OTR: పాలకుర్తి టిక్కెట్ గురించి అప్పుడే కాంగ్రెస్‌లో చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్క సీటు కోసం అందరూ పోటీ పడుతున్నారా..? లేదంటే ఉన్న వాళ్ళు సెట్ అవ్వట్లేదని సెట్ చేసే పనిలో పడ్డారా..? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ళ సమయం ఉండగానే… అప్పుడే ఆ నియోజకవర్గం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అక్కడ అధికార పార్టీ టిక్కెట్ కోసం ఎందుకంత పోటీ పెరుగుతోంది?
ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంపై కాంగ్రెస్ నేతల ఫోకస్ పెరిగిందా..? సొంత పార్టీలోనే టిక్కెట్ పోటీ ఎక్కువైందా..? ఆల్రెడీ ఉన్న వాళ్ళను సెట్ చేయడానికి పావులు కదులుతున్నాయా..? అంటూ రకరకాల యాంగిల్స్‌లో కొత్త కొత్త చర్చలు మొదలయ్యాయి. దీంతో… అసలు పాలకుర్తి ఎందుకంత హాట్ టాపిక్ అయిందంటూ సొంత పార్టీలోనే క్వశ్చన్‌మార్క్ ఫేస్‌లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఉన్నారు. ఆమె అత్త ఝాన్సీరెడ్డి కాంగ్రెస్ సీనియర్ లీడర్ కాగా…. గత ఎన్నికల్లో కోడలిని గెలిపించడానికి గట్టిగా కష్టపడ్డారు. అయితే… ఈసారి మాత్రం తానే బరిలో నిలవాలని భావిస్తున్నారట ఆమె. కానీ…ఝాన్సీ పౌరసత్వానికి సంబంధించిన వ్యవహారం పెండింగ్‌లో ఉంది. దాంతో ముందు ఆ విషయంలో క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. అదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే…. అత్త ఒక చోట, కోడలు మరో నియోజకవర్గంలో పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన సైతం ఉందట. మరోవైపు పాలకుర్తి నియోజకవర్గంలో అంతర్గత పంచాయతీ ఎక్కువైందని అంటున్నారు. అది ముదిరి క్రమశిక్షణ కమిటీ వరకు వెళ్లింది. ప్రస్తుతం పాలకుర్తి కాంగ్రెస్ క్యాడర్ రెండుగా చీలిపోయే ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు.
Also Read
దాంతో లోకల్‌గా పార్టీని సెట్ చేయడానికి అగ్ర నాయకత్వం రంగంలోకి దిగింది. దీనికి తోడు ఇక్కడ కీలక నాయకులను బరిలోకి దించి వ్యవహారాన్ని సెట్ చేయాలన్న ఆలోచన కూడా ఉందని అంటున్నారు. ఆ క్రమంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి కుమారుడిని బరిలో దించుతారన్న టాక్ నడుస్తోంది. అయితే.. దీన్ని ఆయన సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు. మరోవైపు వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన బంధువులని రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం సైతం నడుస్తోంది. ఎంపీ రఘురామ్ రెడ్డి కుమారుడిని పాలకుర్తిలో పోటీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న చర్చ నడుస్తోంది. ఫైనల్‌గా నిర్ణయం ఎలాఉన్నా…. ఎవరు తెర మీదికి వచ్చినా…ఇప్పుడైతే పాలకుర్తి టిక్కెట్ గురించి కాంగ్రెస్‌లో హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కుటుంబం ఎత్తుగడలు ఒకవైపు… మిగిలిన నాయకులవి మరోలా కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!