Off The Record: రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య చర్చ మొదలైందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య సయోధ్య కుదిరిందని అనుకుంటున్న తరుణంలో కొత్త చర్చ మొదలైందా? రాజ్‌భవన్ దర్బార్లపై పొలిటికల్ సర్కిళ్లలో చర్చ జరుగుతోందా? రాష్ట్ర సర్కార్ రియాక్షన్ ఏంటి?
Also Read
రాజ్‌భవన్ దర్బార్లపై మళ్లీ రాజకీయ చర్చ
తెలంగాణకు గవర్నర్‌గా వచ్చినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక కార్యక్రమంలో బిజీగా ఉంటున్నారు తమిళిసై. అందులో కొన్ని కార్యక్రమాలు రాష్ట్ర సర్కార్‌కు కంటగింపుగా మారడంతో రాజ్‌భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్ వచ్చింది. రెండు రాజ్యాంగ వ్యవస్థలు చర్చల్లో నలిగాయి. రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణ, బడ్జెట సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఏర్పాటు చేయడంతో రెండు వ్యవస్థల మధ్య వాతావరణం తేలికపడింది. రాజకీయ ఘర్షణకు ఫుల్స్టాప్ పడిందని రాజకీయ వర్గాలు భావించాయి. అయితే ఈ మార్పు మూణ్ణాళ్ల ముచ్చటేనా అని అధికారపార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. దీనికి రాజ్‌భవన్‌లో జరుగుతున్న దర్బార్లను వాళ్లు కారణంగా ప్రస్తావిస్తున్నారట.
కేంద్ర బడ్జెట్‌పై రాజ్‌భవన్‌లో చర్చా గోష్టిలు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై రాజ్‌భవన్‌లో చర్చాగోష్టిలు నిర్వహిస్తున్నారు గవర్నర్ తమిళిసై. ఈ సమావేశాలే చర్చగా మారుతున్నాయి. కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్ర సర్కార్ పెదవి విరిచింది. రాష్ట్రానికి మళ్లీ మొండి చెయ్యే ఇచ్చారనేది గులాబీ నేతల ఆగ్రహం. అయితే అదే కేంద్ర బడ్జెట్‌పై రాజ్‌భవన్‌లో నిర్వహిస్తున్న దర్బార్లే గులాబీ శిబిరంలో గుసగుసలకు వేదికయ్యాయి. కేంద్ర బడ్జెట్‌ను రాష్ట్ర సర్కార్ విమర్శిస్తే.. ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను అభినందించారు గవర్నర్. కేంద్ర చిట్టాపద్దును ఫ్యూచరిస్టిక్ బడ్జెట్‌గా ప్రశంసించారు కూడా. ఆ తర్వాత వరస సమావేశాలు పెడుతున్నారు తమిళిసై.
చర్చల్లో పాల్గొంటున్న నిపుణులు..!
కేంద్ర బడ్జెట్ 2023-24లో ఆరోగ్యరంగానికి కేటాయింపులు.. ఇచ్చిన ప్రాధాన్యాలపై గవర్నర్ అధ్యక్షతనే సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న వైద్య నిపుణులు పాల్గొన్నారు. హెల్త్‌కేర్‌కు భారీ కేటాయింపులు చేయడం వల్ల దేశంలో సుస్థిరమైన ఆరోగ్యం సంరక్షణ సాధ్యమనేది గవర్నర్ తమిళిసై అభిప్రాయం. విద్యా, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి ఇచ్చిన కేటాయింపులపైనా చర్చాగోష్టి నిర్వహించారు. రాజ్‌భవన్‌లో గతంలో ఈ విధమైన కార్యక్రమాలు జరగకపోవడంతో గులాబీ నేతలు అటెన్షన్లోకి వచ్చారు. రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య సామరస్య వాతావరణం నెలకొందని అనుకుంటున్న తరుణంలో తాజా దర్బార్లు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో అని సందేహిస్తున్నారట నేతలు. కేంద్ర బడ్జెట్‌ను కొనియాడుతూ నిర్వహించిన సమావేశాలపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు రియాక్ట్ అవుతారా లేక చూసీ చూడనట్టు వదిలేస్తారా అనేది ప్రశ్న.
తాజావార్తలు
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!