Off The Record: దువ్వాడ గట్టిగా ఇరుక్కుంటున్నారా..? పోసాని తర్వాతే ఆయనేనా..?
- వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ గట్టిగా ఇరుక్కుంటున్నారా?..
- పోసాని తర్వాత దువ్వాడేనన్నది నిజమేనా?..
- డిప్యూటీ సీఎం పవన్ మీద తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు..
- గతంలో చెప్పుతో కొడతానంటూ వివాదం..
- దువ్వాడ మీద రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికుల ఫిర్యాదులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఇంట్లో రచ్చ… బయటా రచ్చే…. ముందూ వెనకా చూసుకోకుండా మాట విసిరేయటం, తర్వాత గొడవ కొని తెచ్చుకోవడం…. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గురించి శ్రీకాకుళం పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ ఇది. తన దూకుడుతో పొలిటికల్ మైలేజీ సొంతం చేసుకున్న దువ్వాడ నోటికి సెక్షన్‌తోనే చెక్ పెట్టే ప్రయత్నం జరుగుతోందన్న మాటలు వినిపిస్తున్నాయి స్థానికంగా. సినీ నటుడు పోసాని తరువాత వంతు ఎమ్మెల్సీ దువ్వాడేనా అని గుసగుసలాడుకుంటున్నారట స్థానికంగా. కొంత కాలంగా కుటుంబ వ్యవహారాలతో వైరల్ అవుతున్న దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు మాధురి సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారన్న అభిప్రాయం ఉంది. ఈ క్రమంలో తాజా అసెంబ్లీ సమావేశాలలో పాల్గొంటున్న దువ్వాడ తాను పెద్దల సభ సభ్యుడినన్న స్థాయి మర్చిపోయి డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ పై నిరాధార ఆరోపణలు చేసారన్నది జనసైనికుల వాదన. గతంలో చెప్పుతో కొడతా అంటూ దువ్వాడ మాట్లాడటం, దానికి సంబంధించి ఫిర్యాదు చేయడం లాంటివి ఒకవైపు నడుస్తుండగానే…
తాజాగా పవన్ కల్యాణ్ మీద వ్యాఖ్యలతో మరోసారి వివాదం క్రియేట్ చేశారాయన. అసలు పవన్ కళ్యాణ్ మీదికి ఒంటికాలిపై లేస్తుంటారు దువ్వాడ. దానికి జనసేన కూడా ఘాటుగానే రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఇక తాజాగా… చంద్రబాబును ప్రశ్నించకుండా ఉండేందుకు పవన్ 50 కోట్లు తీసుకున్నారన్న ఆరోపణ దువ్వాడను ఇరకాటంలో పెట్టబోతోందన్న చర్చ నడుస్తోంది. దానికి సంబంధించి ఎమ్మెల్సీ మీద చర్యలు తీసుకోవాలంటూ…. రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు చేస్తున్నారు జనసైనికులు. డిప్యూటీ సీఎం మీద నిరాధార ఆరోపణలు చేసిన ఎమ్మెల్సీ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ… పలు పోలీస్ స్టేషన్లలో కేసులు బుక్ అవుతున్నాయి. దువ్వాడపై ఇప్పటికే….గుడివాడ, మచిలీపట్నం, పామర్రు, పెడన, తిరువూరు, కొవ్వూరు , అమలాపురం , అవనిగడ్డ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారట జనసేన నేతలు. మరోవైపు దువ్వాడకు వ్యతిరేకంగా జనసేన శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దీంతో…. ఇప్పుడు దువ్వాడ నోటి దురదే ఆయనకు శాపంగా మారబోతోందని అంచనా వేస్తున్నారు పొలిటికల్ పరిశీలకులు. అందుకే పోసాని తర్వాత దువ్వాడ శ్రీనివాసేనా అన్న చర్చ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెన్ని ప్రాంతాల్లో కేసులు బుక్ అవుతాయో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ – మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత
-
OTR : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆ ఎమ్మెల్యే పరిస్థితి?
-
IND Vs AFG: రోహిత్ ‘చారిత్రాత్మక’ రికార్డు.. గిల్ ‘మెరుపు’ ఇన్నింగ్స్.. అఫ్గాన్‌పై భారత్ ఘనవిజయం..
-
Chiranjeevi : కొడుకు నటనపై చిరంజీవి ఎమోషనల్! “‘పుత్రోత్సాహం’ అంటే ఇప్పుడే తెలిసింది..
-
Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్‌మన్ గిల్ అరుదైన మైలురాయి..
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!