Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Telangana Congress Party Vs Marri Shashidhar Reddy

Off The Record: రాహుల్‌ను, పార్టీని ఏకిపారేసినా మర్రి.. సీనియర్లు సైలెంట్‌..!

Published Date :November 24, 2022 , 9:27 am
By Sudhakar Ravula
Off The Record: రాహుల్‌ను, పార్టీని ఏకిపారేసినా మర్రి.. సీనియర్లు సైలెంట్‌..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

తనదాకా వస్తే తెలియదన్నట్టుంది కాంగ్రెస్ నేతల పరిస్థితి. ఎఐసీసీ నాయకత్వాన్ని తిట్టినా పట్టించుకునే తీరిక.. ఆలోచన లేదు. ఎవరికి వారు నాకెందుకులే అని వదిలేస్తున్నారట. తిట్టింది నన్ను కాదు కదా అనే భావన మరికొందరిది. తిట్టేవాళ్లు తిట్టని.. పడేవాళ్లు పడని అనుకుంటున్నారో ఏమో.. చివరకు రాహుల్‌గాంధీ మొదలుకొని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వరకు అందరినీ దూషించినా ఒక్కరిలోనూ చలనం లేదు. కాంగ్రెస్‌కు లాయలిస్ట్‌గా కొనసాగిన మర్రి శశిధర్‌రెడ్డి పార్టీ నుంచి వెళ్తూ వెళ్తూ రాహుల్‌గాంధీని, కెసి వేణుగోపాల్‌ను.. పీసీసీ మాజీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని.. పీసీసీ చీఫ్‌ రేవంత్‌ను ఓ రేంజ్‌లో కడిగిపారేశారు. కాంగ్రెస్ నుంచి అదే తరహాలో మర్రిపై కౌంటర్ అటాక్ ఉంటుందని భావించారు. కానీ కాంగ్రెస్ నేతలు పిన్‌డ్రాప్‌ సైలెన్స్‌ పాటిస్తున్నారు. అదే పార్టీ వర్గాలకు అంతుచిక్కడం లేదట.

Read Also: Off The Record: గద్వాల టీఆర్ఎస్‌లో కొత్త రగడ..

తెలంగాణలో కాంగ్రెస్‌ని ప్రజలు నమ్మబోరని బాహటంగానే చెప్పారు మర్రి. ఉత్తమ్‌ హయం నుంచి కాంగ్రెస్ దెబ్బతిందన్నారు. రేవంత్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తారని ఆరోపించారు. అయితే ఉత్తమ్‌ను తిట్టారు కదా అని రేవంత్‌ వర్గం.. రేవంత్‌ను దూషించారు కదా అని ఉత్తమ్‌ వర్గం.. ఎవరికి వారు సర్ది చెప్పుకొంటున్నారట. రాష్ట్ర నాయకుల సంగతి ఎలా ఉన్నా.. మర్రి ఏకంగా AICC నాయకత్వాన్ని, రాహుల్‌ గాంధీని విమర్శిస్తే ఎందుకు రియాక్ట్‌ కాలేదన్నదే ప్రశ్న. కాంగ్రెస్‌లో కీలక పదవుల్లో ఉన్న వారు సైతం మౌనమే. చివరకు రేవంత్‌, ఉత్తమ్‌లు సైతం పెదవి విప్పలేదు. మర్రి శశిధర్‌రెడ్డి కాంగ్రెస్‌ నుంచి వెళ్లిపోయారు కదా.. ఆయన విమర్శలపై స్పందించడం ఎందుకు అనుకున్నారో ఏమో.. మిగతా నాయకులు అదే ఫాలో అయినట్టు ఉన్నారు.

టీ పీసీసీకి చెప్పుకోవడానికి నలుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్లు.. 13 మంది అధికార ప్రతినిధులు.. డజన్లు కొద్దీ సీనియర్లు ఉన్నారు. వాళ్లంతా కోల్డ్‌స్టోరేజీలోకి వెళ్లిపోయారనే కామెంట్స్‌ గాంధీభవన్‌ వర్గాల్లోనే ఉంది. వాస్తవానికి కాంగ్రెస్‌ నాయకులకు పార్టీ అజెండా కంటే.. సొంత అజెండాలే ఎక్కువ. ఉన్నది పది మంది కీలక నాయకులైతే.. అందులోనూ ఐదు గ్రూపులుగా టీ కాంగ్రెస్‌ చీలిపోయింది. అదీ కూడా ఒక కారణమై ఉంటుందని వాదన. కీలక నాయకులు సైతం స్పందించకపోవడం వెనుక ఆంతర్యం ఏంటో శ్రేణులకు అంతుచిక్కడం లేదట. రాహుల్‌ను తిట్టినా స్పందించ లేనంత మొద్దుబారి పోయారని సొంత నాయకులపైనే కేడర్‌ సెటైర్లు వేసుకునే పరిస్థితి నెలకొంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Congress Party
  • Marri Shashidhar Reddy
  • off the record
  • rahul gandhi
  • revanth reddy

తాజావార్తలు

  • OnePlus Nord 6: మిడ్-రేంజ్ లో కింగ్.. వన్‌ప్లస్ నార్డ్ 6 విడుదల.. 9000 mAh బ్యాటరీ

  • Botsa Satyanarayana: గవర్నర్‌కు బొత్స లేఖ.. ఆర్ధిక వ్యవహారాలపై ప్రభుత్వం తప్పుడు సమాచారం..

  • అనిరుధ్ చేసిన ఆ సాయం వల్లే నేడు ఈ స్థాయిలో ఉన్నా.. విఘ్నేష్ శివన్ ఎమోషనల్ కామెంట్స్!

  • Smriti Mandhana and Palash Muchhal Reunite: మళ్లీ కలిసిన స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ వీడియో వైరల్‌.. పెళ్లి చేసుకోబోతున్నారా..?

  • Redmi K90 Max: 8,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్.. కూలింగ్ ఫ్యాన్‌తో రెడ్‌మి 5G ఫోన్

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions