Off The Record: సిక్కోలు జనసేనలో అసంతృప్తి పెరుగుతుందా..?
- సిక్కోలు జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి..
- పార్టీ, ప్రభుత్వ పోస్టుల్లో ప్రాధాన్యం లేదని అసహనం..
- పదవులన్నీ కాపులకే ఇస్తున్నారన్న విమర్శలు..
- జిల్లాలో కాళింగ, వెలమల ప్రధాన పాత్ర..
- జనసేనకు అండగా యాదవులు, మత్స్యకారులు..
- కాపులకు ఛైర్మన్స్, మిగతా వాళ్ళకు డైరెక్టర్ పదవులు?..
- జిల్లా పార్టీలోనూ సేమ్ డామినేషన్..
- ఫ్రస్ట్రేషన్‌లో మిగతా సామాజికవర్గాల జనసైనికులు ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: శ్రీకాకుళం జిల్లా జనసేనలో అసంతృప్తి చాపకింద నీరులా విస్తరిస్తోందట. పార్టీ ఆవిర్భావం నుంచి నిబద్ధతతో పనిచేస్తున్నా ఫలితం లేకుండా పోతోందని కీలక నేతలు ఆవేదన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తమకు పార్టీ, ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని భావించిన నేతలు ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాలతో అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటు పార్టీలోనూ అటు ప్రభుత్వంలోనూ పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికి కట్టబెడుతున్నారన్నది వాళ్ళ ఆవేదన. అధినేత పవన్ కల్యాణ్ పిలుపుతో రాజకీయాలలోని వచ్చిన తాము ప్రభుత్వం పదవులు ఆశించడం లేదని, కనీసం పార్టీ కోసం చేసిన కృషిని కూడా గుర్తించి కమిటీల్లో చోటు కల్పించకపోవడం ఏంటని అంటున్నారు ద్వితీయ శ్రేణి నేతలు. దశాబ్దానికిపైగా పార్టీ కండువాను భుజాలపై వేసుకొని మోస్తుంటే… ఇప్పుడు ఒక సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యత ఇస్తూ మిగతా వాళ్ళను పట్టించుకోవడం లేదంటున్నారు ఇతరులు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కాపులతో పాటు , కాళింగ, వెలమ సామాజికవర్గాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. మరో వైపు యాదవులు , మత్స్యకారులు కూడా పెద్ద ఎత్తున జనసేనకు మద్దతుగా నిలబడుతున్నారు. వారికి సైతం ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోతోందన్న ఆవేదన పెరుగుతోంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ పరంగా కూటమి ధర్మాన్ని అనుసరించి దక్కిన పదవుల్లో అత్యధికం కాపులకు ఇవ్వడం ఏంటన్నది మిగతా కులాల ప్రశ్న. కాపులకు ఛైర్మన్ పదవులు ఇచ్చి మిగతా వాళ్ళకు డైరెక్ట్ పోస్ట్‌లతో సరిపెట్టారన్నది ప్రధాన అభియోగం. పీఎస్‌సీఎస్ అధ్యక్షులుగా రాజాం , శ్రీకాకుళం , హిరమండలం , పాలకొండలలో కాపులకు మాత్రమే కేటాయించారని అంటున్నారు. పార్టీ పరంగా చూసుకున్నా… జిల్లా అధ్యక్షడితో పాటు రెండు ఉపాధ్యక్షపదవులు , కార్యదర్శులతో సహా… మెత్తం కార్యవర్గం అంతా కాపులతో నింపేయడం ఏంటని అంటున్నారు. ఐతే ఈ విషయాలను బయటకు చెప్పలేకపోతున్న ఇతర ప్రధాన సామాజిక వర్గాల నాయకులు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో కాపులకు వైసిపి , టిడిపిల్లో ప్రాధాన్యత లేదన్న టాక్ నడుస్తోంది. అలా… రాజకీయంగా ఇబ్బందులు పడుతున్న కాపులకు జనసేన ఆకర్షిస్తోందట. ఐతే ఇతర కులాలను కూడా కలుపుకునిపోతేనే సిసలైన రాజకీయం తప్ప… ఒకే కులానికి పరిమితమైతే ఎదుగుదల ఎలాగన్న చర్చ జనసేన వర్గాల్లోనే జరుగుతోంది.
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
- OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్‌గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్‌కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
తాజావార్తలు
-
Super Subbu: బోల్డ్ సబ్జెక్టే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు.. ‘సూపర్ సుబ్బు’పై సందీప్ కిషన్ హామీ
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Aarogya Setu 2.0: ఆరోగ్య సేతు 2.0 వచ్చేసింది!.. నిమిషాల్లో OPD బుకింగ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్..!
-
Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. ‘నా వ్యాఖ్యల్లో తప్పు లేదు’..!
-
Pakistan Minister: “చేతులు నరికేస్తాం”.. సింధు జలాల విషయంలో భారత్‌కు పాక్ మంత్రి వార్నింగ్!
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్‌ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!