NTV Telugu Site icon

Off The Record: దువ్వాడ గట్టిగా ఇరుక్కుంటున్నారా..? పోసాని తర్వాతే ఆయనేనా..?

Duvvada

Duvvada

Off The Record: ఇంట్లో రచ్చ… బయటా రచ్చే…. ముందూ వెనకా చూసుకోకుండా మాట విసిరేయటం, తర్వాత గొడవ కొని తెచ్చుకోవడం…. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ గురించి శ్రీకాకుళం పొలిటికల్‌ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ ఇది. తన దూకుడుతో పొలిటికల్‌ మైలేజీ సొంతం చేసుకున్న దువ్వాడ నోటికి సెక్షన్‌తోనే చెక్‌ పెట్టే ప్రయత్నం జరుగుతోందన్న మాటలు వినిపిస్తున్నాయి స్థానికంగా. సినీ నటుడు పోసాని తరువాత వంతు ఎమ్మెల్సీ దువ్వాడేనా అని గుసగుసలాడుకుంటున్నారట స్థానికంగా. కొంత కాలంగా కుటుంబ వ్యవహారాలతో వైరల్ అవుతున్న దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు మాధురి సోషల్‌ మీడియాలో చెలరేగిపోతున్నారన్న అభిప్రాయం ఉంది. ఈ క్రమంలో తాజా అసెంబ్లీ సమావేశాలలో పాల్గొంటున్న దువ్వాడ తాను పెద్దల సభ సభ్యుడినన్న స్థాయి మర్చిపోయి డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ పై నిరాధార ఆరోపణలు చేసారన్నది జనసైనికుల వాదన. గతంలో చెప్పుతో కొడతా అంటూ దువ్వాడ మాట్లాడటం, దానికి సంబంధించి ఫిర్యాదు చేయడం లాంటివి ఒకవైపు నడుస్తుండగానే…

తాజాగా పవన్‌ కల్యాణ్‌ మీద వ్యాఖ్యలతో మరోసారి వివాదం క్రియేట్‌ చేశారాయన. అసలు పవన్ కళ్యాణ్ మీదికి ఒంటికాలిపై లేస్తుంటారు దువ్వాడ. దానికి జనసేన కూడా ఘాటుగానే రియాక్ట్‌ అవుతూ ఉంటుంది. ఇక తాజాగా… చంద్రబాబును ప్రశ్నించకుండా ఉండేందుకు పవన్‌ 50 కోట్లు తీసుకున్నారన్న ఆరోపణ దువ్వాడను ఇరకాటంలో పెట్టబోతోందన్న చర్చ నడుస్తోంది. దానికి సంబంధించి ఎమ్మెల్సీ మీద చర్యలు తీసుకోవాలంటూ…. రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు చేస్తున్నారు జనసైనికులు. డిప్యూటీ సీఎం మీద నిరాధార ఆరోపణలు చేసిన ఎమ్మెల్సీ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ… పలు పోలీస్ స్టేషన్లలో కేసులు బుక్‌ అవుతున్నాయి. దువ్వాడపై ఇప్పటికే….గుడివాడ, మచిలీపట్నం, పామర్రు, పెడన, తిరువూరు, కొవ్వూరు , అమలాపురం , అవనిగడ్డ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారట జనసేన నేతలు. మరోవైపు దువ్వాడకు వ్యతిరేకంగా జనసేన శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దీంతో…. ఇప్పుడు దువ్వాడ నోటి దురదే ఆయనకు శాపంగా మారబోతోందని అంచనా వేస్తున్నారు పొలిటికల్‌ పరిశీలకులు. అందుకే పోసాని తర్వాత దువ్వాడ శ్రీనివాసేనా అన్న చర్చ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెన్ని ప్రాంతాల్లో కేసులు బుక్‌ అవుతాయో చూడాలి.