Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Bandi Sanjay Silent Politcs

Off The Record: సంజయ్ సైలెంట్ గా వెళుతున్నారా?

Published Date :May 3, 2023 , 9:52 pm
By NTV WebDesk
Off The Record: సంజయ్ సైలెంట్ గా వెళుతున్నారా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణలో ఆ సీనియర్‌ నేత కుమారుడు తన మౌనంతో ప్రత్యర్థులను టెన్షన్‌ పెడుతున్నారా? దాని వెనక నిజంగానే ఏదైనా భారీ ప్లాన్‌ ఉందా? లేక ప్రత్యర్థుల్లో ఆందోళన రేపడానికి ఉత్తుత్తి గాంభీర్యం ప్రదర్శిస్తున్నారా? జిల్లాకు చెందిన ముఖ్య నేతలే మేం నిన్ను గుర్తించడం లేదు ఫో.. అంటుంటే…ఆయన పార్టీని అంటిపెట్టుకుని ఉండి ఏం చేయబోతున్నారు? లెట్స్‌ వాచ్‌.

సంజయ్‌ సైలెంట్‌గా తెరవెనక మంత్రాంగం నడుపుతున్నారా?
నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్…. కొద్ది రోజుల క్రితం ఘర్ వాపసీలో భాగంగా.. తన తండ్రి డీఎస్‌తో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. ఆయన్ని పార్టీలోకి తిరిగి రానీయకుండా జిల్లా నేతలు చాలా కాలం అడ్డుకున్నా..చివరికి ఆపలేకపోయారట. కుమారుడితో పాటే కాంగ్రెస్ కండువా కప్పుకున్న డీఎస్.. ఆ తర్వాత మాట మార్చడంతో అసలా చేరికే గందరగోళంలో పడింది.దీంతో కొన్నాళ్ళు మౌనంగా ఉన్నారు సంజయ్‌. పార్టీ కార్యక్రమాలకు హాజరవడం లేదు. ఆయన చేరికను తాము గుర్తించడం లేదన్నట్లు జిల్లా నేతలు సైతం పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానం పంపడం లేదట. దీంతో సంజయ్.. తన ఇంటినే పార్టీ లోకల్‌ ఆఫీస్‌గా చేసుకుని.. చేరికలను ప్రోత్సహిస్తున్నారట. అయితే.. తమ అనుమతి లేకుండా జరిగే ఆ చేరికలు కూడా చెల్లవంటూ క్లారిటీ ఇచ్చేశారు నిజామాబాద్‌ అర్బన్ కాంగ్రెస్‌ నేతలు. ఎవరు ఏం అనుకున్నా.. నా దారి నాదేనంటూ తెర వెనుక మంత్రాంగం నడుపుతున్నారట సంజయ్‌. అర్బన్ కాంగ్రెస్ లో యాక్టివ్ రోల్ పోషించేందుకు సమయం కోసం వేచి చూస్తున్నారట.

నిజామాబాద్‌ అర్బన్ కాంగ్రెస్‌ టిక్కెట్‌ కోసం నలుగురు పోటీ
నిజామాబాద్‌ అర్బన్ సీటు పై కన్నేసిన సంజయ్.. ఆ వ్యూహంలో భాగంగానే హస్తం గూటికి చేరి చాప కింద నీరులా తన పని తాను చేసుకుపోతున్నారన్నది లోకల్‌ టాక్‌. ఈ పాటికే అర్బన్ సీటు పై కన్నేసిన .. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌ కుమార్ గౌడ్ అర్బన్ నా అడ్డా అంటున్నారట. ఈ సీటును వదులుకునే ప్రసక్తేలేదని తన అనుచరుల దగ్గర చెబుతున్నారట. గత ఎన్నికల్లో అర్బన్ నుంచి పోటీ చేసి రెండో స్థానంలో ఉన్న సీనియర్ నేత తాహేర్ బిన్ హందాన్, అర్బన్ పార్టీ అధ్యక్షుడు కేశ వేణు సైతం ఒక్క ఛాన్స్ అంటున్నారట. అందుకే అంతా కలిసి సంజయ్‌కి పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానం పంపకుండా , జిల్లా పార్టీ కార్యాలయంలో అడుగు పెట్టకుండా జాగ్రత్త పడుతున్నారట. మాజీ మేయర్‌ సైతం దూకుడుగా వ్యవహరించకుండా అవకాశం కోసం ఎదురుచూస్తూ.. అండర్ గ్రౌండ్ లో తన పని తాను చేసుకుంటూ పోతున్నారట. అయితే ఆ మౌనం వెనక ఉన్న వాస్తవాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నంలో ఉంది రాజకీయ ప్రత్యర్థి వర్గం. ఇలా నిజామాబాద్‌ అర్బన్ టికెట్ కోసం నాలుగు స్తంభాలాట నడుస్తుండగా… రేసులో ఎవరు ముందుంటారో తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bjp Vs BRS
  • congress
  • off the record
  • Sanjay
  • telangana

తాజావార్తలు

  • Prabhsimran Singh: టెన్షన్ వద్దు, స్వేచ్ఛగా ఆడమన్నాడు.. నా సక్సెస్‌కు కారణం అతడే!

  • Fire Accidnet: ప్రభాస్ సినిమా ‘స్పిరిట్’ సెట్‌లో అగ్ని ప్రమాదం..

  • Indian Growth: భారత వృద్ధి రేటును తగ్గించిన ప్రపంచ బ్యాంక్.. ప్రస్తుతం ఎంతంటే..

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • Nitish Kumar: రాజ్యసభ సభ్యుడిగా రేపే నితీష్ ప్రమాణ స్వీకారం.. బీహార్ కొత్త సీఎం ఎవరంటే!

ట్రెండింగ్‌

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • Ragi Pakodi Recipe: సాయంత్రం స్నాక్స్‌లో హెల్తీ ట్రిట్.. కరకరలాడే ‘రాగి పకోడి’

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions