గడ్డం వంశీకృష్ణ.. పెద్దపల్లి ఎంపీ. 35 ఏళ్లకే లోక్‌సభలో అడుగుపెట్టారీ పొలిటికల్ వారసుడు. కాకా కుటుంబం నుంచి పెద్దపల్లి సీట్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న మూడో తరం నాయకుడు. అంతవరకు బాగానే ఉందిగానీ.. ఇప్పుడాయన వ్యవహారశైలి గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది నియోజకవర్గంలో. అటు పార్టీ కార్యక్రమాల్లో, ఇటు ప్రభుత్వ ప్రోగ్రామ్స్‌లో ప్రోటోకాల్ ప్రకారం పిలుపులు ఉండటం లేదన్నది ఎంపీ అనుచరుల ఆరోపణ. ఐడెంటిటీ సమస్య కావడంతో ఆగ్రహంతో ఉన్నారట ఎంపీసాబ్.