Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Bjp Ap Blames Chandrababu

Off The Record: అంతా చంద్రబాబే చేశారా?

Published Date :March 3, 2023 , 9:55 pm
By NTV WebDesk
Off The Record: అంతా చంద్రబాబే చేశారా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

పార్టీ నుంచి వెళ్లిపోతున్న వాళ్లంతా ఆయనవైపే వేలేత్తి చూపిస్తున్నారు. ఆయనే కారణమని దుమ్మెత్తి పోస్తున్నారు. ఆయన మాత్రం.. దీనికంతటికీ ఇంకో ఆయన కారణమని ఉత్తరాలు రాస్తున్నారట. నేరం నాది కాదు.. ఆయనదే.. తప్పు నాది కాదు.. కుట్ర అంతా ఆ ఆయనదే… అని చెబుతున్నారట. తప్పించుకోవడానికి చెప్పారా? తప్పు ఆయన మీద తోసేయడానికి చేస్తున్నారో ఏమో.. వ్యవహారం మాత్రం రంజుగా ఉంది.

చంద్రబాబే కారణమని వీర్రాజు తేల్చేశారా?
ఏపీ బీజేపీ నుంచి నాయకులు వెళ్లిపోతుంటే.. మౌనంగా ఉన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. కామ్‌గా ఢిల్లీ పెద్దలకు లేఖలు రాస్తున్నారట. ఆ లేఖల్లో వీర్రాజు ప్రస్తావిస్తున్న అంశాలే ప్రస్తుతం కాషాయ శిబిరంలో వేడి రాజేస్తున్నాయి. బీజేపీని వీడి నేతలు వెళ్లిపోవడానికి.. బీజేపీ ఇరకాటంలో పడటానికి టీడీపీ అధినేత చంద్రబాబే కారణమని తేల్చేశారట. లేఖలో చంద్రబాబు గురించి వీర్రాజు ప్రస్తావించారని తెలిసి బీజేపీ వర్గాల్లో హాట్ హాట్‌ చర్చ సాగుతోంది.

Also Read

  • Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
  • Off The Record: టీడీపీలోని పరిణామాలపై కొందరు సీనియర్స్ అసహనం..
  • Off The Record: మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి వింత కష్టం..!
  • Off The Record: అవనిగడ్డ కూటమిలో పరాకాష్టకు చేరిన ఆధిపత్య పోరు!

బీజేపీకి గుడ్‌బై చెప్పిన కన్నా లక్ష్మీనారాయణ.. ఇతర నేతలు.. వీర్రాజు వల్లే వెళ్లిపోతున్నట్టు ఓపెన్‌గానే చెప్పారు. ఎన్నడూ లేని విధంగా కొందరు నాయకులు ఏకంగా ఢిల్లీ వెళ్లి వీర్రాజుపై ఫిర్యాదు చేసి వస్తున్నారు. ఈ పరిణామలతో మొదటికే మోసం వస్తుందని అనుకున్నారో ఏమో.. వీర్రాజు పార్టీ పెద్దలకు లేఖ రాసినట్టు చర్చ జరుగుతోంది. అయితే ఆ లేఖలో చంద్రబాబును బూచిగా చూపించారనే ప్రచారం నడుస్తోంది. ఏపీలో బీజేపీ ఎదగకపోవడానికి.. కన్నా వంటి లీడర్స్‌ బీజేపీని వీడి వెళ్లిపోవడానికి.. ఇలా అన్నింటికీ చంద్రబాబే కారణమని వీర్రాజు ఆ లేఖలో తేల్చేశారట. చంద్రబాబు జోక్యంతో తమ ప్లాన్‌ అంతా చెడిపోతున్నట్టు లేఖలో ఆవేదన వ్యక్తం చేశారట వీర్రాజు.

కన్నా వెళ్లిపోవడానికి బాబే కారణమని వీర్రాజు చెప్పారా?
బీజేపీ కూటమిని వీడి చంద్రబాబు వెళ్లిన తర్వాత ఆయనపై ఢిల్లీ పార్టీ పెద్దలు గుర్రుగా ఉన్నారు. చంద్రబాబుకు డోర్స్‌కు క్లోజ్‌ అయినట్టు పలుమార్లు చెప్పారు. ఎలాగూ చంద్రబాబుపై ఢిల్లీ బీజేపీ పెద్దలు ఓ ఓపీనియన్‌తో ఉన్నారని అనుకున్నారో ఏమో.. ఏపీ బీజేపీలో జరుగుతున్న పరిణామాలకు కూడా టీడీపీ అధినేతే కారణమని వీర్రాజు చెప్పినట్టు సమాచారం. ఈ ఎత్తుగడ వీర్రాజుకు పార్టీలో ఏ మేరకు మైలేజ్‌ తీసుకొస్తుందో ఏమో.. చంద్రబాబును మరోసారి ఈ విధంగా టార్గెట్ చేయడం కాషాయ శిబిరంలో ఆసక్తి కలిగిస్తోంది. కన్నా వంటి నేతలు బీజేపీని వీడి వెళ్లడానికి కూడా బాబే కారణమని వీర్రాజు ముక్తాయించడంతో విస్మయం వ్యక్తం చేస్తున్నారట పార్టీ నాయకులు.

బీజేపీ ఏపీలో ఎదగకుండా బాబు కుట్ర చేస్తున్నారని వీర్రాజు ఆరోపణ?
బీజేపీని వీడి వెళ్లే నేతలు.. ఏదో ఒక కారణం చూపించాలి కాబట్టి.. బట్ట కాల్చి తనపై వేస్తున్నారనేది వీర్రాజు వాదనగా ఉందట. ఇది కూడా చంద్రబాబు వ్యూహంలో భాగమేనని ఆయన అభిప్రాయమట. ఏపీలో బీజేపీ ఎదిగితే టీడీపీ కష్టమని.. అందుకే ఆ ఛాన్స్‌ ఇవ్వకుండా బీజేపీపై చంద్రబాబు కుట్ర చేస్తున్నారని అధిష్ఠానానికి వీర్రాజు చెప్పారట. కన్నా తరహాలో బీజేపీని వీడి టీడీపీలో వెళ్లే ఆలోచనలో మరికొందరు ఉన్నారంటూ.. వారి పేర్లను ఆ లేఖలో ప్రస్తావించారట వీర్రాజు.

బాబును బూచిగా చూపించి ఉంటే ఢిల్లీ పెద్దల స్పందనేంటి?
ఆ లేఖ నిజంగా వీర్రాజు రాశారో లేదో తెలియదు. ఒకవేళ వీర్రాజే లేఖ రాసి వుంటే.. తన తప్పు లేదని చెప్పుకోవడానికి ఎప్పటిలా చంద్రబాబును వాడేసుకున్నారా అనేది మరికొందరి డౌట్‌. వాస్తవానికి ఏపీ బీజేపీలో ఏం జరుగుతుందో ఢిల్లీలోని పార్టీ పెద్దలకు తెలియంది కాదు. వాళ్లకు ఎక్కడి నుంచి సమాచారం అందాలో అక్కడి నుంచి అందుతోంది. ఇప్పుడు వీర్రాజు రాసినట్టుగా చెబుతున్న లేఖపై వాళ్లెలా స్పందిస్తారు? వీర్రాజు మాటలను విశ్వసిస్తారా? లేక తమ దగ్గర ఉన్న నివేదికను వీర్రాజు ముందు పెట్టి నిలదీస్తారా? ప్రస్తుతం జాతీయ రాజకీయాలు.. కొన్ని రాష్ట్రాల్లో జరగబోతున్న ఎన్నికలపై బిజీగా ఉన్న బీజేపీ కేంద్ర నాయకత్వం ఏపీలోని పార్టీ పరిస్థితిపై ఇంకా పూర్తిగా ఫోకస్‌ పెట్టినట్టు లేదు. ఆ సందర్భం.. సమయం చిక్కగానే ఢిల్లీ పెద్దలు ఎలా స్పందిస్తారో.. ఏం చేస్తారో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • bjp
  • chandrababu
  • off the record

తాజావార్తలు

  • Atlee : వాట్ ఎబౌట్ అట్లీ.. మళ్లీ సౌత్ హీరో వెంటపడతాడా..? బాలీవుడ్ హీరోని ఫిక్స్ చేశాడా…?

  • Hardik Pandya: “మా పతనానికి కారణం ఇదే”.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎమోషనల్

  • Sachin Tendulkar Birthday: గిరిజన పిల్లలతో కలిసి పుట్టినరోజు కేక్ కట్ చేసిన ‘క్రికెట్ గాడ్’.!

  • IRS Officer Daughter Murder: నిందితుడి తీరుపై కోర్టుకు పోలీసులు షాకింగ్ రిపోర్ట్.. ఏముందంటే..!

  • NBK111 : బాలయ్య – గోపించంద్ మలినేని – తమన్ ఈసారి సౌండ్ అదిరిపోద్ది!

ట్రెండింగ్‌

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions