Off The Record : తెలంగాణ స్పీకర్ కు ఢిల్లీ పిలుపు
- ఢిల్లీ వచ్చి కలవమని స్పీకర్‌కు రాహుల్ ఆహ్వానం
- ప్రత్యేకంగా పిలిచారంటే ఎందుకంటూ చర్చలు
- బ్యాక్‌గ్రౌండ్ గట్టిగా ఉంటుందన్న మాటలు
- వికారాబాద్ ప్రోగ్రామ్‌లో రాహుల్‌కు ప్రసాద్‌కుమార్ స్వాగతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు సడన్‌గా ఎందుకు ఢిల్లీ పిలుపు వచ్చింది? ఆయన కూడా ఊహించని విధంగా….ఒకసారి వచ్చి కలవండని రాహుల్ గాంధీ ఎందుకు పిలిచారు? క్యాజువల్‌గానే రమ్మన్నారా? లేక ప్రత్యేక కారణాలున్నాయా? ఎంత పార్టీ పెద్ద అయితే మాత్రం…. స్పీకర్ పదవిలో ఉన్న నేతను అలా క్యాజువల్‌గా పిలుస్తారా..? ఆ పిలుపు వెనకున్న అసలు సంగతేంటి? కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణ టూర్ చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికి చాలాసార్లు ఆయన రాష్ట్రానికి వచ్చినా… ఈసారి ట్రిప్ గురించి మాత్రం కాంగ్రెస్ వర్గాల్లోనే కాస్త డిఫరెంట్‌గా మాట్లాడుకుంటున్నారు. తాజాగా వికారాబాద్‌లో పర్యటించిన రాహుల్…. స్థానిక MLA, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఢిల్లీ వచ్చి కలవమని చెప్పారట. దీని చుట్టూనే ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో రకరకాల ప్రశ్నలు ఉదయిస్తున్నాయి, అనుమానాలు రేగుతున్నాయి. ఢిల్లీ రమ్మని రాహుల్‌గాంధీ ప్రత్యేకంగా పిలవడమంటే… అదేం ఆషామాషీ వ్యవహారం కాదని, బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏదో గట్టిగానే ఉండి ఉంటుందని మాట్లాడుకుంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ లీడర్స్. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ఏపీ, తెలంగాణ డీసీసీ
అధ్యక్షులకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ ముగింపు సమావేశానికి హాజరయ్యారు రాహుల్.
శిక్షణా తరగతులు నిర్వహించిన నియోజక వర్గం… స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ది కావడంతో రాహుల్ గాంధీకి స్వాగతం పలకడంతో పాటు వీడ్కోలు చెప్పేందుకు హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళారాయన. ఆ సందర్భంగా ప్రసాద్‌కుమార్‌తో మాట్లాడిన రాహుల్… ఢిల్లీకి వచ్చి కలవండని చెప్పినట్టు తెలిసింది. ఇక్కడే అనుమానాలు పెరుగుతున్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్‌పై విచారణ కొనసాగుతున్న క్రమంలో ఏదైనా స్పెషల్ డిస్కషన్‌కోసం పిలిచి ఉంటారా అన్నది పార్టీలోని ఎక్కువ మంది డౌట్. దీంతోపాటు క్యాబినెట్ లో రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటి కోసం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి కూడా ఆశావహులు ఉన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఇబ్రహీంపట్నం MLA మల్రెడ్డి రంగారెడ్డి రేసులో ఉన్నారు.
Also Read
గతంలో విస్తరణ జరిగినప్పుడు అధిష్టానానికి లేఖ రాశారు ప్రసాద్‌కుమార్. కానీ… అప్పుడు జాబితాలో ఆశించిన ఇద్దరి పేర్లు లేవు. ఐతే ఇప్పుడు రాహుల్ గాంధీ స్వయంగా ఢిల్లీ వచ్చి కలవమని చెప్పడంతో…. మళ్ళీ ఆశలు చిగురించినట్టు అయ్యింది. అయితే…. అది మంత్రి వర్గంలో చోటు కోసమా… లేక అనర్హత పిటిషన్స్ విచారణ కొలిక్కి వచ్చిన క్రమంలో ఆ విషయాన్ని మాట్లాడేందుకు పిలిచారా అన్నది ఆసక్తికరంగా మారింది. మంత్రి పదవి విషయంలో ఇన్నాళ్లు సీఎం రేవంత్ రెడ్డి మీదనే ఆశలు పెట్టుకున్నారు ప్రసాద్ కుమార్. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ రమ్మని రాహుల్ పిలవడం వెనక మతలబేంటన్న చర్చలు జోరుగా నడుస్తున్నాయి కాంగ్రెస్ వర్గాల్లో.
తాజావార్తలు
-
Miracle Rescue: నేపాల్‌లో అద్భుత రెస్క్యూ.. 9 రోజుల తర్వాత టన్నెల్ నుంచి ఇద్దరు కార్మికులు సజీవంగా బయటకు! (వీడియో)
-
CM Revanth Reddy: కొడంగల్‌లో సీఎం రెండు రోజుల పర్యటన.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
-
Radha Krishna: రాధాకృష్ణులపై కరణ్ జోహార్ భారీ మైథలాజికల్ ఎపిక్.. ‘అవనే శ్రీమన్నారాయణ’ దర్శకుడితో బిగ్ ప్లాన్!
-
Prabhas Fauzi: డార్లింగ్ ఫ్యాన్స్ ఇక తగ్గేదేలే.. ‘ఫౌజీ’ ప్రమోషన్స్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్!
-
TCL P80, P80 Pro: 8GB RAM.. 50MP కెమెరా.. IP68! TCL P80, P80 Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!