Devara : జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ మంచి హిట్ అయింది. మరీ ముఖ్యంగా ఇందులోని చుట్టమల్లే చుట్టేసింది సాంగ్ కు మంచి క్రేజ్ దక్కింది. ఇందులో ఎన్టీఆర్, జాన్వీ రొమాంటిక్ స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేసిన బోస్కో మార్టిస్ గురించి పెద్దగా చర్చ జరగలేదు. బోస్కో ఓ ఇంటర్వ్యూలో మూవీ సాంగ్ పై సంచలన కామెంట్స్ చేశారు. ఈ మూవీ నాకెంతో ఇష్టం. ఎన్టీఆర్, జాన్వీతో చేయడం చాలా హ్యీపీగా అనిపించింది. కానీ మూవీ విషయంలో ఒకటే అసంతృప్తి ఉంది.
Read Also : Jayam Ravi : జయం రవి కోసం రూ.100 కోట్లు అప్పు చేశా.. సీన్ లోకి హీరో అత్త..
ఆ సాంగ్ చేసినందుకు ఎన్టీఆర్, జాన్వీ, డైరెక్టర్ నుంచి ఏమైనా గుర్తింపు లభిస్తుందేమో అని ఎదురు చూశా. కానీ ఎవరూ పెద్దగా నా గురించి మాట్లాడలేదు. కనీసం ప్రమోషన్స్ లో అయినా చెబుతారేమో అనుకుని ఎదురు చూశా. అది కూడా జరగలేదు. అది చాలా బాధగా అనిపించింది. ఒక కొరియోగ్రాఫర్ కు గుర్తింపు చాలా అవసరం.
అతను పనిచేసిన దానికి సరైన గుర్తింపు లభిస్తే మరింత బాగా పనిచేయాలని అనుకుంటాడు. ఆ విషయం అందరూ గుర్తించాలి’ అంటూ తెలిపాడు బోస్కో. ఎన్టీఆర్, జాన్వీ జంటగా కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన ఆ మూవీ మంచి హిట్ టాక్ సంపాదించుకుంది. ప్రస్తుతం దీనికి సీక్వెల్ కూడా వస్తోంది. ఇందులో చుట్టమల్లే సాంగ్ యూట్యూబ్ లో భారీ వ్యూస్ సంపాదించుకుంది. ఇప్పటికీ దీని క్రేజ్ కొనసాగుతోంది.
Read Also : Karnataka: విషాదం.. వధువుకు తాళి కట్టిన క్షణాల్లోనే వరుడు మృతి..