే అదే ఫుల్ పొలిటికల్ మీల్స్ అంటున్నాయి రాజకీయ పక్షులు.
Also Read
తాజావార్తలు
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
-
Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!