OTR: వైజాగ్ పాలిటిక్స్‌లో తన ముద్ర కోసం శ్రీభరత్ తిప్పలు.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆయన హోదా.. కాంట్రవర్సీ.. కేరాఫ్ ఆయన అడ్రస్. యవ్వారం ఏదైనా… సింపుల్‌గా చేద్దాం, మోర్ క్లారిటీ ఇద్దామని అనుకుంటారుగానీ.. చివరికి అదే చిరిగి చేటంత అవుతుంది. ఎంత కంట్రోల్ చేసుకున్నా… ఎక్కడో ఒక చోట, ఏదో ఒక రూపంలో బుక్ అయిపోతున్న ఆ ఎంపీ ఎవరు? ఆయన మీద వ్యతిరేకత సొంత పార్టీలోనే చాపకింద నీరులా విస్తరిస్తోందా? ఆయన రెండు పడవల ప్రయాణమే అందుకు కారణమా? లెట్స్ వాచ్.
ముతుకుమిల్లి శ్రీభరత్.. ఏపీ పాలిటిక్స్ గురించి అంతో ఇంతో అవగాహన ఉన్నవాళ్ళకు మాత్రమే ఈ పేరు తెలుస్తుండవచ్చు. అదే.. నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడు, లోకేష్ తోడల్లుడు అంటే మాత్రం ఎక్కువ మంది ఠక్కున గుర్తు పట్టేస్తారు. విశాఖపట్టణం సిట్టింగ్ ఎంపీగా ఉన్న శ్రీభరత్.. వేరే ఐడెంటిటీలతో నాకేం పని అనుకున్నారో ఏమోగానీ..! ఇప్పుడు వైజాగ్ పాలిటిక్స్‌ని తన చుట్టూ తిప్పుకునేందుకు చేస్తున్న విశ్వ ప్రయత్నాలు వికటిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. తన లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండగా.. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మినహా మిగతా వాళ్ళతో సత్సంబంధాలు లేవన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో దిగాలన్న ఆలోచనతో ఆయన సమాంతర రాజకీయాలు నడపడమే అందుకు కారణం అన్నది పార్టీ ఇన్నర్ వాయిస్.
Also Read
- Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
- Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు... ఆ సీట్లు దక్కేదెవరికి..?
- Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా... ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి...?
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
ఈ ఏడాది మొదట్లో విశాఖ కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీ కలిసి మీడియా ముందుకు వచ్చారు. టీమ్ వర్క్ ఎప్పటికీ నిలిచి ఉంటుందని, మాకు ఎదురు లేదని ప్రకటించుకున్నారు. అధికారం అన్నాక ఆ మాత్రం జోష్ సహజం అనుకుంటుండగానే.. చర్చ భీమిలి వైపు మళ్ళింది. భరత్ ఈసారి అక్కడి నుంచి పోటీకి సిద్ధం అవుతున్నారట కదా…అంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే గంటాను ఎవరో కదిలిస్తే.. ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భరత్ ఎమ్మెల్యేగా వెళితే నేను ఎంపీగా పోటీ చేస్తానని గంటా అనడంతో టీడీపీ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. వెంటనే సర్దుకున్న శ్రీభరత్.. అలాంటి ఛాన్స్ ఏదీ నేను తీసుకోదలచుకోలేదని,విశాఖ అభివృద్ధి అజెండా నెరవేరాలంటే ఎంపీగా పనిచేయడమే తనకు ఇష్టమని క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.
మరోవైపు విశాఖ ఉత్తర నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పదవి చాలా కాలంగాపెండింగ్లో ఉంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. టీడీపీకి ఇన్ఛార్జ్ లేరు. ఈ క్రమంలో కొందరి పేర్లతో హైకమాండ్ సర్వేలు చేయించింది. ఇక నియామకమే పెండింగ్ అనుకుంటున్న టైంలో ఎంపీ భరత్ ఇక్కడ కర్చీఫ్ వేశారట. ఇటీవల విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో నార్త్ నియోజకవర్గంపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌కు హాజరైన నియోజకవర్గ నాయకులందరూ ఇన్ఛార్జ్ నియామకం కోసం డిమాండ్ చేశారు. ఏదైనా సమస్య వస్తే పార్టీ పరంగా ఎవరి దగ్గరికి వెళ్లాలో అర్ధంకావడం లేదని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో.. ఎంపీ జోక్యం చేసుకుని నార్త్ నియోజకవర్గానికి ఇన్చార్జ్ అవసరం లేదు, అన్నీ నేనే చూసుకుంటానని స్ట్రాంగ్‌గా చెప్పేశారట. దాంతో అవాక్కయిన లోకల్ సీనియర్స్ మామూలుగానే ఆయన్ని కలవడం కష్టమైపోతోంది, ఇక ఈ బాధ్యతలు కూడానా అంటూ సణుక్కున్నట్టు సమాచారం.
అదే సమయంలో అసలు భరత్ ఆలోచనలు ఏమై ఉంటాయా..? అనే చర్చ మొదలైంది. ఇక్కడ బలపడేందుకు బీజేపీ, జనసేన విస్తృతంగా ప్రయత్నిస్తున్నాయి. అటు వైసీపీ కూడా తగ్గేదేలే అంటోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎంపీ రెండు పడవల ప్రయాణం వ్యక్తిగతంగా ఆయనకే కాదు, పార్టీకి కూడా నష్టం కలిగిస్తుందని అంటున్నారు . అంతర్గత పరిణామాలు ఇలా ఉంటే ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయాలపై భరత్ నోరు తెరిస్తే బూమరాంగ్ అవుతుందని అంటున్నారు. ఆయన ప్రస్తావించిన అంశాలను విపక్షాలు, ప్రజా సంఘాలు చర్చకు పెట్టి మరీ ఏకిపపారేస్తుండటం ప్రభుత్వాన్ని కూడా ఇరకాటంలో పెడుతోంది.
ఇటీవల బీచ్ ష్యాక్స్ వ్యవహారంలో ముందే యంత్రాంగం కిందా మీదా పడుతుంటే.. అసలు ప్రభుత్వాలు నడుస్తున్నదే లిక్కర్ ఆదాయాలు మీదని అంటూ పాత సీసాలో కొత్త మందు పట్టుకొచ్చారు ఎంపీ సాబ్. రాష్ట్రం మొత్తం నాణ్యమైన మద్యం అమ్మకాలు చేస్తే తప్పులేనపుడు ష్యాక్స్ లో పెడితే నష్టం ఏంటనేది ఎంపీగారి భావన. ఈ మాటతో ఆగితే కొంత రీజనబుల్‌గా ఉండేదేమోగానీ.. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుకు భారీగా లైక్ లు వచ్చాయని చేసిన వ్యాఖ్యలతో రచ్చ జరిగింది. సరిగ్గా ఇక్కడి నుంచే ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు తగులుకున్నాయి. బీచ్‌లో బార్లు తప్పు కానప్పుడు భరత్ తన విద్యాసంస్థల్లోనూ వాటిని ఏర్పాటు చేస్తారా..? అంటూ నిలదీశారు. ఈ గోల నడుస్తుండగానే.. డేటా సెంటర్ల మీద వివాదం కొత్త మలుపు తీసుకుంది. వాటికి నీరు, విద్యుత్ వినియోగం విషయంలో ఇప్పటికే రకరకాల అనుమానాలున్నాయి. వాటిని నివృత్తి చేసేందుకు ఎంపీ పూర్తి సమాచారంతో జనం ముందుకు వచ్చారు.
అంతవరకు బాగానే ఉన్నా.. అదే ఊపులో సింహాచలం ఆలయ భూములు కేటాయింపు నిబంధనల ప్రకారం జరిగిందని చెప్పారాయన. వాటినే హైకోర్ట్‌లో ఛాలెంజ్ చేశారు జలబిరదారీ నేషనల్ కన్వీనర్ బొలిశెట్టి సత్య. ఎకో సెన్సిటివ్ జోన్ కావడంతో అనుమతులు రద్దు చేయాలని చేసిన అభ్యర్థన ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ అయ్యాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా ఎంపీ తాను స్ట్రెయిట్ ఫార్వర్డ్ మాట్లాడానని భావిస్తున్న అంశాలు, ఆలోచనలు అటు పార్టీకి….ఇటు ప్రభుత్వానికి చుట్టుకుంటున్నాయనే చర్చ జరుగుతోంది విశాఖలో.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?