Site icon NTV Telugu

Off The Record: ఎంపీ గడ్డం వంశీ వ్యవహారశైలిపై కాంగ్రెస్ లో చర్చ! టచ్ మీ నాట్ వైఖరితో పెరుగుతున్న గ్యాప్

Gaddam

Gaddam

Off The Record: జిల్లాలో సీఎం సభ పెడితే చాలు… ఆ ఎంపీ అనుచరులు ఎందుకు పూనకాలు లోడింగ్‌ అంటున్నారు? సొంత పార్టీ నాయకులే తెలంగాణ ముఖ్యమంత్రి సభలో ప్లకార్డులు ప్రదర్శించడాన్ని ఎలా చూడాలి? స్వయానా ఎంపీనే అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిప్పు రాజేస్తూ… వర్గపోరుకు ఊతమిస్తున్నారా? ఎవరా ఎంపీ? ఏంటా పోరు మేటర్‌?

Read Also: Devara : ‘చుట్టమల్లే’ సాంగ్ కు గుర్తింపు దక్కలేదు.. కొరియోగ్రాఫర్ కామెంట్స్..

గడ్డం వంశీకృష్ణ.. పెద్దపల్లి ఎంపీ. 35 ఏళ్లకే లోక్‌సభలో అడుగుపెట్టారీ పొలిటికల్‌ వారసుడు. కాకా కుటుంబం నుంచి పెద్దపల్లి సీట్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న మూడో తరం నాయకుడు. అంతవరకు బాగానే ఉందిగానీ.. ఇప్పుడాయన వ్యవహారశైలి గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది నియోజకవర్గంలో. అటు పార్టీ కార్యక్రమాల్లో, ఇటు ప్రభుత్వ ప్రోగ్రామ్స్‌లో ప్రోటోకాల్ ప్రకారం పిలుపులు ఉండటం లేదన్నది ఎంపీ అనుచరుల ఆరోపణ. ఐడెంటిటీ సమస్య కావడంతో ఆగ్రహంతో ఉన్నారట ఎంపీసాబ్‌. గతంలో పెద్దపల్లిలో జరిగిన సీఎం సభలోనే ఈ విషయాన్ని ప్రస్తావించారాయన. సగానికిపైగా క్యాబినెట్‌ మంత్రులు, ముఖ్యమంత్రి ఉన్న వేదికపైనే వంశీ అసంతృప్తి వెళ్లగక్కినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదట.దీంతో అధికారులను ప్రశ్నించడం మొదలుపెట్టారట ఆయన. అయినా నో యూజ్‌. దాంతో రూట్‌ మార్చి కొంతకాలంగా తన నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో సొంత జట్లను సిద్ధం చేసుకుంటున్నారట. విషయం ఏంటంటే.. ఇదే నియోజకవర్గం పరిధిలో వంశీ తండ్రి, పెదనాన్న ఎమ్మెల్యేలుగా ఉన్నారు. తండ్రి వివేక్‌కు ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలంట పడని వాళ్ళని చేరదీసి అన్నిరకాలుగా ఎంపీ సహకరిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.

Read Also: Minister Ponguleti: మళ్ళీ వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరిస్తున్నాం..

దీంతో వంశీ తీరుపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. తమ నియోజకవర్గాల్లో తమకు తెలియకుండా కార్యక్రమాలు చేయడం ఏంటని రగిలిపోతున్నారట పెద్దపల్లి జిల్లా పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అందుకే తమ ప్రాబల్యం ఉన్నచోట… జరిగే అధికార, అనధికార, పార్టీ కార్యక్రమాలకు సమాచారం ఇచ్చామా, లేదా అన్నట్టుగానే పిలుస్తున్నారట. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు, ఎంపీకి మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయిందని చెప్పుకుంటున్నారు. అటు పారిశ్రామికంగా కీలకంగా ఉండే రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌తో, ఇటు ధర్మపురిలో ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌తో, పెద్దపల్లిలో విజయ రమణారావుతో పొసగడం లేదట ఎంపీకి. కేవలం వీళ్ళ వరకే పరిమితం అయితే అది వేరే సంగతి. కానీ.. అందరినీ సమన్వయం చేసే మంథని ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబుతో కూడా లేటెస్ట్‌గా గిచ్చి కయ్యం పెట్టుకునే ప్రయత్నం చేశారట వంశీ. మంథనిలో జరుగుతున్న పరిణామాలను సీఎం దృష్టికి తీసుకు వెళతానని ఆయన ప్రకటించడం కలకలం రేపింది.

Read Also: Delhi: ఢిల్లీలో వర్ష బీభత్సం.. ముగ్గురు కూలీలు మృతి..

అయితే, అన్నిటికీ మించి మంత్రికి కనీస సమాచారం ఇవ్వకుండా.. ఆయన స్వగ్రామం ధన్వాడకు ఎంపీ వెళ్లడం చర్చనీయాంశమైంది. ఒకరకంగా అది మంత్రిని సవాల్‌ చేయడమేనన్న అభిప్రాయం బలపడుతోందట పార్టీ వర్గాల్లో. మొదటి నుంచి శ్రీధర్ బాబుతో సఖ్యతగానే ఉన్న గడ్డం ఫ్యామిలీ…. సడన్‌గా వ్యతిరేకంగా మారిపోయిందట. వంశీ గెలుపులో మంత్రి శ్రీధర్ బాబు కీలక పాత్ర పోషించారనే టాక్ ఉంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మంథనిలో ఎంపీకి 50వేలకు పైగా లీడ్ వచ్చింది. తండ్రి, పెదనాన్నల నియోజకవర్గాలు రెండింటిలో కలిపి వంశీకి వచ్చిన లీడ్ కంటే మంథనిలో వచ్చిన ఆధిక్యమే ఎక్కువ. అలాంటి శ్రీధర్‌బాబు నియోజకవర్గంలో జోక్యం చేసుకునే ప్రయత్నం వంశీ ఎందుకు చేస్తున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సరస్వతి పుష్కరాల సందర్భంగా సీఎం పాల్గొన్న సభలో వంశీ అనుచరులు ప్లకార్డ్స్‌తో నిరసన తెలపడం కూడా అందులో భాగమేనని చెప్పుకుంటున్నారు. దళిత ఎంపీ లేకుండా కార్యక్రమమా అంటూ నినాదాలు చేశారు ఎంపీ అనుచరులు. దీంతో.. సీఎం సభలో సొంతపార్టీ వారు నినాదాలు చేయడం ఏంటంటూ.. హాట్‌ హాట్‌గా చర్చలు జరుగుతున్నాయి. అసలు తన నియోజకవర్గం పరిధిలో ముఖ్యమంత్రి సభ అనగానే.. ఎంపీ పూనకాలు లోడింగ్‌ అన్నట్టుగా మారిపోతున్నారో, లేక ఆయన అనుచరులే అలా చేస్తారో అర్ధం కావడంలేదంటూ జోకులేసుకుంటున్నారట బయట పార్టీల వారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడు.. పైగా ఇంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా సీఎం లాంటి వ్యక్తి పాల్గొన్న సభల్లో ఇలా వ్యవహరించడం ఏంటంటూ ఎంపీ వంశీ గురించి మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు.

Read Also: India Bangladesh: బంగ్లాకు షాక్ ఇచ్చిన భారత్.. దిగుమతులపై పోర్ట్ ఆంక్షలు..

అధికార పార్టీలోనే ఉన్న వాళ్లు సీఎంను నేరుగా కలిసి పరిస్థితిని వివరించే అవకాశం ఉన్నప్పటికీ… ఆ పని చేయకుండా ఇలా పబ్లిక్‌గా రచ్చ చేయడం వెనక స్కెచ్‌ ఏంటని కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్యల వెనక కేవలం ఆవేదన, ఆవేశం మాత్రమే ఉన్నాయా…? అంతకు మించా అన్నది ఇప్పుడు పెద్దపల్లి కాంగ్రెస్‌ కేడర్‌కు వస్తున్న డౌట్‌. రాష్ట్ర క్యాబినెట్ విస్తరణలో గడ్డం కుటుంబానికి ఓ బెర్త్‌ దక్కుతుందని భారీ ఆశలే పెట్టుకున్నారట… కానీ ఇటీవల పలువురు మంత్రులు సీనియర్ నేతలు… వివేక్, వినోద్‌ పేర్లు కాకుండా… మరోనేత ప్రేమ్ సాగర్‌రావు పేరును ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రస్తావించడంతో రగిలి పోతోందట గడ్డం ఫ్యామిలీ. అందుకే అన్ని నియోజవర్గాల్లో ఇలా అలజడి సృష్టించి తమ ఉనికిని చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నది ఇంకో వెర్షన్‌. వంశీ వ్యాఖ్యలు, చర్యలపై కాంగ్రెస్ పెద్దలు ఎలా స్పందిస్తారు…? వరుసగా సీఎం పాల్గొన్న సభల్లో రచ్చ చేస్తూన్న కుర్ర ఎంపీని ఎలా దారికి తెస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎంపీ.. తన పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇలా గ్రూపులను ఎంకరేజ్‌ చేస్తున్న తీరును పార్టీ పెద్దలు ఎలా డీల్ చేస్తారో వేచి చూడాల్సిందే.

Exit mobile version