Off The Record: అక్కడ ఫ్యాన్ రిపేర్ వర్క్స్ సరిగా జరగడం లేదా..? ఓడిపోయినా గ్రూపుల గోల తగ్గలేదా?
- వైసీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్‌గా కన్నబాబు..
- కొత్త హోదాలో ఫస్ట్‌టైం శ్రీకాకుళం జిల్లా మీటింగ్..
- కన్నబాబు మీటింగ్‌కు ధర్మాన, తమ్మినేని డుమ్మా..
- సీనియర్స్ ఇద్దరూ జూనియర్ ఇన్ఛార్జ్‌ని లైట్ తీసుకున్నారా?..
- నేరుగా సీనియర్స్ ఇళ్ళకు వెళ్ళి కలిసిన కన్నబాబు..
- సమన్వయ లోపంతోనే ఎన్నికల్లో దెబ్బతిన్నామన్న ఫీలింగ్..
- కన్నబాబుకు కత్తిమీద సామేనన్న అభిప్రాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వైసీపీలో సీనియర్స్‌కి కొదవేం లేదు. అదే… ఎక్కడికక్కడ ఆధిపత్య పోరుకు బీజం వేసిందన్నది పార్టీ నేతల మాట. వీరిని కట్టడం చేసేందుకు గతంలో ఇన్ఛార్జ్‌లుగా ఉన్న విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి వంటి నేతలు ప్రయత్నించేవారు. అభిప్రాయ తమ అనుభవాన్ని, పొలిటికల్ సీనియారిటీని ఉపయోగించి వేదికల మీద జరిగే గొడవల్ని నాలుగు గోడల మధ్యకు తీసుకురాగలిగేవారు. ఇక ఇటీవల పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ గా మాజీ మంత్రి కురసాల కన్నబాబు నియమితులయ్యారు. ఆ హోదాలో తాజాగా ఫస్ట్‌టైం జిల్లాకు వచ్చారాయన. నియోజకవర్గ ఇన్ఛార్జ్‌లు, స్థానికనేతల సమావేశం నిర్వహించారు. పార్టీ అధినాయకత్వం ఆదేశాలు, వ్యూహాల గురించి చెప్పారు. కానీ, శ్రీకాకుళం జిల్లా పార్టీ సీనియర్ లీడర్స్ ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం మాత్రం ఈ మీటింగ్‌కు అటెండ్ కాలేదు. ఇదే ఇప్పుడు పెద్ద చర్చకు కారణం అవుతోంది.
సీనియర్ లీడర్స్ ఇద్దరూ జూనియర్ ఇన్ఛార్జ్‌ని లైట్ తీసుకున్నారా? అతను పెట్టే మీటింగ్‌కు మనం వెళ్ళేదేందిలేనని అనుకున్నారా? అంటూ ఆరాలు తీస్తున్నాయి రాజకీయ వర్గాలు. అదే సమయంలో వాళ్ళు రాకున్నాసరే… కన్నబాబే నేరుగా సదరు లీడర్స్ ఇళ్ళకు వెళ్ళి మర్యాద పూర్వకంగా కలిశారు. కన్నబాబు వైఖరిని ప్రశంసిస్తున్న జిల్లా పార్టీ నాయకులు… ఇద్దరు సీనియర్‌నాయకుల్ని మాత్రం తప్పుపడుతున్నారట. రాకపోవడానికి వేరే కారణాలు ఉంటే ఉండవచ్చుగానీ… రీజినల్ ఇన్ఛార్జ్ హోదాలో ఫస్ట్‌టైం వచ్చినప్పుడు మీటింగ్‌లో పాల్గొనడం కనీస మర్యాద కదా అని అంటున్నారట. వైసిపి నేతలు , కార్యకర్తల మధ్య సమన్వయ లోపం కారణంగా గత ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది పార్టీ. సిక్కోలు జిల్లాలో ఒక్క ఎమ్మల్యే సీటు కూడా గెలవలేదు . దాదాపు అన్ని నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు , ఎవరికి వారే అన్న తీరుగా ఉండటమే అందుకు ప్రధాన కారణం అంటున్నారు.
Also Read
- Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
- Off The Record : మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయంగా ఎందుకు యాక్టివ్ అవ్వలేదు ?
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
అప్పట్లో విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి వంటి సీనియర్ నేతలు జిల్లా గ్రూపు రాజకీయాల్ని సరిచేయలేక తల్లకిందులయ్యేవారట. మీతో… మావల్ల కాదని చేతులెత్తేసిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయన్నది వైసీపీ వర్గాల మాట. ఇలాంటి జిల్లాల సమన్వయం సాధించడమన్నది ఇప్పుడు కన్నబాబుకు కత్తిమీద సామేనంటున్నారు పరిశీలకులు. ఇచ్ఛాపురం, టెక్కలి , ఆమదాలవలస, రాజాం, ఎచ్చెర్ల , నరసన్నపేట , పాతపట్నం వంటి నియోజకవర్గాల్లో గ్రూప్స్ మధ్య సయోధ్య కుదిరించడం అంత ఈజీ కాదన్న అభిప్రాయం ఉంది పొలిటికల్ సర్కిల్స్‌లో. ఈ విషయంలో మాత్రం ఆయన సక్సెస్ అవగలిగితే…. పార్టీ అధిష్టానానికి నమ్మకం కలగడమేగాక… తనను తాను నిరూపించుకున్నవాడవుతారని, టాస్క్ మాత్రం అంత తేలికైంది కాదన్న అభిప్రాయం బలంగా ఉంది. మొదట్లోనే ఇద్దరు సీనియర్స్ ఝలక్ ఇచ్చినా… నేరుగా వాళ్ళ ఇళ్ళకే వెళ్ళి మార్కులు కొట్టేశారని, ఇక సిక్కోలు ఫ్యా గ్రూప్స్‌ని కన్నబాబు ఎలా మేనేజ్ చేస్తారో చూడాలంటున్నారు పరిశీలకులు.
తాజావార్తలు
-
Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
-
Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
-
Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
-
IPL Tickets Block: 39 వేల టికెట్లు.. నిమిషాల్లో మాయం.! ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ వెనుక పెద్ద దందా.?
-
Fire Accident : NH-44 పై భారీ ప్రమాదం.. 8 కొత్త కార్లు పూర్తిగా దగ్ధం..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!