Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
- తెలంగాణ బీజేపీ నేతల్ని ఒక్క తాటి మీదికి తెచ్చే ప్రయత్నాలు..
- ప్రతి ప్రోగ్రామ్‌లో అంతా ఇన్వాల్వ్ అయ్యేలా చర్యలు..
- సొంత ఇమేజ్ కోసం కాకుండా పార్టీకి పనిచేయాలని ఆదేశాలు..
- వ్యక్తికి క్రెడిట్ కాకుండా పార్టీకే ఉండాలన్న సూచనలు..
- కార్యక్రమాల్లో పాల్గొనని వారిని జవాబుదారీ చేసే యోచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణ కమలం పార్టీలో భారీ మార్పు కోసం ఆ పార్టీ పెద్దలు ప్లాన్ చేస్తున్నారు. ఇన్నాళ్ళు ఎడమొహం పెడమొహంగా ఉంటూ పార్టీ ప్రయోజనాలను దెబ్బ తీస్తున్న వాళ్లందర్నీ సెట్ చేసి ఒక్క తాటి పైకి తెచ్చే ప్రయత్నం జరుగుతోందట. ఆ క్రమంలోనే… ఏ ముఖ్య కార్యక్రమం చేసినా… అందరూ ఇన్వాల్వ్ అయ్యేలా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమం నాది అనే భావన అందరిలో కలిగేలా పెద్దలు జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. సొంత ఇమేజ్ కోసం కాకుండా పార్టీ యాంగిల్లోనే, లైన్లోనే పని చేయాలంటూ రాష్ట్ర నాయకులకు ఢిల్లీ పెద్దలు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారట. ఎవరికి వారుగా కాకుండా… నేతలందరినీ కలుపుకుని వెళ్ళేలా ప్లానింగ్ ఉండాలని క్లారిటీ ఇచ్చేసినట్టు చెప్పుకుంటున్నారు.
బీజేఎల్పీ నేత ఆధ్వర్యంలో జరిగిన రైతు ఘోష- బీజేపీ భరోసా యాత్రలో నేతలందరూ పాల్గొనడం అందులో భాగమేనని అంటున్నారు. మూడు రోజులకు పైగా జరిగిన యాత్రలో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన సింగరేణి భరోసా యాత్రలోనూ ముఖ్యనేతలు పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షుడు, బీజేఎల్పీ నేత రెండు రోజులు ఆయనతోనే ఉన్నారు. వ్యక్తికి క్రెడిట్ కాకుండా పార్టీకి రావాలని, పార్టీ జెండా కిందనే పని చేస్తున్నామనే భావన రావాలన్న ఉద్దేశ్యంతోనే ఈ విధంగా చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో వీళ్ళందరినీ కలిపి ఒక బస్సు యాత్ర చేయాలని అనుకున్నా… అది కార్యరూపం దాల్చలేదని… ఇక్కడి నేతలకు ఎంత చెప్పినా పట్టించుకోలేదని … ఇప్పుడు మార్పు కనిపిస్తోందని రాష్ట్ర వ్యవహారాలను నిశితంగా పరిశీలిస్తున్న నాయకుడు ఒకరు కామెంట్ చేశారు.
Also Read
గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా బండి సంజయ్ ఒక్కరే ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించారని, చాలా మంది పెద్ద నేతలు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారనే ప్రచారం జరిగింది… ఇక ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదు… అందరూ కలిసి వెళ్తున్నారన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. ప్రోగ్రామ్‌లో ఎవరైతే పాల్గొనరో వాళ్ళనే జవాబుదారీ చేసే పని మొదలైంది. సీనియర్ కేంద్ర మంత్రులు వచ్చినా… రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలు వాళ్ళ వెంట ఉంటున్నారు. గతంలో పరిస్థితి అలా ఉండేది కాదని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఇక ఎవరికి వారు సొంత అజెండాలు పక్కనబెట్టి పార్టీ బాటలోనే నడవాలనేది తెలంగాణ బీజేపీలో గట్టిగా వినిపిస్తున్న వాయిస్.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!