Motorcycle Diaries: రిషబ్ శెట్టి సమర్పించు ‘మోటార్ సైకిల్ డైరీస్’..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Motorcycle Diaries: టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్మెంట్స్, రిషబ్ శెట్టి ఫిల్మ్స్ సంయుక్తంగా ఓ వినూత్న సినిమాను తెరకెక్కిస్తున్నాయి. ‘మోటార్‌సైకిల్ డైరీస్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ప్రతి మైలురాయి ఓ జ్ఞాపకంగా.. ప్రతి మలుపు ఓ కథగా సాగే ఓ భావోద్వేగ ప్రయాణమే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం. కేవలం గమ్యస్థానాలకు చేరుకోవడం మాత్రమే కాకుండా.. ప్రయాణంలో ఎదురయ్యే అనుభవాలు, కొత్త పరిచయాలు, జీవితాన్ని మలుపు తిప్పే సంఘటనలకు ఈ సినిమాలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఓ అందమైన ట్రావెల్ ఫిల్మ్‌గా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది.
Also Read
- IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
- KAAKA Release Date: సంక్రాంతికి ‘కాకా’ పక్కా.. 'ఆటో జానీ'గా మెగాస్టార్ మాస్ ట్రీట్..!
- Moringa Millet Khichdi Recipe: చలికాలంలో వేడివేడిగా మునగాకు మిల్లెట్ కిచిడీ.. రుచికి ఆరోగ్యానికి ఆరోగ్యం..
- Ravichandran Ashwin: సిరాజ్ విషయంలో గంభీర్ నిర్ణయం కరెక్టే.. అశ్విన్ సంచలన పోస్ట్..
ఈ సినిమాకు శివా చిరంతన దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, ప్రగతి రిషబ్ శెట్టి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. భువన్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా, ధరణి గంగెపుత్ర ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
విభిన్నమైన కథలతో సినిమాలు నిర్మించే సితార ఎంటర్టైన్మెంట్స్, రిషబ్ శెట్టి ఫిల్మ్స్ కలిసి చేస్తున్న ఈ ప్రయత్నంపై సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా రిషబ్ శెట్టి సమర్పకుడిగా వ్యవహరిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై మరింత క్యూరియాసిటీ పెరిగింది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో నటించే నటీనటులు, ఇతర వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు. డిఫరెంట్ టైటిల్‌తో రాబోతున్న ఈ ‘మోటార్‌సైకిల్ డైరీస్’ ప్రేక్షకులను ఎలాంటి భావోద్వేగ ప్రయాణంలోకి తీసుకెళ్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Motorcycle Diaries: రిషబ్ శెట్టి సమర్పించు ‘మోటార్ సైకిల్ డైరీస్’..!
-
Mann Ki Baat 140th Episode: మన్ కీ బాత్.. డ్రగ్స్‌పై పోరాటం, సంచార్ సాథీ, ఫిట్ ఇండియాపై మోడీ కీలక సందేశాలు!
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
Varanasi Update: : ‘వారణాసి’లో 25 నిమిషాల రామాయణ ఘట్టం.. ఆధునిక టైమ్ ట్రావెల్ కథతో లింక్?
-
KAAKA Release Date: సంక్రాంతికి ‘కాకా’ పక్కా.. ‘ఆటో జానీ’గా మెగాస్టార్ మాస్ ట్రీట్..!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!
-
IND vs NZ 2nd Test: రెండో టెస్టులో సిరాజ్‌కు మళ్లీ నిరాశ.. ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు ఛాన్స్!
-
9,000mAh బ్యాటరీ, 200MP కెమెరా, కూలింగ్ ఫ్యాన్, 185Hz డిస్ప్లేతో రానున్న Realme 17 Ultra..!