Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Yadagirigutta 2

Off The Record : యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటుపై సందిగ్ధత.. ప్రభుత్వ నిర్ణయానికి అడ్డంకులు ఎక్కడ?

Published Date :March 4, 2026 , 8:04 pm
By Gogikar Sai Krishna
  • బోర్డ్‌ కోసం ఏడాది క్రితం చట్ట సవరణ, ఇంతవరకు నో
  • పొలిటికల్‌ పైరవీలతో ప్రభుత్వానికి తలబొప్పి కడుతోందా?
  • నిజాం టైం నుంచే యాదగిరిగుట్ట ఆలయ ధర్మకర్తల మండలి
  • 2008-10 మధ్య చివరిసారిగా ధర్మకర్తల మండలి
Off The Record : యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటుపై సందిగ్ధత.. ప్రభుత్వ నిర్ణయానికి అడ్డంకులు ఎక్కడ?
  • Follow Us :
  • google news
  • dailyhunt

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న సామెత ఆ టెంపుల్‌కు పర్‌ఫెక్ట్‌గా సరిపోతుందా? తెలంగాణ కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నాక కూడా ఏడాదిగా అడుగు ముందుకు పడకపోవడానికి కారణం ఏంటి? ఆ…. ఏముంది… ఆలయ పాలకమండలేగా, అంతా మంచి నీళ్ళ ప్రాయం అనుకున్న చోట కత్తి మీద సాము ఎందుకు చేయాల్సి వస్తోంది? ఏ టెంపుల్‌ విషయంలో అంతలా పీటముడి పడింది? ఎందుకు పడింది? యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానాల తరహాలో బోర్డు ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పానికి ఏవో కొన్ని అదృశ్య శక్తులు అడ్డుపడుతున్నాయట. ఆ విషయంలో అడుగు ముందుకు పడటంలేదు. బోర్డ్‌ ఏర్పాటు కోసం ఏడాది క్రితమే దేవాదాయ శాఖ చట్టానికి సవరణ చేసి అసెంబ్లీలో బిల్లు ఆమోదించినా….. ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. అలా ఎందుకు జరుగుతోందని ఆరాతీసిన వాళ్ళకు…అదంతా పొలిటికల్‌ కంపేనని తేలుతోందట. బోర్డు చైర్మన్‌తో పాటు పాలక మండలిలో చోటు కోసం నాయకులు ఎవరికి వారు పైరవీలు చేసుకుంటూ ప్రభుత్వం మీద వత్తిడి తెస్తుండటంతో అసలు ప్రాసెస్‌ మొత్తం పక్కకు పోయినట్టు చెప్పుకుంటున్నారు. అసలు నిజాం కాలంలోనే యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలి నియామకం మొదలైంది.

ఇక 1966లో రూపొందించిన దేవాదాయ చట్ట ప్రకారం ఆలయానికి వంశపారంపర్య ధర్మకర్తే….. పాలకమండలి చైర్మన్‌గా ఉంటున్నారు. ఆయనతో పాటు మరో 8 మంది సభ్యులు ఉండేవాళ్ళు. చివరిసారిగా 2008లో ఏర్పడిన యాదగిరిగుట్ట ఆలయ ధర్మకర్తల మండలి 2010 వరకు కొనసాగింది. ఇక అప్పటినుండి అంటే….16 ఏళ్లుగా మండలి లేకుండానే ఆలయ నిర్వహణ జరుగుతోంది. బీఆర్‌ఎస్‌ హయాంలో 1250 కోట్ల రూపాయలతో ఆలయ పునర్నిర్మాణం జరిగింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక కూడా ఆ డెవలప్‌మెంట్‌ యాక్టివిటీని కొనసాగిస్తూ నారసింహుడి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే… టీటీడీ తరహాలో టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం దేవాదాయ, ధర్మాదాయ చట్టాన్ని సవరించి 18 మందితో పాలకమండలి ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో 9 మందిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. వీళ్ళతో పాటు వంశపారంపర్య ధర్మకర్త, వివిధ విభాగాలకు చెందిన మఖ్య అధికారులు కూడా పాలక మండలిలో ఉంటారు. అలాగే బోర్డులో ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి కూడా చోటు కల్పిస్తే… యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనారసింహ స్వామి ఆలయానికి జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు, ప్రాధాన్యత ప్రాముఖ్యత పెరుగుతాయన్నది ప్రభుత్వ ఆలోచన. అందుకే ఆధ్యాత్మిక, సేవా గుణం కలిగిన పారిశ్రామిక, వ్యాపార వేత్తలను లేదా వివిధ రంగాలలో నిష్ణాతులైన ఇతర రాష్ట్రాల ప్రతినిధులకు కూడా మండలిలో చోటివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.

Also Read

  • Off The Record : హైలెవల్ బ్రిడ్జిపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం
  • OTR: సీఎం ప్రెస్ మీట్ లో NDSA ఛైర్మన్ ఉండటంపై బీజేపీ అభ్యంతరం
  • Off The Record : తీవ్ర ఆవేదనలో తణుకు జనసేన లీడర్స్, కేడర్
  • Off The Record : కవిత పార్టీలో చేరిన రాథోడ్ బాబూరావు..అసలు కారణాలేంటి ?

ఈ నిర్ణయం జరిగి, అసెంబ్లీ ఆమోదించి ఏడాది గడుస్తున్నా….. ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇందుకు కారణం ఉమ్మడి నల్గొండ జిల్లా కీలక నేతలు, సీనియర్ నేతల ఒత్తిళ్లు, రాష్ట్ర స్థాయి జోక్యమేనని చెప్పుకుంటున్నారు. పాలక మండలిలో చోటు కోసం చాలా మంది అధికార పార్టీ నేతలు, వ్యాపార, ఆధ్యాత్మిక ప్రముఖులు పోటీలు పడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలో లేకున్నా… పార్టీ కోసం పదేళ్ళు పని చేసిన కొందరు, గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టిక్కెట్‌ ఆశించి దక్కని వాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలను గెలిపించుకునేందుకు క్షేత్రస్దాయిలో కష్టపడిన నేతలు… ఇలా ఎవరికి వారే… మాకో ఛాన్స్‌ అంటూ మంత్రులు, సీనియర్‌ లీడర్స్‌ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. ఇక ఛైర్మన్‌ పదవి కోసమైతే….రాజకీయ నేతలతో పాటు వ్యాపార వేత్తలు, స్వచ్ఛంద సంస్థల యజమానులు, ఇతర ప్రముఖులు కూడా పోటాపోటీ ప్రయత్నాలు చేయడంతో పీటముడిపడుతోందని అంటున్నారు.

అదే సమయంలో పాలకమండలిలో తమ వారికే వీలైనన్ని ఎక్కువ పదవులు ఇప్పించుకుని అక్కడ కూడా పట్టునిలుపుకునేందుకు ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీనియర్ నేత కుందూరు జానారెడ్డిలు వ్యూహాలకు పదునుపెడుతున్నారట. ఇక ఆలయ పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యే, ఎంపీలు కూడా మేమేం తక్కువ అంటూ ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో… ఎలా నిర్ణయం తీసుకోవాలో అర్ధంకాక ప్రభుత్వ పెద్దలు సైలెంట్‌ ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ కంచు కోటలో కీలక నేతల పోటీ ఒకవైపు… రాష్ట్ర స్థాయిలో పదవులు ఆశించే సీనియర్ నేతల్లో ఎవరో ఒకరిని చైర్మన్ గా నియమించాలని సీఎం మరో వైపు భావిస్తుండటంతో … బోర్డు ఏర్పాటుకు టెక్నికల్గా అడ్డంకులు లేకున్నా… పని మాత్రం జరగడం లేదని తెలుస్తోంది. ఈ కత్తిమీద సాముకు ఎలా ముగింపు పలుకుతారో చూడాలి.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • OTR
  • Yadagirigutta

తాజావార్తలు

  • Titanic Life Jacket: 114 ఏళ్ల కిందటి విషాదానికి సాక్ష్యం.. వేలంలో రూ.8 కోట్లు పలికిన టైటానిక్ లైఫ్ జాకెట్!

  • Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!

  • Earthquake: గుజరాత్‌లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!

  • Donald Trump: గుడ్‌న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..

  • PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions