Off The Record : పుట్టా మహేష్ డ్రగ్స్ ఎపిసోడ్ పై టీడీపీ రియాక్షన్ ఏంటి..?
- పుట్టా మహేష్ డ్రగ్స్ ఎపిసోడ్‌పై ఏలూరు తమ్ముళ్ళ ఆవేదన..
- ఎంపీ వల్ల ఏలూరు పరువు పోయిందంటూ గుసగుసలు..
- పుట్టా మహేష్‌కు ఇప్పటికే విజిటింగ్ ఎంపీ అన్న పేరు..
- తల కొట్టేసినట్టయిందంటున్న లోకల్ టీడీపీ లీడర్స్..
- ప్రభావం ఉభయ గోదావరి జిల్లాల మీద ఉంటుందన్న అంచనాలు..
- పుట్టాను పక్కన పెట్టుకుని గతంలో చంద్రబాబు డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం..
- పుట్టా పక్కన ఉండగానే బాబు ప్రకటించిన వీడియోల ట్రోలింగ్..
- తెర మీదికి లోకల్ తమ్ముళ్ళ పాత పగలు..
- గోదావరి వాసుల్ని కన్విన్స్ చేయడం తేలిక కాదన్న లెక్కలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record : ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు భావిస్తున్నారట ఏలూరు జిల్లా టిడిపి నాయకులు. ఈ బటర్‌ఫ్లై రియాక్షన్ ఎఫెక్ట్స్ మాకేంట్రా బాబూ… అని తల కొట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎంపీ పుట్టా మహేష్ ఎపిసోడ్ ఎక్కడ నియోజకవర్గంలో పార్టీ పుట్టి ముంచుతుందోనన్నది లోకల్ తమ్ముళ్ళ ఆవేదన. అసలు మాకు ఆయనగారు వద్దే వద్దని ఎన్నికలకు ముందు నుంచే చెబుతున్నామా….? అయినా పార్టీ పెద్దలు పట్టించుకోకుండా, ఇక్కడెవరూ లేరన్నట్టు ఎక్కడి నుంచో తెచ్చి మా నెత్తిన రుద్దారు. ఇప్పుడు చూడు ఏమైందో…. ఎంపీ డ్రగ్స్ కేసు ఎపిసోడ్‌తో ఏలూరు పరువు పోయిందంటూ గట్టిగానే మాట్లాడుకుంటున్నారట. ఇప్పటికైనా మా నాయకులకు కనువిప్పు కలిగితే అదే పదివేలు అన్నది ఏలూరు టీడీపీ లీడర్స్ మాట. గెలిచాక కూడా ఆయన లోకల్‌గా ఉన్నది లేదని, పుట్టా మహేష్ విజిటింగ్ ఎంపీగా నెలకో, రెండు నెలలకో ఒకసారి రావడం, స్పెషల్ ఎలివేషన్స్ ఇచ్చి పోవడం మినగా ఆయనవల్ల ఒరిగింది ఏమీ లేదని చెప్పుకుంటున్నారు.
ఎంపీగా నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేకపోగా… ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఏలూరు ఎంపీ అన్న ట్యాగ్‌లైన్‌తో… అధిష్టానం సంగతేమోగానీ…. మాకు మాత్రం తల కొట్టేసినట్టుందన్నది లోకల్ టీడీపీ లీడర్స్ వాయిస్. అసలు ఇలాంటివి బయటపడకుండా ఉండటం కసమే చుట్టూ బలమైన కోటరీని మెయిన్‌టెయిన్ చేస్తున్నారా అంటూ ఘాటుగానే అడుగుతున్నారు కొందరు టీడీపీ నాయకులు. ఎప్పటినుంచో పార్టీలో ఉన్న స్థానిక నేతల్ని కాదని ఏరికోరి కడప జిల్లా నుంచి తీసుకువచ్చి మరీ… పార్టీ అధిష్టానం టిక్కెట్ ఇచ్చి, మేం గెలిపిస్తే…. చివరికి అందరి చీటీలు చింపేశారంటూ సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్నారు ఏలూరు తెలుగుదేశం లీడర్స్. నాడు అందర్నీ కాదని పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడ్డామని, అదే ఇప్పుడు కొంపముంచిందని గుసగుసలాడుకుంటున్నారట. నిండా రెండేళ్ళు పూర్తవక ముందే పడ్డ డ్రగ్స్ మరకతో ఇప్పుడు ఏలూరు నియోజకవర్గం పరిధిలో పార్టీకి కూడా ఇబ్బందులు తప్పవన్నది లోకల్ అంచనా. గోదావరి జిల్లాలపై రాయలసీమ నేతల పెత్తనం ఏంటంటూ వైసీపీ హయాంలో పరోక్షంగా మిథున్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి టార్గెట్‌గా ప్రచారం చేసింది టీడీపీ. ఆ ప్రచారం ఎంతో కొంత కలిసొచ్చిందన్న అంచనాలు కూడా ఉన్నాయి. తీరా తనదాకా వచ్చేసరికి కడపకు చెందిన పుట్టా మహేష్‌ను ఏలూరు బరిలో దింపడంతో ఏమీ అనలేక కామ్‌గా ఉండిపోయింది పార్టీ కేడర్. ఇప్పుడు ఎంపీవల్ల పార్టీకి అంటుకున్న మరక ఏ మాత్రం మంచిది కాదన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. దీని ప్రభావం ఒక్క ఏలూరు లోక్‌సభ సీటుకే పరిమితం కాదని, మొత్తం ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో టీడీపీ మీద ఉంటుందని చెప్పుకుంటున్నారు.
Also Read
వైసీపీ చేతిలో ఇది గట్టి అస్త్రం అవుతుందని, తాము ఎలా సమర్ధించుకోవాలో అర్ధంకాని స్థితిలో ఉన్నామన్నది ఏలూరు తెలుగుదేశం నేతల మాట. గతంలో ఇదే పుట్టా మహేష్‌ను పక్కన ఉంచుకుని… గంజాయి, డ్రగ్స్ ని నిర్మూలిస్తానంటూ పార్టీ అధినేత చేసిన ఎన్నికల ప్రచార వీడియోల్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు వైసిపి కార్యకర్తలు. ఇక ఇదే సమయంలో టీడీపీ సీనియర్ లీడర్ మాగంటి బాబుకు మద్దతు పెరుగుతోంది. గతంలో రెండు సార్లు ఎంపీగా పనిచేసిన మాగంటికి మాటమాత్రమైనా చెప్పకుండా గత ఎన్నికల్లో పుట్టా మహేష్‌కు అవకాశం కల్పించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారట. నాడు సీనియర్లను కాదని.. పార్టీ అవసరాల పేరుతో ముందు వెనుక చూసుకోకుండా తీసుకున్న నిర్ణయాలకు ఇప్పుడు ఎవరు బాధ్యత తీసుకుంటారన్నది ఏలూరు తమ్ముళ్ల క్వశ్చన్. ఏలూరు ఎంపీ సీటుతో పాటు మొత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పార్టీ మీద ఎఫెక్ట్ పడకుండా అధిష్టానం ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలని అంటున్నారు. వాళ్ళు చర్యలు తీసుకుంటారా లేదా అన్న సంగతి పక్కన పెడితే…. ఈ పరిస్థితుల్లో గోదావరి వాసుల్ని కన్విన్స్ చేయడం మాత్ర అంత తేలిక కాదన్న మాటలు టీడీపీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Bhojshala Case: “భోజ్‌శాల ఆలయం కాదు”.. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
-
Full Body Checkup : 30 ఏళ్లు దాటాయా? ఈ టెస్టులు మిస్ అయితే రిస్క్.!
-
Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
-
VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. ఛీప్ గెస్ట్‌లు వీరే!
-
IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..