OTR : ఏపీ రాజకీయాల్లో లెటర్ వార్.. పవన్ కల్యాణ్ కు బొత్స సంచలన లేఖ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లేఖల యుద్ధంలో ఆ సీనియర్ నేత సరికొత్త సంచలనానికి తెరతీయబోతున్నారా? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సీక్రెట్ లెటర్ రాశారన్నది నిజమేనా? అదే నిజమైతే….. అందులో ఏముంది? ఉప ముఖ్యమంత్రికి రహస్య లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది….? పైగా…. నేను రాశానని స్వయంగా చెప్పడంలో ఆంతర్యం ఏంటి? ఎవరా నాయకుడు? ఏంటా లేఖాయణం? పాలిటిక్స్‌లో మైండ్ గేమ్ మామూలే అయినా… ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఆ డోస్ ఇంకాస్త ఎక్కువగా నడుస్తోంది. పొజిషన్, అపోజిషన్ గట్టిగా టార్గెట్ చేసుకుని మరీ… వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఈ సెగలు రాష్ట్ర స్థాయి నుంచి నెమ్మదిగా కిందకి కూడా తగులుతున్నాయి. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పనితీరుపై విపక్షం వైసీపీ… ప్రజా క్షేత్రంలో తేల్చుకోవడానికి రెడీ అయి పోయింది. ఎన్నికల హామీలు అమలు, ప్రజల సమస్యల ఆధారంగా వరుస నిరసనలు, ఆందోళనలతో వత్తిడి పెంచుతోంది. సామాజిక పెన్షన్లు, మత్స్యకార భరోసా, నిత్యావస ధరలు, ఇంధన రేట్ల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందంటూ…. తమ వాదనను లబ్ధిదారులు, మధ్యతరగతి వర్గాలల్లోకి బలంగా తీసుకునివెళ్ళే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ వాదనను జనంలోకి గట్టిగా తీసుకునివెళ్ళి చర్చకు పెట్టాలన్నది వైసీపీ పెద్దల ప్లాన్. అదే సమయంలో కూటమి పార్టీలు గట్టిగానే కౌంటర్ చేస్తున్నప్పటికీ… కొందరు సీనియర్లు ఎమ్మెల్యేలు సహా పార్టీల ముఖ్య నాయకత్వం ఆత్మస్తుతి, పర నిందకు పరిమితం అయిందనే ప్రచారం కూడా మొదలైంది. ఈ పరిస్థితుల్లో… ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ యాక్టివ్ రోల్‌లోకి వచ్చేశారు. అనారోగ్య కారణాలతో కొన్నాళ్ళు స్తబ్దుగా ఉన్నారాయన. దాంతో… బొత్స ఎక్కడ…?. అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జరిగింది. కానీ…. కొద్ది రోజులకే సత్తిబాబు ఈజ్ బ్యాక్ అంటూ… పదునైన ఆరోపణలు, వాటికి ఆధారాలతో మళ్ళీ ప్రజల ముందుకు వచ్చారాయన. అదే ఊపులో… ఇప్పుడు బొత్స… ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌కు, కేంద్ర ప్రభుత్వానికి రహస్య లేఖలు రాశారన్న అంశం హాట్ టాపిక్ అయింది. మండలిలో లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదాలో ఆయన సీక్రెట్ లెటర్ రాశారన్న వ్యవహారం సంచలనం అవుతోంది. రెండు వారాల క్రితమే రాశారని, ఉత్తరం అందినట్టు ఢిల్లీ నుంచి తిరుగు సమాధానం కూడా వచ్చినట్టు చెప్పుుకుంటున్నారు. వాస్తవానికి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ హోదాలో లేఖలు రాయడం బొత్స సత్యనారాయణకు కొత్తేమీ కాదు. పార్టీ అధినేత కంటే ఎక్కువ అథారిటీతో ఖచ్చితమైన సమాచారం కోరడమే కాదు, వాటిపై విస్తృతమైన చర్చకు కూడా తెరతీస్తుంటారు ఈ సీనియర్ నేత. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వం చేస్తున్న అప్పులు, వైఫల్యాలు వంటి వాటి మీద గవర్నర్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాయడం ఇటీవలి కాలంలో అలవాటుగా చేసుకున్నారాయన. కానీ… ఇప్పటి వరకు రాసిన లేఖలన్నీ ఓపెన్. అందుకు భిన్నంగా ఇప్పుడు మొదటిసారి “కాన్ఫిడెన్షియల్” పేరుతో కేంద్ర ప్రభుత్వంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు లెటర్స్ రాశారాయన. రెండు చోట్లకు లేఖలు చేరిపోయాయి కూడా.
Also Read
- OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
- OTR : హైదరాబాద్ FSL లో అగ్నిప్రమాదం.. మేడిగడ్డ ఫైళ్లు తగలబడటం వెనుక రహస్యం ఏంటి?
- Off The Record : డెలివరీ సూపర్.. ప్రచారం వీక్! కాంగ్రెస్ మార్క్ పాలన ప్రజల్లోకి వెళ్లడం లేదా?
- Off The Record : సొంత ప్రభుత్వమైనా తగ్గేదే లే.. దొంతి మాధవరెడ్డి రూటే సెపరేటు!
ఈ విషయమై స్వయంగా బొత్స ఓపెన్ అవ్వడంతో సర్వత్రా ఆసక్తి పెరుగుతోంది. నేను లేఖలు రాశానని ఆయన అన్నారేగానీ… సబ్జెక్ట్ మాత్రం చెప్పలేదు. దీంతో…దేని గురించి అయి ఉంటుందంటూ రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ప్రాధమిక సమాచారం ప్రకారం’ జీ రాంజీ ‘ పథకం అమలులో లోపాలను, అవినీతిని బొత్స ప్రస్తావించినట్టు తెలిసింది. ఉపాధి హామీ పనులు, కూలీల హాజరు నమోదులో మోసాలు జరుగుతున్నాయంటూ… కొన్ని ఆధారాలను కూడా ఆ లేఖలకు జత పరిచారట ఎల్వోపీ. దీనిపై పవన్ కల్యాణ్ దృష్టి సారించాలని కోరడంతో పాటు కేంద్రం కూడా విచారణకు ఆదేశించాలని అభ్యర్థించినట్టు తెలిసింది. ఇలా లెటర్ రాయడం ద్వారా… రాష్ట్రంలో ‘జీ రాంజీ ‘ స్కీమ్ అమలు లోపభూయిష్టంగా ఉందని, స్టేట్ గవర్నమెంట్ సక్రమంగా వ్యవహరించడంలేదని ప్రజల ముందుకు విస్తృత చర్చ పెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్ష నేత హోదాలో తాను రాసిన లేఖ కాన్ఫిడెన్స్షియల్ కాబట్టి…నిర్ధిష్ట సమయం వరకు ఎదురు చూడాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్పందనను బట్టి తదుపరి కార్యాచరణ రూపొందించుకోవాలనుకున్నట్టు సమాచారం. ఈ పరిణామాలను బట్టి చూస్తుంటే… రాబోయే రోజుల్లో ఉపాధి హామీ పథకాన్ని తన రాజకీయ అస్త్రాల లిస్ట్‌లో చేర్చాలని వైసీపీ భావిస్తున్నట్టు కనిపిస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. దాన్ని ఏపీ సర్కార్, ప్రత్యేకంగా జనసేన ఎలా కౌంటర్ చేస్తాయన్నది ఇప్పుడు ఇంట్రస్టింగ్ టాపిక్.
- Tags
- botsa satyanarayana
- ntv
- OTR
తాజావార్తలు
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
-
Ratna Debnath: ‘నేను నా కూతురిని కోల్పోయా.. ఆమె తన కుర్చీని కోల్పోయింది’.. మమతపై ఆర్జీ కార్ బాధితురాలి తల్లి విమర్శలు
-
Hyderabad: కంత్రీగాడి తాటతీసిన పోలీసులు.. వీడిన నార్సింగ్ మహిళపై వేధింపుల కేసు
-
OTR : హైదరాబాద్ FSL లో అగ్నిప్రమాదం.. మేడిగడ్డ ఫైళ్లు తగలబడటం వెనుక రహస్యం ఏంటి?
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?