AP Panchayat Elections 2026: రెండో దశ పోలింగ్‌లో ఉద్రిక్తతలు.. నకిలీ బ్యాలెట్ పేపర్లు, రాళ్ల దాడులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Panchayat Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న వేళ పలు జిల్లాల్లో ఉద్రిక్త ఘటనలు చోటుచేసుకున్నాయి. ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో నకిలీ బ్యాలెట్ పేపర్లు, దొంగ ఓట్ల ఆరోపణలు, పోలింగ్ కేంద్రాల వద్ద వాగ్వాదాలు, ఇరువర్గాల మధ్య ఘర్షణలు కలకలం రేపాయి. పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామంలో నకిలీ బ్యాలెట్ పేపర్లు కలకలం సృష్టించాయి. పోలింగ్ కేంద్రం వద్ద ఓ వ్యక్తి దగ్గర ఐదు నకిలీ బ్యాలెట్ పేపర్లను అధికారులు గుర్తించారు. వెంటనే ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై విచారణ చేపట్టారు.
కృష్ణా జిల్లా పామర్రులోని జెడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 13వ బూత్‌లో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, పూడి లక్ష్మి ప్రశ్నించడంతో వివాదం మొదలైంది. ఈ క్రమంలో పోలింగ్ బూత్‌లో తోపులాట చోటుచేసుకుంది. ఓ ఏజెంట్ కిందపడిపోవడంతో ఆయన తలకు గాయమైంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. తనను పోలీసులు తోసేశారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. అధికార పార్టీకి పోలీసులు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. ఈ ఘటన నేపథ్యంలో టీడీపీ నాయకులు కూడా హైస్కూల్ వద్దకు చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
Also Read
- MK Stalin: "రాజీపడే ప్రసక్తే లేదు".. రాహుల్ గాంధీ చెన్నై పర్యటనకు ముందు స్టాలిన్ కీలక సందేశం..
- Motorcycle Diaries: రిషబ్ శెట్టి సమర్పించు 'మోటార్ సైకిల్ డైరీస్'..!
- IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
- KAAKA Release Date: సంక్రాంతికి ‘కాకా’ పక్కా.. 'ఆటో జానీ'గా మెగాస్టార్ మాస్ ట్రీట్..!
కృష్ణా జిల్లా కంకిపాడులోని సెయింట్ మేరీస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన 7, 8, 9 పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఉద్రిక్తత నెలకొంది. ఏడో పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన తర్వాత ఓటర్ల వేలిపై చెరగని సిరా గుర్తు సరిగా పడటం లేదని పలువురు ఫిర్యాదు చేశారు. ఈ సమస్యను పరిశీలించేందుకు వచ్చిన సర్పంచ్ అభ్యర్థి పులి కామేశ్వరరావు విధుల్లో ఉన్న అధికారులను ప్రశ్నించారు. అయితే ఓటర్ల ఫిర్యాదులపై అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో వాగ్వాదం మొదలైంది. సర్పంచ్ అభ్యర్థితో అధికారులు దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సమయంలో ఘటనను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులను కూడా పోలీసులు అడ్డుకోవడం వివాదానికి దారితీసింది. వీడియోలు తీయడానికి అనుమతి లేదంటూ ప్రశ్నించడంతో మీడియా ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాల వారు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల సమక్షంలోనే ఇరువర్గాలు దాడులకు దిగినట్లు సమాచారం. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సమయంలో వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
తాజావార్తలు
-
AP Panchayat Elections 2026: రెండో దశ పోలింగ్‌లో ఉద్రిక్తతలు.. నకిలీ బ్యాలెట్ పేపర్లు, రాళ్ల దాడులు!
-
MK Stalin: “రాజీపడే ప్రసక్తే లేదు”.. రాహుల్ గాంధీ చెన్నై పర్యటనకు ముందు స్టాలిన్ కీలక సందేశం..
-
Motorcycle Diaries: రిషబ్ శెట్టి సమర్పించు ‘మోటార్ సైకిల్ డైరీస్’..!
-
Mann Ki Baat 140th Episode: మన్ కీ బాత్.. డ్రగ్స్‌పై పోరాటం, సంచార్ సాథీ, ఫిట్ ఇండియాపై మోడీ కీలక సందేశాలు!
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!
-
IND vs NZ 2nd Test: రెండో టెస్టులో సిరాజ్‌కు మళ్లీ నిరాశ.. ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు ఛాన్స్!
-
9,000mAh బ్యాటరీ, 200MP కెమెరా, కూలింగ్ ఫ్యాన్, 185Hz డిస్ప్లేతో రానున్న Realme 17 Ultra..!