OTR: ఉమ్మడి నల్గొండలో రెడ్డి ఆధిపత్యం? కాంగ్రెస్‌లో బీసీ నేతల అసంతృప్తి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ మొత్తం మీద ఆ ఉమ్మడి జిల్లాలో క్యాస్ట్ ఈక్వేషన్స్ కాస్త డిఫరెంట్‌గా ఉంటాయి. అదే… కాంగ్రెస్ పార్టీలో క్రమంగా సమస్య అవుతోందట. పదవులు, పెత్తనాలు మొత్తం వాళ్ళకేనా…? మాకు వద్దా? మాలో లీడర్స్ లేరా అంటూ ఒక సామాజికవర్గం నేతలపై మిగతా వాళ్ళలో అసహనం పెరుగుతోందట. అంత డిఫరెంట్ కుల సమీకరణలున్న ఆ జిల్లా ఏది? అసహనం పెరుగుతోంది ఎవరిలో?
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్టీ ఏదైనా… పవర్ మాత్రం రెడ్డి సామాజిక వర్గం చేతుల్లోనే ఉంటుందన్న అభిప్రాయం పెరుగుతోంది. ఇద్దరు ఎంపీలు, జిల్లాకు చెందిన మంత్రులు, ముఖ్యమైన నామినేటెడ్ పదవులన్నిటిలో వాళ్ళ ఆధిపత్యమే పెరిగిపోతోందంటూ మిగతా వర్గాల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోందట. బలమైన, ప్రభావం చూపించగలిగిన సామాజికవర్గంగా అన్ని పార్టీల్లోనూ ఆధిపత్యం కనిపిస్తున్నా… కాంగ్రెస్‌లో మాత్రం డోస్ మరీ శ్రుతిమించిపోయిందన్న చర్చలు ఉమ్మడి జిల్లాలో జరుగుతున్నాయి. గత ఎన్నికల్లో… ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్దానాలకుగాను 11చోట్ల గెలిచింది కాంగ్రెస్. ఇందులో రెండు ఎస్సీ రిజర్వుడ్ కాగా, ఒకటి ఎస్టీ సీటు. మిగతా 8మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఏడుగురు రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే. ఒక్కరు మాత్రమే బీసీ. ఇక ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు కేబినెట్ మంత్రులు కూడా రెడ్లే. అలాగే… నల్లగొండ, భువనగిరి ఎంపీలదీ అదే సామాజికవర్గం. నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి.. సీనియర్ నేత జనారెడ్డి కుమారుడు. జానా కుమారులు ఇద్దరిలో ఒకరు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కాగా మరొకరు ఎంపీ. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ అసెంబ్లీకి ఎన్నిక కాగా… వెంకట్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం కనిపించని శత్రువుతో బిగ్ ఫైట్ చేస్తున్నారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుండి గెలిచి రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నారు. ఆయన భార్య పద్మావతి రెడ్డి కోదాడ ఎమ్మెల్యే. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా నల్లగొండ జిల్లాకు చెందినవారే.
Also Read
ఆయన కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి డైరీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటి విడతలో దక్కిన నామినేటేడ్ పోస్టుల్లో పటేల్ రమేష్ రెడ్డికి ప్రాముఖ్యత, ప్రాధాన్యత లభించింది… మరోసారి నామినేటెడ్ పదవి కోసం ట్రయల్స్‌లో ఉన్నారాయన. తాజాగా సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల కోసం పట్టుబడుతున్నారు. తాజాగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దివంగత నేతల రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తమ్ రెడ్డిని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ.. రెండో విడత నామినేటెడ్ పోస్టులను దక్కించుకునేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి పొటీ పడుతున్న వాళ్ళలో రెడ్డి నేతలు ముందు వరసలో ఉన్నారు. కీలక స్థానాల్లో ఉన్న పెద్ద రెడ్ల ఆశీస్సులు ఎవరికి ఉంటే వారికే పదవులు దక్కుతాయన్నది జిల్లాలో ఓపెన్ టాక్. చట్ట సభలతోపాటు, నామినేటేడ్ పదవుల్లో, పార్టీ పదవుల్లో… గుడి చైర్మన్, బడి చైర్మన్ ఇలా పదవి ఏదైనా పవర్ మొత్తం వాళ్ళకేనా అన్న చర్చ జరుగుతోందట జిల్లాలో. మరీ ముఖ్యంగా బీసీ నాయకుల్లో ఈ అసహనం పెరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. మొదటి తరం నుండి రెండో తరం రెడ్డి నేతలకు ఏ అడ్డుంకులు లేకుండా పదవులు కట్టబెడుతుంటే… మేం ఇంకెన్నారళ్లు వేచిచూడాలి… మాకేం పదవులు లేవా అంటూ బీసీ లీడర్స్ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. మేం అడిగితే… ఈజీగా, ఏమాత్రం ఆలోచించకుండా నో చెప్పేస్తున్నారంటూ కాస్త కోపంగానే కామెంట్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఒకవేళ ఇతర సామాజికవర్గాల వాళ్ళు జిల్లా నేతలను కాదని రాష్ట్ర పెద్దల ఆశీస్సులతో పదవులు దక్కించుకుంటే… వాళ్ళను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించడం రోటీన్‌గా మారిందని చెప్పుకుంటున్నారు. తరాలు మారినా పదవులు దక్కడం లేదని, మా ప్యూచర్ ఏంటని బీసీ నేతలు ప్రశ్నిస్తున్నారట. అరాకొరా వస్తున్నా… కీలక నేతలకు అత్యంత దగ్గరగా ఉండేవాళ్ళకు తప్ప…ఇతరులకు ఛాన్స్ రావడం లేదని అంటున్నారు. బీసీల పరిస్దితి ఇలా ఉంటే… ఎస్సీల సంగతి వర్ణనాతీతం అంటున్నారు. వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా రెడ్డి సామాజికవర్గం నాయకుల పెత్తనం, ఆధిపత్యం సర్వసాధారణం అన్నది జిల్లాలో ఓపెన్ టాక్. ఈ ఆసంతృప్తి, ఆవేశం కట్టలు తెంచుకోకముందే పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి ఆయా సామాజికవర్గాలు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?