Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Mudragada New Agenda

Off The Record: ముద్రగడకు లైన్ క్లియరైందా?

Published Date :May 3, 2023 , 7:18 pm
By NTV WebDesk
Off The Record: ముద్రగడకు లైన్ క్లియరైందా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడానికి లైన్‌ క్లియర్‌ అయినట్టేనా? డైరెక్ట్‌గా వెళ్ళి ఫ్యాన్‌ కింద సేదదీరకుండా ఆయనకు అడ్డుపడుతున్న పరిస్థితులు ఏవి? తాను తిరిగి పొలిటికల్‌గా యాక్టివ్‌ అవడంతో పాటు పద్మనాభం పెట్టుకున్న మరో టార్గెట్‌ ఏంటి? ఆ విషయంలో వైసీపీ నాయకత్వపు వైఖరి ఎలా ఉంది?

ముద్రగడ వైసీపీలో చేరడానికి లైన్‌ క్లియరైందా?
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై ఇన్నాళ్ళు తుని రైలు దగ్ధం కేసు ఉంది. 2016లో తుని దగ్గర రైలు తగలబెట్టిన కేసులో ఆయన పేరు కూడా ఉంది. ఆ కేసును ఇటీవల కోర్ట్‌ కొట్టేయడంతో తిరిగి పొలిటికల్‌గా యాక్టివ్‌ అవ్వాలనుకుంటున్నారు ఆయన. ముద్రగడ చివరిసారిగా 2009 ఎన్నికల్లో పిఠాపురం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.అంతకు ముందు సొంత నియోజకవర్గం ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా… 2004లో అక్కడ ఓటమితో ఇక జీవితంలో ప్రత్తిపాడు నుంచి పోటీ చేయబోనని బీష్మించుకు కూర్చున్నారు. ఆ తర్వాత వైసీపీలో చేరతారని ప్రచారం జరిగినా ఏ పార్టీ వైపు చూడలేదు ఆయన. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి ఓపెన్ ఆఫర్లు వచ్చినా కేసు కొట్టేసిన తర్వాతేనని చెబుతూ వచ్చారట. ఇప్పుడు ఆ మేటర్‌ క్లియరైనందున తిరిగి యాక్టివ్ అవడానికి అంతా సిద్ధం చేసుకుంటున్నారట. మనసులో మాట చెప్పకపోయినా… టిడిపి, జనసేనల్లోకి వెళ్లే పరిస్థితి లేదు. బీజేపీ, కాంగ్రెస్ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న స్థితిలో అటువైపు చూసే అవకాశం లేదు. అంతిమంగా ఆయన ఫ్యాన్‌ కింద సేదదీరడానికే సిద్ధమవుతున్నారట.

చిన్న కొడుకు గిరిబాబు రాజకీయ భవిష్యత్‌ గురించి ఆలోచిస్తున్నారా?
వైసీపీలో తనతో పాటు చిన్న కుమారుడు గిరిబాబు కూడా సీటు ఇవ్వాలని గతంలో డిమాండ్‌ పెట్టారు ముద్రగడ పద్మనాభం.. అయితే మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు కొడుకుని మాత్రం ఎన్నికల్లో పోటీ చేయిస్తే చాలని అనుకుంటున్నారు ఆయన. ప్రత్తిపాడులో తాను పోటీ చేయనని ఇప్పటికే చెప్పాను కాబట్టి కుటుంబ సభ్యులను కూడా అక్కడకు పంపకూడదని అనుకుంటున్నారట.. 2009లో ట్రయాంగిల్‌ ఫైట్‌ కారణంగా పిఠాపురంలో స్వల్ప తేడాతో ఓడిపోయారు ముద్రగడ. అందుకే.. గిరిబాబును అక్కడి నుంచే బరిలో దింపే ఆలోచన ఉందట. కానీ…పార్టీలోకి రమ్మని ఆహ్వానించే వరకు ఓకేగానీ… సీటు విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చే ఉద్దేశ్యంలో లేదట వైసీపీ. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీలో ఉంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

పిఠాపురంలో ఏం జరుగుతోంది? 

రాష్ట్రం మొత్తం మీద కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి… ప్రస్తుతం అక్కడ వైసీపీ నుంచి పెండెం దొరబాబు ఉన్నారు.. గతంలో ఇక్కడి నుంచే పీఆర్పీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన వంగా గీత ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్నారు. ఇలా రకరకాల ఈక్వేషన్లు చూసుకుని… సాధ్యా సాధ్యాలను పరిశీలించాకే చెబుతామని ముద్రగడకు వర్తమానం అందినట్టు చెప్పుకుంటున్నారు. గట్టి పోటీ ఇచ్చి జయాపజయాలను ప్రభావితం చేయగల అభ్యర్థి కోసమే వైసీపీ వెదుకుతోందన్నది పార్టీ వర్గాల మాట. పార్టీ ఇమేజ్‌తో సంబంధం లేకుండా వ్యక్తిగత కరిష్మా ఉన్న అభ్యర్ధులవైపు మొగ్గుతోందట వైసీపీ. అందుకే.. ఒకవేళ ముద్రగడ కుమారుడికి సీటు ఇవ్వడం సాధ్యం కాకుంటే…వేరే విధంగా న్యాయం చేస్తామని చెప్తోంది వైసీపీ నాయకత్వం.

మొత్తానికి పొలిటికల్ స్క్రీన్ పై మళ్ళీ కనిపించడానికి ముద్రగడ ప్రయత్నాలు చేస్తున్నారన్నది మాత్రం వాస్తవం. వైసీపీ కూడా ఆయనకు ఎర్ర తివాచీ పరిచినట్టే పరిచి ప్లస్‌లు, మైనస్‌ల లెక్కలు వేస్తోంది. పద్మనాభం కూడా తనకంటే… కుమారుడి రాజకీయ భవిష్యత్‌ ముఖ్యం కనుక ఏదో రూపంలో అతన్ని బరిలో దింపి పొలిటికల్‌గా సెట్‌ చేయాలని చూస్తున్నారట. పద్మనాభం ప్రయత్నాలు…వైసీపీ కూడికలు, తీసివేతలు అంతిమంగా ఎలాంటి రిజల్ట్ ఇస్తాయో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • mudragada
  • off the record
  • YSRCP

తాజావార్తలు

  • Off The Record : ఆత్మకూరులో మంత్రి అనుచరుల అడ్డగోలు దోపిడీ..?

  • Lifetime Achievement Award: ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ కు అరుదైన గౌరవం..

  • Monalisa- Farman Khan: మోనాలిసాను పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ బ్యాక్‌ గ్రౌండ్ ఇదే..

  • CM Revanth Reddy: అల్లు అర్జున్ హాలీవుడ్‌లో కూడా రాణించాలి.. సీఎం రేవంత్ రెడ్డి..

  • Off The Record : బుగ్గన అనుచరులు భూ కబ్జా చేశారా..?

ట్రెండింగ్‌

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions