Tamil Nadu: మహిళా కలెక్టర్‌కు టీవీకే ఎమ్మెల్యే వేధింపులు.. పోలీసుల మౌనంపై హైకోర్టు ఆగ్రహం!
- మహిళా కలెక్టర్‌కు ఎమ్మెల్యే అసభ్యకరమైన మెసేజ్‌లు..
- అధికార టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌పై ఆరోపణలు..
- ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించిన మద్రాస్ హైకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడులో అధికార పార్టీ టీవీకే ఎమ్మెల్యే సీ అరుల్ విఘ్నేష్ కల్లకురిచి జిల్లా కలెక్టర్‌కు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపించిన వ్యవహారంపై మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్టోరియా గౌరి తీవ్రంగా స్పందించారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని టీవీకే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ వ్యవహారం ‘‘వర్క్ ప్లేస్ వేధింపుల’’ పరిధిలోకి రాదా? అని ఘాటుగా స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణల్ని ఎమ్మెల్యే ఖండించారు. ఈ అంశంపై ఆదివారం జస్టిస్ విక్టోరియా గౌరి స్పందిస్తూ.. కలెక్టర్ భర్త ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఆ తర్వాత పోలీసులు తీసుకున్న చర్యలు ఏమిటని ప్రశ్నించారు.
కనిమొళి ఆరోపణలతో రాజకీయ వివాదం..
నవంబర్ 09న డీఎంకే ఎంపీ కనిమొళి సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను ప్రస్తావిస్తూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అరుల్ విఘ్నేష్ కలెక్టర్‌కు అసభ్యరమైన సందేశాలు పంపించారని, మద్యం మత్తులో ఆమె నివాసిని వెళ్లి వేధింపులకు పాల్పడ్డారని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత కలెక్టర్‌కు ప్రత్యేక భద్రతా అధికారిని నియమించినట్లు వార్తలు కూడా వచ్చాయి.
Also Read
- NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
- Putin Praises India: భారత్‌లో ఇన్ని భాషలా? ఈ వైవిధ్యం అద్భుతం.. పుతిన్ ప్రశంసలు!
- BJP MLA Rekha Patra: బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్రపై విషప్రయోగం.? పరిస్థితి విషమం..
- Gold Price Crash 2026: బంగారం కొనొద్దన్న మోదీ.. అప్పటి నుంచి పసిడి ధర ఎంత తగ్గిందో తెలుసా?
అయితే, ఈ ఆరోపణల్ని ఎమ్మెల్యే ఖండించారు. డీఎంకే కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కలెక్టర్ అధికారి నివాసంలో భద్రతా సిబ్బంది, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని, అలాంటప్పుడు తాను అక్కడికి ఎలా వెళ్లగలనని ప్రశ్నించారు. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపిస్తామని, ఆరోపణలు నిజమని తేలితే చర్యలు తీసుకుంటామని మంత్రి రాజ్‌మోహన్ ప్రకటించారు.
ఈ వ్యవహారంపై నవంబర్ 12న డీఎంకే, అన్నాడీఎంకేలు వేర్వేరుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందించారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసును క్రైమ్ బ్రాంచ్–క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CB-CID)కు అప్పగించాలని డీఎంకే పోలీస్ డైరెక్టర్ జనరల్ (DGP)ను కోరింది. నవంబర్ 17న కనిమొళి ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. మహిళా కమిషన్ జోక్యం చేసుకుని బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
తాజావార్తలు
-
Tamil Nadu: మహిళా కలెక్టర్‌కు టీవీకే ఎమ్మెల్యే వేధింపులు.. పోలీసుల మౌనంపై హైకోర్టు ఆగ్రహం!
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
TGSRTC: టెక్నాలజీ వాడకంలో టీజీఎస్ఆర్టీసీ నయా రికార్డ్.. బస్సులో “i-ALERT” కన్ను..
-
Meenakshi Chaudhary : “చివరికి ఇదంతా బిజినెస్సే!”.. ఇండస్ట్రీలో వివక్షపై మీనాక్షి చౌదరి సంచలన వ్యాఖ్యలు!
-
Putin Praises India: భారత్‌లో ఇన్ని భాషలా? ఈ వైవిధ్యం అద్భుతం.. పుతిన్ ప్రశంసలు!
ట్రెండింగ్
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్‌లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!