Off The Record: శ్రీకాకుళం జిల్లా జనసేనలో అసంతృప్తి చాపకింద నీరులా విస్తరిస్తోందట. పార్టీ ఆవిర్భావం నుంచి నిబద్ధతతో పనిచేస్తున్నా ఫలితం లేకుండా పోతోందని కీలక నేతలు ఆవేదన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తమకు పార్టీ, ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని భావించిన నేతలు ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాలతో అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటు పార్టీలోనూ అటు ప్రభుత్వంలోనూ పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికి కట్టబెడుతున్నారన్నది వాళ్ళ ఆవేదన. అధినేత పవన్ కల్యాణ్ పిలుపుతో రాజకీయాలలోని వచ్చిన…