Off The Record : కవిత పార్టీలో చేరిన రాథోడ్ బాబూరావు..అసలు కారణాలేంటి ?
- కవిత పార్టీలో చేరిన రాథోడ్ బాబూరావు
- కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంపై చర్చలు
- కాంగ్రెస్‌లో బాబూరావుకు ప్రాధాన్యం దక్కలేదా?
- కార్యక్రమాలకు దూరంగా ఉంచుతున్నారన్న అసంతృప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ మాజీ ఎమ్మెల్యే… అధికారంలో ఉన్న పార్టీకి రాజీనామా చేసి ఇంకా పురుడుపోసుకోని పార్టీలో ఎందుకు చేరారు? గులాబీ శాసనసభ్యుడిగా పనిచేసి, రకరకాల కండువాలు మార్చిన ఆ నేతకు చివరికి అక్కే దిక్కయిందా? లేక వేరే కారణాలున్నాయా? అధికార పార్టీకి రిజైన్ చేయడానికి కారణం అక్కడ విలువ లేకపోవడమా? లేక అక్క మీద అభిమానమా? ఎవరా ఎక్స్ ఎమ్మెల్యే? ఏంటా జంపింగ్ స్టోరీ? ఆదిలాబాద్ జిల్లా బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్… ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాంరాం చెప్పేశారు. తాజాగా కవిత సమక్షంలో జాగృతి కండువా కప్పుకున్నారాయన. కొత్తగా పెట్టబోయే పార్టీలో చేరిన తొలి మాజీ ప్రజాప్రతినిధి అయ్యారు. దీంతో ప్రస్తుతం ఆయన రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన రకరకాల చర్చలు జరుగుతున్నాయి జిల్లాలో. 2014, 2018లో బీఆర్ఎస్ తరఫున వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు.2023లో అదే పార్టీ టికెట్ నిరాకరించడంతో… ఎన్నికలకు ముందు రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. అక్కడ సరైన ప్రాధాన్యం లేదంటూ… ఆతర్వాత 2024 ఏప్రిల్‌లో కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. నామినేటెడ్ పదవులు ఏమైనా వస్తాయని, లేదంటే పార్టీ పదవులైనా వస్తాయని ఆశించారు.
కానీ… ఇక్కడా సరైన ప్రాధాన్యం దక్కలేదట. పార్టీలో ఏం జరగుతోందో తెలియడం లేదని, పేరుకు అధికార పార్టీ అయినా… కీలక నాయకులను పట్టించుకోవడం లేదని ఆరోపించింది ఆయన వర్గం. ఈ పరిస్థితుల్లోనే కవిత పెట్టబోయే కొత్త పార్టీ వైపు అడుగులేసినట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో లీడర్ ఎవరో, క్యాడర్ ఎవరో, ఏ పని ఎవరికి అప్పగిస్తారో కూడా క్లారిటీ లేదని అంటున్నారు బాపూరావ్. పార్టీ కార్యక్రమాలకు, నిర్ణయాలకు తనను దూరంగా ఉంచుతున్నారనే అసంతృప్తితో రగిలిపోతున్న మాజీ ఎమ్మెల్యే కొంతకాలం నుంచి దూరంగా ఉన్నారు.కాంగ్రెస్ విధానాలు, నిర్ణయాలు నచ్చకనే తాను పార్టీని వీడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీనికి తోడు గతంలో తన రాజకీయ ప్రయాణంలో కల్వకుంట్ల కవిత ప్రోత్సాహం కీలకమని, అందుకే అటువైపు మొగ్గానన్నది ఆయన వెర్షన్.
Also Read
బోథ్ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో…ఏ పార్టీ అయినా టిక్కెట్ ఇస్తుందన్న గ్యారంటీ లేదు. కొత్త పార్టీలో అయితే కచ్చితంగా టిక్కెట్ ఇస్తారన్న ప్లాన్‌తోనే రాథోడ్ బాబూరావు అటువైపు మొగ్గారన్నది రాజకీయవర్గాల విశ్లేషణ. అయితే… అధికార పార్టీకి రాజీనామా చేసి… ఇంకా పుట్టని పార్టీ చేరడం మాత్రం చెప్పుకోవాల్సిన అంశమేనన్న చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు ఇప్పటికే బీఆర్ఎస్ హయాంలో కీలకంగా వ్యవహరించిన నాయకులు మరికొందరు ఇటీవలే కవితతో భేటీ అయినట్టు తెలిసింది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్‌లో కొత్త పార్టీ ప్రభావంపై జోరుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి.
- Tags
- Kavitha
- NTV Telugu
- OTR
- telangana
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..