Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Thungathurthi Congress

Off The Record: తుంగతుర్తి కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయిందా..?

Published Date :May 1, 2025 , 8:31 pm
By Chandra Shekhar Pamena
  • తుంగతుర్తి కాంగ్రెస్‌లో కొత్త వర్సెస్‌ పాత
  • ఎమ్మెల్యే మందుల సామేల్‌ వర్సెస్‌ పాత కాంగ్రెస్‌ నేతలు
  • ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి మందుల
  • గెలిచాక పాత వాళ్ళని పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి
  • వలస నేతలకే ఎమ్మెల్యే ప్రాధాన్యం అన్న అభిప్రాయం
  • ఉమ్మడి జిల్లా సీనియర్స్‌ చెంతకు పాత కాంగ్రెస్‌ లీడర్స్‌
  • సమావేశాల్లో మోగుతున్న ఎమ్మెల్యే డౌన్‌ డౌన్‌ నినాదాలు
  • ఎంపీ రంగంలోకి దిగినా మారని తుంగతుర్తి కాంగ్రెస్‌
Off The Record: తుంగతుర్తి కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయిందా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: గాడిద కష్టం కన్నా… నెమలి నాట్యానికి విలువ ఎక్కవ అన్నట్లుగా తయారైందట అక్కడ కాంగ్రెస్‌ కేడర్‌ పరిస్థితి. అంతేకాదు ఊరందరిదీ ఒకదారైతే ఉలిపికట్టెదొక దారి అన్నట్లుగా ఉన్న ఆ ఎమ్మెల్యే వ్యవహారాన్ని జీర్ణించుకొలేకపోతున్నారట కార్యకర్తలు. ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఎందుకలా మారిపోయింది?

Read Also: TDP vs Janasena: కూటమి నేతల మధ్య విభేదాలు.. చెక్ పెట్టే పనిలో పెద్దలు!

తుంగతుర్తి కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒకటి ఎమ్మెల్యే మందుల సామేల్ వెంట ఉంటే.. మరొక వర్గం జిల్లా సీనియర్ నేతల వెంట నడుస్తోందన్నది ఓపెన్ టాక్‌. కొంత కాలంగా రెండు వర్గాల క్యాడర్ మధ్య మాటలు పేలుతున్నాయి. సందర్భం ఏదైనా, వేదిక ఎక్కడైనా రచ్చ రొటీన్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు మందుల సామేల్…. ఆయనకు లోకల్ కాంగ్రెస్ క్యాడర్ తోపాటు… నియోజకవర్గంపై పట్టున్న ఉమ్మడి జిల్లా సీనియర్ నేతలు రెడ్ కార్పెట్‌ పరిచారు.. ఎన్నికల్లో అన్ని రకాలుగా సహకరించి భారీ మెజారిటీతో గెలిపించారు.. రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారంలోకి రావడంతో.. ఇక అంతా స్వర్ణయుగమే అనుకున్న తుంగతుర్తి హస్తం పార్టీ క్యాడర్ కు ఆదిలోనే షాక్ ఇచ్చారట ఎమ్మెల్యే. గెలిచింది నేను, ఎమ్మెల్యేను నేను… ఇక అంతా నేనే అన్నట్టు వ్యవహరించారట. నియోజకవర్గంపై పట్టున్న నేతల్ని కూడా ఇక్కడేం పని అంటూ రాజకీయం మొదలుపెట్టారట.

Read Also: Pakistan: కవ్విస్తున్న పాకిస్తాన్.. రాజస్థాన్ సరిహద్దుల్లో ఎయిర్ డిఫెన్స్, ఆర్టిలరీ యూనిట్స్..

అయితే, పదేళ్లు పార్టీ కోసం పని చేసిన క్యాడర్ ను, లీడర్ లను కాదని తన వెంట వచ్చిన నేతలకు, ఆ తరువాత బీఆర్ఎస్ నుండి వచ్చిన వారికి పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వడాన్ని పాత కాంగ్రెస్‌ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నట్టు సమాచారం. పాత, కొత్త వర్గాలుగా విడిపోయిన హస్తం పార్టీ నేతలు నియోజకవర్గంలో పైచేయి కోసం ప్రయత్నిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆధిపత్య పోరులో వలస నేతలకే ఎమ్మెల్యే అండగా నిలబడటంతో సమస్య మరింత జటిలమైందని అంటున్నారు. దీంతో తుంగతుర్తి నియోజకవర్గంపై గట్టి పట్టున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ నేతలు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి లతోపాటు సీనియర్ నేత రాజగోపాల్ రెడ్డి దగ్గరికి వెళ్ళారట పాత కాంగ్రెస్ నేతలు.. ఎమ్మెల్యే దగ్గర విలువ లేకపోవడం వల్లే తుంగతుర్తి పాత కాంగ్రెస్‌ నాయకులు సీనియర్స్‌కు దగ్గరైనట్టు చెప్పుకుంటున్నారు. దీంతో మరో అడుగు ముందుకేసిన ఎమ్మెల్యే.. తనను కాదని జిల్లా సీనియర్లతో సన్నిహితంగా ఉంటున్న ఆ నేతలను పార్టీ కార్యక్రమాలకు, పదువులకు మరింత దూరం చేశారట.

Read Also: Congress BC Leaders: రేపు తెలంగాణ గవర్నర్ను కలవనున్న కాంగ్రెస్ బీసీ నేతలు..

ఇక, కొన్ని సందర్భాలలో కేసులు పెట్టించేందుకు కూడా వెనకాడలేదని సమాచారం. అధికారుల దగ్గర కూడా పాత వాళ్లకు ప్రాధాన్యత లేకుండా చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలతో కొంత కాలంగా రగిలిపోతున్న పాత కాంగ్రెస్ నేతలు.. ఇప్పటికే పలు మార్లు రోడ్డెక్కగా.. సభలు, సమావేశాల్లో తమ గోడు వెళ్లబోసుకున్నారట. అయినా ప్రయోజనంలేకుండా పోయిందని అంటున్నారు. తాజాగా సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మందుల సామేలుకు వ్యత్తిరేకంగా అర్వపల్లి కాంగ్రెస్ నేతలు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడం కలకలం రేపింది. ఇలాంటివి ముందు ముందు ఇంకా పెరగవచ్చని అంటున్నారు.తుంగతుర్తిలో వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు పార్టీ పెద్దలు భవనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని రంగంలోకి దింపినా సయోధ్య కుదరలేదట. అవమాన భారంతో రగిలిపోతున్న తుంగతుర్తి పాత కాంగ్రెస్ నేతలు సభ, సమావేశం, వేదిక ఏదైనా… రచ్చ చేసేందుకు సిద్దం అవుతుండటం అధికార పార్టీని కలవర పెడుతోందట.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress
  • Mla Mandula Samel
  • off the record
  • OTR
  • telangana

తాజావార్తలు

  • ATM Withdraw: రూ.10 వేలు విత్‌డ్రా చేస్తే రూ.3 లక్షలొచ్చాయి. అసలు కథేంటంటే..!

  • Telangana Budget 2026-27: రూ. 3.24 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ఏ శాఖకు ఎంతంటే?

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • Megastar Chiranjeevi : ఎన్టీఆర్ నేషనల్ అవార్డు స్వీకరించడంపై చిరు ఎమోషనల్ ట్వీట్…

  • IPL Highest Team Scores: ఐపీఎల్ చరిత్రలో భారీ స్కోర్ల వర్షం.. ఎస్‌ఆర్‌హెచ్‌దే హవా, టాప్-10 లిస్ట్ ఇదే!

ట్రెండింగ్‌

  • Gym Tips : జిమ్ మధ్యలో మానేస్తే మీ బాడీకి ఇదే జరుగుతుంది.! ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.!

  • Butter Curd Rice : హెల్తీ, రుచికరమైన బటర్ కర్డ్ రైస్.. ఇలా సింపుల్ గా తయారు చేసుకోండి..!

  • IPL 2026 Injury List: గాయాల దెబ్బ, స్టార్ ప్లేయర్స్ ఔట్.. ఐపీఎల్ జట్లకు భారీ షాక్!

  • Summer Super Drinks : బాదం షర్బత్ ట్రై చేశారా..? ఎండలో కూల్‌గా ఉండే సూపర్ డ్రింక్.!

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions