Off The Record : తెలంగాణ రియల్ఎస్టేట్ రంగంలో ఊహించని కుదుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రియలెస్టేట్ కింగ్డమ్లో ఏం జరుగుతోంది….? అత్యంత కీలకమైన ఆ పదవికి సమర్ధుడని పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎందుకు గుట్టు చప్పుడు కాకుండా గుడ్‌బై చెప్పేశారు? తెర వెనక అసలు కథ ఏంటి….? పదవీకాలం ముగియక ముందే ఆ టాప్ బాస్ ఎందుకు తప్పుకున్నారు….? ఇంతకీ… ఏదా హాట్ సీట్? ఎవర్ని వరించబోతోంది? పరుగుడు గుర్రానికి కళ్లెం వేసినట్టు…పోట్ల గిత్తకు ముకుతాడు వేసినట్టు… రియల్ ఎస్టేట్ రంగంలో నిబంధనల గీత దాటకుండా చూసే కీలక స్థానంలో ఊహించని కుదుపు చోటుచేసుకుంది. తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ.. అంటే…రెరా చైర్మన్ ఎన్. సత్యనారాయణ తన ఐదేళ్ల పదవీకాలం పూర్తికాక ముందే తప్పుకున్నారు. ఇదే ఇప్పుడు ఇటు రియలెస్టేట్, అటు పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద చర్చనీయాంశం అవుతోంది. వెన్నునొప్పి సమస్యతో పాటు.. వైద్యుల సూచనలు, కుటుంబ సభ్యుల సలహాతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పైకి చెబుతున్నా… దీని వెనక ఏదైనా అంతర్గత ఒత్తిళ్లు ఉన్నాయా అన్న అనుమానం అలాగే ఉండిపోయింది. ఆయన రాజీనామా చప్పుళ్ళే… అటు సెక్రటేరియట్ నుంచి ఇటు రియల్ ఎస్టేట్ గ్రౌండ్ దాకా ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. సత్యనారాయణ రిజైన్ చేయడం ఒక ఎత్తయితే…. ఖాళీ అయిన ఆ హాట్ సీట్‌ను ఎవరితో భర్తీ చేస్తారన్న ఇంకా ఆసక్తిగా మారింది.
సెర్చ్ కమిటీ ద్వారా నియామక ప్రక్రియను ఇప్పటికే స్పీడప్ చేసింది ప్రభుత్వం. ఈ రేస్‌లో లాబీయింగ్ కూడా జోరుగా నడుస్తోందట. ఇందులో ముఖ్యంగా ఇద్దరు టాప్ బ్యూరోక్రాట్ల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణతో పాటు… మాజీ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి పేర్లు రేసులో ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే నెలతో… సీఎస్ పదవీకాలం ముగుస్తున్నందున రామకృష్ణారావుకే ఈ పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు పరిశీలకులు. నిజానికి 2017లోనే రెరా ఏర్పాటైనా… 2023 వరకు దానికి పూర్తిస్థాయి చైర్మన్ లేరు. సత్యనారాయణ బాధ్యతలు చేపట్టాక ప్రాజెక్ట్‌ల రిజిస్ట్రేషన్లలో పారదర్శకత తెచ్చారు. కొనుగోలుదారుల హక్కులకు ప్రాధాన్యత ఇస్తూ గట్టి సంస్కరణలే తెచ్చారన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఆయన సడన్‌గా ఎగ్జిట్ అవ్వడంతో బిల్డర్లలో కూడా ఒకలాంటి టెన్షన్ మొదలైందట. కొత్తగా వచ్చేవాళ్లు ఎలా ఉంటారన్నది వాళ్ల బెంగ. ప్రస్తుతానికైతే కొత్త చైర్మన్ నియామకంపై సచివాలయ వర్గాల్లో ఒక రేంజ్లో టాక్ నడుస్తోంది. ఈ కీలకమైన పీఠంపై కూర్చోబోయే ఆ కొత్త బాస్ ఎవరు… ప్రభుత్వం ఎవరి వైపు మొగ్గు చూపుతుందోనని ఉత్కంఠగా చూస్తున్నాయి రియలెస్టేట్ వర్గాలు.
Also Read
- Tags
- NTV Telugu
- OTR
- telangana
తాజావార్తలు
-
Hashmi – Himesh : 20 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ, హిమేష్ రేష్మియా రీ యూనియన్
-
Madras Regiment Arms Theft Case: బొల్లారం మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
Iran Trolls Trump: ట్రంప్‌ను టీజ్ చేసిన ఇరాన్.. బాలయ్య ‘భగవంత్ కేసరి’ క్లిప్‌తో కౌంటర్
-
Budameru Floods: బుడమేరులో పెరిగిన వరద ఉద్ధృతి.. అప్రమత్తమైన అధికారులు..
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!