Delhi Police: రామ్‌లీలా మైదానంలో సభలకు కొత్త రూల్స్.. ఢిల్లీ పోలీస్ షాకింగ్ నిర్ణయం!
- రామ్‌లీలా మైదానంలో సభలకు గరిష్ఠంగా 50 వేల మందికే అనుమతి..
- ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే..
- కార్యక్రమానికి 10 రోజుల ముందు పర్మిషన్ తీసుకోవాలి..
- ఢిల్లీ పోలీసుల ప్రతిపాదనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Police: ఢిల్లీలో రామ్‌లీలా మైదాన్‌లో సభలు నిర్వహించాలనుకునే వారికి ఢిల్లీ పోలీసులు షాక్ ఇచ్చారు. ఇకపై రామ్ లీలా మైదాన్‌లో నిర్వహిచే సభలు, నిరసన కార్యక్రమాలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు కొత్త మార్గదర్శకాలను ప్రతిపాదించారు. ఈ మూదానంలో జరిగే కార్యక్రమాలకు గరిష్టంగా 50 వేల మందిని మాత్రమే అనుమతించాలని ప్రతిపాదించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యే సభ నిర్వహించాలని ప్రతిపాధించారు. ఇదే సమయంలో భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, పారిశుద్ధ్యం వంటి అంశాలపై నిర్వాహకులే బాధ్యత వహించేలా ముసాయిదా కార్యాచరణ విధానాన్ని (SOP) రూపొందించారు. ఈ ముసాయిదా ఆమోదం కోసం ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయానికి పంపినట్లు ఢిల్లీ పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఇది ప్రాథమిక దశలోనే ఉందని, నిబంధలను ఇంకా ఖరారు కావాల్సి ఉందని తెలిపారు.
ప్రతిపాదనల్లో ఏముంది.?
రామ్‌లీలా మైదాన్‌లో కార్యక్రమం నిర్వహించాలనుకునే నిర్వాహకులు ముందుగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) నుంచి మైదానం అందుబాటులో ఉందనే అనుమతి పొందాలి. ఆ తర్వాతే పోలీసుల అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కార్యక్రమానికి 10 రోజలు ముందుగానే దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుందని ముసాయిదాలో పేర్కొన్నారు.
Also Read
- Sheikh Hasina Return: హామీ ఇస్తేనే హసీనాను పంపిస్తాం.. బంగ్లాదేశ్‌కు భారత్ షరతులు!
- Supriya Sule: ఎన్సీపీ విలీనంపై సస్పెన్స్‌కు తెర.. ఆ రోజు ఏం జరిగిందో చెప్పిన సుప్రియా సూలే!
- Best Business Idea: ఐటీ ఉద్యోగాలు వదిలి రూ. 56 లక్షల బిజినెస్.. ఐడియా అదిరిపోయిందిగా..
- Aadhaar Update: జస్ట్ 5 నిమిషాల పని.. ఇంట్లో కూర్చుని మీ మొబైల్లోనే ఆధార్ అప్డెట్ చేసుకోండిలా..
సభలు, నిరసన కార్యక్రమాలకు వచ్చే ప్రజల నిర్వహణ బాధ్యతలను నిర్వాహకులపైనే ఉంచేలా మార్గదర్శకాలు రూపొందించారు. ఇందులో ట్రాఫిక్ కోఆర్డినేషన్, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, సభకు వచ్చే ప్రజల్ని నిర్వహించడం వంటి బాధ్యతల్ని నిర్వాహకులే నిర్వహించాల్సి ఉంటుంది. రహదారులు, అత్యవసర సేవల వాహనాలు వెళ్లే మార్గాలకు అడ్డంకులు లేకుండా చూసుకోవాలి. తాగునీరు, వైద్య సహాయం, పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించడం, చెత్తను తొలగించే ఏర్పాట్లను కూడా నిర్వాహకులే చూసుకోవాలి.
ఇదే సమయంలో సభకు వచ్చే వారు తుపాకులు, కత్తులు, ఖడ్గాలు, ఈటెలు, పదునైన వస్తువులు, ఇతన నిషేధిత సామాగ్రిని తీసుకురాకుండా చర్యల్ని ప్రతిపాదించారు. రామ్ లీలా మైదాన పరిసర ప్రాంతాల్లో డ్రోన్లు ఎగురవేయాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి చేయాలని ముసాయిదాలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
AP Rain Alert: బంగాళాఖాతంలో మరో తుఫాన్ ముప్పు.. తీవ్ర తుఫాన్‌గా మారనున్న ‘అక్వాన్’..
-
Delhi Police: రామ్‌లీలా మైదానంలో సభలకు కొత్త రూల్స్.. ఢిల్లీ పోలీస్ షాకింగ్ నిర్ణయం!
-
Sheikh Hasina Return: హామీ ఇస్తేనే హసీనాను పంపిస్తాం.. బంగ్లాదేశ్‌కు భారత్ షరతులు!
-
AP Elections: పల్లె పోరుకు సిద్ధం.. రేపటి నుంచి నామినేషన్లు, 26న ఓట్ల లెక్కింపు..
-
Supriya Sule: ఎన్సీపీ విలీనంపై సస్పెన్స్‌కు తెర.. ఆ రోజు ఏం జరిగిందో చెప్పిన సుప్రియా సూలే!
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!