Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Kodali Nani

Off The Record : గుడివాడలో కొడాలి నాని కోసం ఎదురు చూపులు

Published Date :February 27, 2026 , 7:40 pm
By Gogikar Sai Krishna
  • 24 ఎన్నికల తర్వాత పూర్తిగా మారిపోయిన గుడివాడ రాజకీయం
  • ఉమ్మడి కృష్ణా వైసీపీ కేడర్‌ మొత్తం రీ ఛార్జ్‌ మోడ్‌లోకి
  • గుడివాడలో మాత్రం కొడాలి నాని కోసం ఎదురు చూపులు
  • జైలుకు వెళ్ళి వచ్చిన నేతలు సైతం యాక్టివ్‌గా
Off The Record : గుడివాడలో కొడాలి నాని కోసం ఎదురు చూపులు
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

వస్తున్నా… వచ్చేస్తున్నా…. అంటూ ఎప్పటికప్పుడు నియోజకవర్గానికి సంకేతాలు పంపుతున్న ఆ మాజీ మంత్రి ఎందుకు లేట్‌ చేస్తున్నారు? ఒక ఉమ్మడి జిల్లా మొత్తం మీద వైసీపీ రీ ఛార్జ్‌ అయితే… ఆ ఒక్క సెంగ్మెంట్‌లో మాత్రమే నాయకుడి కోసం ఎదురు చూడ్డానికి కారణం ఏంటి? అటు టీడీపీ కూడా కమ్‌…కమ్‌… వెల్కమ్‌. మీరు ఎంత త్వరగా వస్తే మా టార్గెట్‌ అంత త్వరగా పూర్తవుతుందని అంటోందా? ఎవరా నాయకుడు? సొంత కేడర్‌తో పాటు ప్రత్యర్థులు కూడా ఎందుకు ఎదురు చూస్తున్నారు?

కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం, ఇక్కడి నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యే అయి, మంత్రిగా కూడా పని చేసిన కొడాలి నాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వైసీపీ హయాంలో 2019- 24 మధ్య ఎదురే లేదన్నట్టుగా వ్యవహరించారి కొడాలి. అప్పట్లో టీడీపీ, చంద్రబాబు ప్రస్తావన వచ్చిన ప్రతిసారి నోటికి బాగా పని చెప్పేవారన్న విమర్శలున్నాయి. దీంతో టిడిపి క్యాడర్ హిట్‌ లిస్టులో కొడాలి నాని టాప్‌ ప్లేస్‌లో ఉన్నట్టు కూడా చెప్పుకున్నారు. ఇక 24 ఎన్నికల్లో టీడీపీ గెలవడం, అదే సమయంలో పార్టీతోపాటు ఎమ్మెల్యేగా నాని ఓడిపోవడం లాంటి పరిణామాలతో నియోజకవర్గ రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. కొడాలి మీద కొన్ని కేసులు బుక్‌ అయ్యాయి. అదంతా ఒక ఎత్తయితే… కూటమి అధికారంలోకి వచ్చాక చాన్నాళ్ళు కామ్‌గానే ఉన్న జిల్లాకు చెందిన వైసీపీ నేతలంతా ఇప్పుడు యాక్టివ్‌ అయ్యారు. ఒక్క గుడివాడలో తప్ప మిగతా అన్ని సెగ్మెంట్స్‌లో వైసీపీ కేడర్‌ రీ ఛార్జ్‌ మోడ్‌లోకి వచ్చేసింది.

Also Read

  • Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
  • Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?
  • Off The Record : ఎన్టీఆర్ జిల్లాలో బలమైన కాపు నేతల కోసం వైసీపీ వెదుకులాట
  • Off The Record : టేకాఫ్ ఉంటుందా? లేదా పర్మినెంట్ ల్యాండిగేనా?
Add as a preferred
source on google

 

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా జిల్లా నుంచి మంత్రులుగా పనిచేసిన కొడాలి నాని, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, వల్లభనేని వంశీ వంటి నేతలు టిడిపిపై పూర్తిస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ మాటలు, చేష్టలతో అప్పట్లో కొన్ని సందర్భాల్లో ఈ నేతలు హద్దులు దాటారన్నది టిడిపి వర్గాల మాట. అందుకే తమ పార్టీ అధికారంలోకి వస్తే వీళ్ళ సంగతి తేల్చాలన్న రేంజ్‌లో టార్గెట్‌ చేసినట్టు చెబుతారు. అందులో భాగంగానే వల్లభనేని వంశీ, జోగి రమేష్‌ను జైలుకు పంపారన్నది జిల్లా వైసీపీ ఆరోపణ. ఇదే సందర్భంలో కొడాలి నాని ప్రస్తావన కూడా వస్తోంది. జైలుకు వెళ్ళి వచ్చాక కూడా… జోగి, వల్లభనేని యాక్టివ్‌గా తిరుగుతున్నారని, కొడాలి మాత్రం ఎందుకు ఎక్కడా కనిపించడం లేదన్న ప్రశ్నలు వస్తున్నాయి. జైలుకు వెళ్లి వచ్చిన వాళ్ళే ఎక్కడా తగ్గకుండా నియోజకవర్గాల్లో కేడర్‌ని యాక్టివ్‌గా ఉంచే ప్రయత్నం చేస్తుంటే…ఏమీ లేని గుడివాడలో మాత్రం మా నాయకుడు ఎప్పుడు వస్తారా అంటూ వైసీపీ కార్యకర్తలు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్న చర్చలు జరుగుతున్నాయి. అయితే… మాజీ మంత్రి సన్నిహితుల మాట మాత్రం వేరుగా ఉంది.

చాలా రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్టు చెబుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే నాని హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. దాని కారణంగా పూర్తి రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిందని, దీంతో కొన్ని కేసులకు సంబంధించి వాయిదాలకు, కొందరికి ఇళ్లల్లో కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతున్నట్టు క్లారిటీ ఇస్తోంది ఆయన వర్గం. గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి కాస్త మెరుగుపడిందని, వారంలో రెండు రోజులు నియోజకవర్గంలో ఉండి పార్టీ నేతలతో మంతనాలు జరుపుతుట్టు వివరిస్తున్నారు నాని సన్నిహితులు. అయితే… ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రెండు రోజుల రాజకీయం చాలదన్నది గుడివాడ వైసీపీ కేడర్‌ మాట. తానిక మీదట ఎన్నికల్లో పోటీ చేయబోనని గత ఎన్నికల సమయంలో ప్రకటించారు కొడాలి. కానీ… అదంతా గతం ఇప్పుడు పరిస్థితులు మారాయని, వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఆయన నిలబడతారని అంటున్నారు సన్నిహితులు. కాకుంటే యాక్టివ్‌ పాలిటిక్స్‌ చేయడానికి కొంత సమయం పట్టవచ్చని అంటున్నారు. మరో వైపు అధికార పార్టీ కూడా కొడాలి యాక్టివ్ పాలిటిక్స్ చేస్తేనే బెటర్‌ అని ఎదురు చూస్తోందట. ఆయన నేరుగా తిరుగుతూ ఉంటే… ఎక్కడో ఒకచోట తమకు దొరక్క పోతారా? తమ టార్గెట్ రీచ్ అవ్వకపోతామా అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆ కోణంలోనే… ఆయన రీ ఎంట్రీ ఎంత లేటయితే మేం అంత డిజప్పాయింట్‌ అవుతామంటూ సెటైరికల్‌గా మాట్లాడుతున్నారట టీడీపీ నాయకులు. గుడివాడ వైసీపీ కేడర్‌ మాత్రం వాళ్ల సంగతి వదిలేయండి…, కమాన్‌, మీరు గేరు మార్చేయండంటూ నాని కోసం ఎదురు చూస్తోంది. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో గుడివాడ రాజకీయం మాంఛి రసవత్తరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • kodali nani
  • NTV Telugu
  • OTR

తాజావార్తలు

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions