OTR : సింహపురిలో సీన్ మారుతోందా? వైసీపీకి చెక్ పెట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సింహపురి పొలిటికల్ స్క్రీన్ మీద కొత్త సీన్స్ కనిపించబోతున్నాయా? జిల్లా తెలుగుదేశం ముఖ్య నాయకులంతా కలిసి కీలక నిర్ణయం తీసుకున్నారా? అలా చేయకుంటే… వైసీపీని తట్టుకోవడం కష్టం, స్థానిక ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతింటామని అనుకున్నారా? ఇంతకీ ఏంటా కీలక నిర్ణయం? కొత్తగా ఏం చేయబోతున్నారు టీడీపీ లీడర్స్? ఫ్యాన్ పార్టీ ఆరోపణలు, పోరాటాలను ఇన్నాళ్ళు లైట్ తీసుకున్న నెల్లూరు టీడీపీ ఇప్పుడు ఉలిక్కిపడ్డట్టు అలర్ట్ అయిందట. ఇప్పటికైనా మేల్కొనకుండా లేట్ చేస్తే డ్యామేజ్ పెరిగిపోతుందని భయపడుతున్నట్టు తెలిసింది.ఆ ఎఫెక్ట్ స్థానిక ఎన్నికల మీద పడుతుందన్న చర్చలు సైతం పార్టీలో నడుస్తున్నాయంటున్నారు. అందుకే సింహపురి సైకిల్ లీడర్స్ వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ… మేటర్ ఏంటంటే… రకరకాల అడ్డంకులు ఎదురైనా జిల్లా వైసీపీ జనాన్ని పోగేస్తోంది. ప్రభుత్వం మీద రకరకాల ఆరోపణలు, అనుమానాలను రేకెత్తిస్తూ… క్షేత్ర స్థాయిలో పోరాటాలు చేస్తోంది. దీంతో… ఇలాగే చూస్తూ వదిలేస్తే… ఈ పోరాటాలు ఎటువైపునకు దారితీస్తాయోనన్న ఆందోళనలో అధికార పార్టీ నేతలు ఉన్నారట. ఇప్పుడు పట్టు నిలుపుకోలేకపోతే కష్టమేనన్న భావనతో అప్రమత్తం అయినట్టు తెలుస్తోంది. వైసీపీని దీటుగా ఎదుర్కోవాలంటే ముందు తమ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోవాలని, అలాగైతేనే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటగలమన్న నిర్ణయానికి వచ్చారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇంట్లో జరిగిన తాజా భేటీ అందులో భాగమేనని అంటున్నారు. లంచ్ మీట్ పేరుతో సమావేశమైన నాయకులు…జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను చర్చించారట. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నీ అబద్దాలే చెబుతున్నారని, వాటిని ఎక్కడికక్కడ ఎండకట్టకపోతే… అవే నిజమని జనం నమ్మి మనకు డ్యామేజ్ తప్పదన్న నిర్ణయానికి వచ్చారట జిల్లా తెలుగుదేశం నాయకులు. పొలిటికల్ మైలేజ్ కోసం…. సూది మొన దూరేంత సందు దొరికితే… ఏకంగా తలే దూరుస్తూ… వైసీపీ నాయకులు అబద్దాలను పదే పదే చెబుతూ అనుమానం రేకెత్తించేలా వ్యవహరిస్తున్నారని మీటింగ్‌లో పాల్గొన్న సీనియర్స్ అన్నట్టు తెలిసింది.
దాన్ని ఆదిలోనే అడ్డుకోవాలంటూ మీటింగ్‌లో ఏకాభిప్రాయం వ్యక్తం అయిందట. దారిన పోయే కంపను తీసుకొచ్చి.. తమకు తగిలిస్తున్నారని, జాగ్రత్త పడకుంటే ఇబ్బందులు తప్పవంటూ భేటీలో ప్రస్తావన వచ్చిందట. అందుకే మనం ఐక్యంగా ఉంటూ.. వైసీపీ దూకుడును అడ్డుకోవాలన్న నిర్ణయానికి సైకిల్ లీడర్స్ వచ్చినట్టు తెలుస్తోంది. నియోజకవర్గ స్థాయిలో ఇన్ఛార్జ్లు చేసే విమర్శలకు.. స్థానిక ఎమ్మెల్యేలే కౌంటర్లు ఇవ్వాలని.. అలా కుదరకపోతే జిల్లా నాయకత్వం రంగంలోకి దిగుతుందని చర్చించుకున్నారట. మొత్తం పదికి పది అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకున్న క్రమంలో…. పార్టీ బలం ఎక్కడా తగ్గలేదన్న మెసేజ్ ను రాష్ట్ర నాయకత్వానికి కూడా పంపేలా అందరూ పని చేయాలని మంత్రి ఆనం సూచించినట్టు తెలిసింది. అధికారం మనదే.. ఆధిపత్యం కూడా మనదే ఉండాలని.. అడ్డొస్తే అణగదొక్కాలన్న వ్యూహంతో అంతా ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కొందరు ఎమ్మెల్యేలు జిల్లా అధ్యక్షునితో టచ్ మీ నాట్ అన్నట్లు ఉంటున్నారు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ… ప్రజాప్రతినిధులందరూ ఏకమైతేనే రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరుగుతాయని.. అంతా అందుకోసం ప్రయత్నించాలని అన్నట్టు తెలిసింది. రాబోయే రోజుల్లో పొలిటికల్ యాక్టివిటీ బాగా పెరుగుతుందని, వైసీపీని ఎక్కడికక్కడ అడ్డుకోకపోతే ఆ పార్టీ మరింత పుంజుకునే అవకాశం ఉందన్న చర్చ ఈ సమావేశంలో జరిగినట్టు తెలిసింది. ఎత్తులకు పై ఎత్తులతో పాటు ఎదురు దాడికి దిగాలన్న నిర్ణయానికి కూడా వచ్చారట టిడిపి నేతలు. సైలెంట్‌గా ఉంటే క్షేత్రస్థాయిలో వైసీపీ బాగా డ్యామేజ్ చేస్తోందని, ఆ వైఖరి మానుకుని ఇక నుంచి అందరూ అటాక్ మోడ్ ఆన్‌చేయాలని అనుకున్నారట. మొత్తంగా మనమంతా విభేదాలు వీడి ఒక్కటి అవకుంటే… వైసీపీ అడ్వాంటేజ్ తీసుకుంటుందన్నది నెల్లూరు టీడీపీ నాయకులు ఏకాభిప్రాయానికి వచ్చారు.
Also Read
- Tags
- Nellore
- ntv
- OTR
- simhapuri politics
- tdp
తాజావార్తలు
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
-
Ponguleti Srinivas : తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు.. కేంద్రానికి మంత్రి పొంగులేటి బిగ్ రిక్వెస్ట్..
-
Anupama: మౌనం వీడిన అనుపమ: టాక్సిక్ రిలేషన్‌షిప్‌పై సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..